breaking news
Ava
-
డియర్ ప్రెసిడెంట్.. నాపేరు ఎవా..
వాషింగ్టన్ : అమెరికాలోని సౌత్ కరొలినాలోగల టౌన్‌విల్లే పట్టణంలో ఎవా ఓస్లేన్ అనే చిన్నారి.. స్నేహితుడు జాకోబ్‌తో కలిసి రోజూ స్కూల్‌కు వెళ్లేది. ఒకరోజు 14 ఏళ్ల అబ్బాయి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జాకోబ్.. చికిత్స పొందుతూ మూడురోజుల తర్వాత మరణించాడు. 2016లో ఈ ఘటన ఎవా కళ్లముందే జరిగింది. కాల్పుల తాలూకు షాక్, స్నేహితుడు దూరమయ్యాడన్న బాధతో ఎవా మానసికంగా కుంగిపోయింది. పాఠశాలకు వెళ్లాలంటేనే భయపడిపోతోంది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆమెకు ఇంటివద్దే చదువు చెబుతున్నారు ఏడాది తర్వాత లేఖ.. స్నేహితుడి మరణాన్ని మర్చిపోలేని ఎవా 2017 ఆగస్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాసింది. ‘డియర్ మిస్టర్ ప్రెసిడెంట్, నా పేరు ఎవా రోస్ ఓస్లేన్. నాకు ఏడేళ్లు. రెండో తరగతి చదువుతున్నాను. గత ఏడాది టౌన్‌విల్లే ఎలిమెంటరీ స్కూల్ దగ్గర జరిగిన కాల్పుల్లో నా స్నేహితుడు జాకోబ్ ప్రాణాలు కోల్పోయాడు. అది చూసి నేను చాలా భయపడ్డాను. జాకోబ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు తుపాకులు అంటే అసహ్యం. నా బెస్ట్ ఫ్రెండ్‌ని కోల్పోయాను. మీరు చిన్నారులకు రక్షణ కల్పిస్తారా? మమ్మల్ని ఎలా కాపాడుతారు?’ అంటూ లేఖలో ప్రశ్నించింది. ట్రంప్ సమాధానం.. ‘డియర్ ఎవా, నీ స్నేహితుడు జాకోబ్ మరణం గురించి బాధపడుతున్నా. చిన్నారులు అన్ని విషయాలు నేర్చుకునేది పాఠశాలలోనే. అక్కడ భయం ఉండకూడదు. అమెరికాలో చిన్నారులు సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా చేయడమే నా లక్ష్యం. అమెరికన్ల రక్షణ గురించి, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మరింత కృషి చేస్తాన’ని లేఖలో పేర్కొన్నారు. ఏం చేస్తారో చెప్పనేలేదు.. ట్రంప్ నుంచి వచ్చిన సమాధానం చూసి ఎవా చాలా సంతోష పడింది. అయితే ఆ లేఖలో పిల్లల రక్షణ కోసం ఏం చేస్తారో చెప్పనేలేదంటూ ట్రంప్‌కు మరో ఉత్తరం రాసింది. పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తనకు తోచిన విధంగా ఐడియాలను కూడా రాసి మరో లేఖను పంపించింది. –సాక్షి, స్కూల్ ఎడిషన్ కాల్పుల్లో మరణించిన జాకబ్ ఎవా ఓస్లేన్ రాసిన లేఖలో ఒక భాగం -
‘అవా’తో అమ్మతనం!
సంతానలేమితో బాధపడుతున్న వారికో శుభవార్త. పండంటి బిడ్డను జన్మనివ్వాలన్న వారి ఆకాంక్ష నెరవేర్చేందుకు ఓ హైటెక్ పరికరం అందుబాటులోకి వచ్చింది. మహిళలు చేతికి తొడుక్కునే వీలుండే ఈ పరికరం నెలసరిలో గర్భం దాల్చేందుకు ఎక్కువ అవకాశాలున్న ఐదు రోజులను గుర్తించి ఆ సమాచారాన్ని అందిస్తుంది. భార్యాభర్తల్లో వైద్యపరమైన సమస్యలేవీ లేకున్నా చాలా మందికి సంతానం కలగకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి వారికోసం ‘అవా’ అనే కంపెనీ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. రాత్రి సమయంలో దీన్ని ధరించి పడుకుంటే చాలు. గుండె కొట్టుకునే వేగం, శరీర ఉష్ణోగ్రత, శ్వాసక్రియ రేటు వంటి అంశాలను గుర్తించి మహిళల్లో అండాలు విడుదలయ్యే సమయాన్ని లెక్కిస్తుంది. ఈస్ట్రాడయోల్, ప్రొజెస్టిరాన్ హర్మోన్ల మోతాదు పెరిగినపుడు వచ్చే సూచనలను గుర్తిస్తుంది. సరైన సమయాన్ని గుర్తించడంలో ఈ పరికరం 89 శాతం విజయవంతమైందని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలో అందుబాటులో ఉన్న ‘అవా బ్రేస్లెట్’ ఖరీదు దాదాపు రూ.14 వేలు!