breaking news
average cost
-
నట్టింట్లో.. నెట్టింట్లో..
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందో లేదో తెలియదు గానీ.. ఈ ప్రపంచం అంతా మాత్రం ఇంటర్నెట్ చుట్టే తిరుగుతోంది. మొబైల్ ఇంటర్నెట్ రేట్లు తగ్గడంతో ఇప్పుడు నెట్ అన్నది సామాన్యుడి నట్టింట్లోకి వచ్చి తిష్టేసి మరీ కూర్చొంది. మనం కూడా శ్రద్ధగా దించిన తల ఎత్తకుండా తలా ఓ లైక్, ఓ షేరు చేసుకుంటూ.. నెట్టింట్లో మునిగి తేలుతున్నాం. ఇదంతా పక్కనపెడితే.. మనకు బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి.. ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ వాడుతుంటారు. ఒకరు నెలకు రూ.450 ప్లాన్ అయితే.. మరొకరు రూ.3 వేలది వాడుతుంటారు. ఇంతకీ మన దేశంలో నెలకు బ్రాడ్‌బ్యాండ్‌కు అయ్యే సగటు వ్యయం ఎంత? మిగతా దేశాల్లో రేట్లు ఎలా ఉన్నాయి? షాక్ కొట్టే రేట్లు ఏయే దేశాల్లో ఉన్నాయి? అన్న వివరాలు మీకు తెలుసా.. కొన్ని దేశాల్లో మనతో పోలిస్తే.. మరీ తక్కువగా ఉంటే.. సరైన బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలు లేని ఆఫ్రికా దేశాల్లో నెల జీతం ఇంటర్నెట్కే తగలెట్టాల్సిన స్థాయిలో రేట్లున్నాయి. ఇరాన్లో అత్యంత తక్కువగా నెలకు సగటు ధర రూ.350 ఉంటే.. అత్యధికంగా ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో రూ.60 వేలు, ఆస్ట్రేలియా సమీపంలోని పపువా న్యూ గినీలో రూ.37 వేలుగా ఉంది. బ్రాడ్‌బ్యాండ్‌కు అయ్యే సగటు వ్యయం (నెలకు) రూ.1,280 కన్నా తక్కువ రూ.1,280–రూ.3,194 మధ్య రూ.3,194–రూ.6,389 మధ్య రూ.6,389–రూ.12,779 మధ్య రూ.12,779–రూ.31,948 మధ్య రూ.31,948 అంతకన్నా ఎక్కువ -
పిల్లల చదువుకు 12 లక్షలు
దేశంలో తల్లిదండ్రులు సగటున పెడుతున్న ఖర్చు ముంబై: భారత్‌లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం చేస్తున్న సగటు ఖర్చు రూ.12.22 లక్షలు. ప్రాథమిక పాఠశాల నుంచి పన్నెండో తరగతి వరకు అవుతున్న వ్యయమిది. ప్రపంచ సగటు రూ.28.58 లక్షల (44,221 డాలర్లు)తో పోలిస్తే ఇది చాలా తక్కువని హెచ్ఎస్బీసీ ‘ద వ్యాల్యూ ఎడ్యుకేషన్’సిరీస్ ‘హయ్యర్ అండ్ హయ్యర్’ అధ్యయనంలో తేలింది. ఇందులో ట్యూషన్ ఫీజులు, పుస్త కాలు, రవాణా, వసతి తదితర ఖర్చులన్నీ ఉన్నాయి. అం తేకాదు.. 59% మంది భారత తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం వేతనాల నుంచి ఖర్చు చేస్తుండగా, మరికొంతమం ది సేవింగ్స్, పెట్టుబడులు, ఇన్సూరెన్స్ ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. 32% మంది చేసే ఉద్యోగానికి తోడు అదనపు గంటలు పనిచేస్తున్నారు. హాంకాంగ్ టాప్: ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే... హాంకాంగ్ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం అత్యధికంగా సగటున రూ.85.42 లక్షలు ఖర్చు పెడుతున్నారు. తరువాతి స్థానాల్లో యూఏఈ (రూ.64.23 లక్షలు), సింగపూర్ (రూ.45.85 లక్షలు) ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉండగా... ఫ్రాన్స్ రూ.10.8 లక్షలతో అట్టడుగున ఉంది. భారత్‌తో పాటు 15 దేశాలు... ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, హాంకాంగ్, ఇండోనేసియా, మలేసియా, మెక్సికో, సింగపూర్, తైవాన్, బ్రిటన్, అమెరికా, యూఏఈల్లోని 8,481 మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. ‘ప్రస్తుతం ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో విద్య కీలకంగా మారింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు తమ పిల్లలు అత్యుత్తమ ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆశిస్తున్నారు. ఇందుకు తమ వ్యక్తిగత, జీవనశైలి, ఆర్థిక త్యాగాలు చేసి పిల్లలను చదివిస్తున్నారు’ అని హెచ్ఎస్బీసీ భారత్ హెడ్ రామకృష్ణన్ చెప్పారు. పీజీకే అధిక ప్రాధాన్యం: భారత్‌లోని ప్రతి పది మందిలో 9 మంది (94 శాతం) తల్లిదండ్రులు తమ పిల్లలతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయించాలని భావిస్తు న్నారు. వీరిలో 79 శాతం మంది అందుకు తగిన నిధులు కూడా సమకూర్చుకుంటున్నారు.