breaking news
Arbitrage funds
-
సమతూకమైన పోర్ట్‌ఫోలియోకు ఇన్‌కం–ఆర్బిట్రేజ్ ఫండ్స్
ధరల పెరుగుదల, మారిపోతున్న ఆర్థిక లక్ష్యాలు, అంతటా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇటు స్థిరంగా ఉంటూ అటు సమర్ధంగా పనిచేయగలిగే విధంగా సమతౌల్యతను పాటించే సాధనాల కోసం ఇన్వెస్టర్లు అన్వేషిస్తున్నారు. సాంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో సాధారణంగా, – అయితే భద్రత, లేకపోతే వృద్ధి – ఇలా ఏదో ఒక దాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) హైబ్రిడ్ విధానాన్ని అందిస్తాయి. మార్కెట్ టైమింగ్‌పై లేదా డైనమిక్ మార్పులపైన ఆధారపడకుండా ఇటు డెట్ అటు ఆర్బిట్రేజ్ వ్యూహాల సామర్థ్యాల మేళవింపుగా ఇది ఉంటుంది. తక్కువ ఒడిదుడుకులతో మెరుగైన రాబడులు అందిస్తాయని వీటికి పేరుంది. కాబట్టే, మధ్యకాలిక వ్యవధికి లిక్విడిటీ, పన్ను ఆదా ప్రయోజనాలు, పెట్టుబడి సంరక్షణను కోరుకునే ఇన్వెస్టర్లకు ఇవి ఆసక్తికరంగా ఉండగలవు. ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ ఎఫ్వోఎఫ్లుఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) స్వరూపం ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి ప్రధానంగా నిర్దిష్ట డెట్ ఆధారిత ఫండ్స్‌లో (65 శాతం వరకు), మిగతా మొత్తాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ సాధనాల స్థిరత్వాన్ని, అలాగే ఈక్విటీ మార్కెట్లలో ధరల్లో స్వల్పకాలిక తేడాలను ఒడిసిపట్టుకుని, అధిక రాబడులు అందించగలిగే ఆర్బిట్రేజ్ వ్యూహాన్ని కలగలిపి మెరుగైన ఫలితాలను అందించడం ఈ వ్యూహం లక్ష్యం. ఫైనాన్స్ చట్టం 2024 (నం.2) కింద ఏదైనా ఎఫ్‌వోఎఫ్ తన పోర్ట్‌ఫోలియోలో 35 శాతం నుంచి 65 శాతం వరకు మొత్తాన్ని ఆర్బిట్రేజ్ స్కీములకు (పన్ను విధింపునకు సంబంధించి వీటిని ఈక్విటీగా పరిగణిస్తారు) కేటాయిస్తే, దాన్ని నాన్–స్పెసిఫైడ్ మ్యుచువల్ ఫండ్‌గా వ్యవహరిస్తారు.ఈ వర్గీకరణ వల్ల ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్స్ ప్రత్యేకమైన పన్నుపరమైన ప్రయోజనాన్ని కూడా అందిస్తాయి. అదేమిటంటే, యూనిట్లను రెండేళ్లు లేదా అంతకు మించిన వ్యవధికి అట్టే పెట్టుకునే ఇన్వెస్టర్లకు ఇండెక్సేషన్ ప్రయోజనాలతో 12.5% ట్యాక్స్ రేటు వర్తిస్తుంది. సాధారణంగా హోల్డింగ్ పీరియడ్‌తో సంబంధం లేకుండా ఇన్వెస్టర్ శ్లాబ్ రేట్‌కి తగ్గట్లుగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తించే సంప్రదాయ సాధనాలతో పోలిస్తే ఇది పన్ను ఆదా ప్రయోజనాలను కల్పిస్తుంది. 2–5 ఏళ్ల మధ్యకాలిక పెట్టుబడి వ్యవధికి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్స్ అనువైనవి. ఎవరికి మేలంటే..ఒక మోస్తరు సంపద వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంటూనే, మూలధనాన్ని కాపాడుకునేందుకు తక్కువ రిస్కులున్న సాధనాల కోసం అన్వేషించే మదుపరులకు ఇవి ఉపయోగకరం. పెద్దగా రిస్క్ తీసుకోకుండా, ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల్లో పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని కోరుకునే వారు పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ఇవి సహాయకరం. ప్రస్తుతం వడ్డీ రేట్లు మారుతుండటం, అంతర్జాతీయంగా అనిశ్చితులు, ఆర్థిక విధానాలు మారిపోతుండటం తదితర పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకెళ్లే క్రమంలో ఇన్వెస్టర్లకు ఈ పెట్టుబడి వ్యూహం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.స్థిరమైన ఆదాయం: మార్కెట్ షాక్‌లను తట్టుకునేందుకు డెట్ సాధనం ఉపయోగపడుతుంది. నమ్ముకోతగిన ఆదాయ వనరుగా నిలుస్తుంది. అలాగే ఈక్విటీల్లో పెట్టుబడులపరంగా ఎదురయ్యే ఒడిదుడుకులను తగ్గిస్తుంది. సరళతరం, లిక్విడిటీ: లాకిన్ పీరియడ్లు ఉండే సంప్రదాయ సొల్యూషన్స్‌తో పోలిస్తే ఈ ఫండ్స్ సాధారణంగా మరింత మెరుగైన లిక్విడిటీని ఆఫర్ చేస్తాయి. భారీ పెనాల్టీల భారం లేకుండా కావాల్సినప్పుడు తమ యూనిట్లను రిడీమ్ చేసుకునేలా ఇన్వెస్టర్లకు వెసులుబాటు కల్పిస్తాయి.ప్రాక్టికల్ ప్రయోజనాలు: నిర్దిష్ట డెట్, ఆర్బిట్రేజ్ స్కీముల మధ్య కేటాయింపులను ఫండ్ మేనేజరే అటూ, ఇటూ మారుస్తుండటం వల్ల (ఫండ్ ఆఫ్ ఫండ్ స్వభావరీత్యా) ఇన్వెస్టరుపై ట్యాక్స్ లయబిలిటీ ఉండకపోవడమనేది ఈ తరహా ఫండ్ ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. ఎఫ్ఓఎఫ్ స్వరూపరీత్యా అంతర్గతంగానే ఈ మార్పులు జరగడం వల్ల, యూనిట్లను రిడీమ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్టర్లకు ట్యాక్స్ భారం పడుతుంది. ఆ విధంగా ఇది తక్కువ వ్యయాలతో కూడుకున్న, పన్ను ఆదాపరమైన ప్రయోజనాలను కల్పించే విధంగా ఉంటుంది. ఫిక్సిడ్ ఇన్‌కం పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని కోరుకునే ఇన్వెస్టర్లు, మధ్యకాలిక లక్ష్యాలకు ప్లాన్ వేసుకుంటున్న వారు, పోర్ట్‌ఫోలియోకి మరింత రక్షణ కవచాన్ని ఏర్పర్చుకోదల్చుకున్న వారు ఈ ఫండ్స్‌ను తప్పక పరిశీలించవచ్చు.ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా? -
ఆర్బిట్రేజ్ ఫండ్స్‌తో మెరుగైన రాబడులు
వేగంగా మారిపోయే పెట్టుబడుల ప్రపంచంలో సాధారణంగా మనం ఊహించని సందర్భాల్లో అవకాశాలు వస్తుంటాయి. ధరలపరంగా ఉండే వ్యత్యాసాలను ఉపయోగించుకుని, లబ్ధిని పొందే వ్యూహమే ఆర్బిట్రేజ్. మార్కెట్లో ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని, మెరుగైన రాబడులను అందించే లక్ష్యంతో ఏర్పడ్డ కొత్త తరహా మ్యుచువల్ ఫండ్సే ‘ఆర్బిట్రేజ్ ఫండ్స్’. వీటితో ఇన్వెస్టర్లకు ప్రయోజనం ఏమిటి, ఇవి ప్రాచుర్యంలోకి పొందడం వెనుక కారణాలేంటి, ప్రస్తుతం భారత మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల్లో ఆదరణ ఎందుకు పెరుగుతోంది అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునేందుకు ఒకసారి ఆర్బిట్రేజ్ ఫండ్స్ కాన్సెప్టు, పని తీరు, సామర్థ్యాల గురించి తెలుసుకుందాం.ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇలా..‘అ’ అనే కంపెనీ ఈక్విటీ షేర్లు, క్యాష్ మార్కెట్లో రూ.100 వద్ద, ఫ్యూచర్ మార్కెట్లో రూ.102 వద్ద (ధర ప్రీమియంలో వ్యత్యాసాల వల్ల) ట్రేడవుతున్నాయనుకుందాం. ఫండ్ మేనేజరు ‘అ’ కంపెనీ షేర్లను క్యాష్ మార్కెట్లో రూ.100కు కొని, వాటిని ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.102కు అమ్మాలని అనుకున్నారనుకుందాం. సాధారణంగా నెలాఖరున, ఫ్యూచర్ కాంట్రాక్టు ఎక్స్పైర్ అయిపోయే సమయానికి క్యాష్ మార్కెట్, అటు ఫ్యూచర్స్ మార్కెట్ ధరలు ఒకే స్థాయికి సర్దుబాటు అవుతాయి. అప్పుడు ఫండ్ మేనేజరు తన ట్రేడింగ్ లావాదేవీని రివర్స్ చేసి, రెండు ధరల మధ్య వ్యత్యాసమైన రూ.2 మొత్తాన్ని రాబడిగా పొందుతారు.స్టాక్స్, డెరివేటివ్స్ మార్కెట్లలో ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసే మ్యుచువల్ ఫండ్స్‌ను ఆర్బిట్రేజ్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. మరింత సరళంగా చెప్పాలంటే ఒక అసెట్ స్పాట్ ధర (స్టాక్ మార్కెట్లో), దాని ఫ్యూచర్ ధర (డెరివేటివ్స్ మార్కెట్లో) మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఉపయోగించుకుని ఈ ఫండ్స్ లబ్ధిని పొందుతాయి. అల్గోరిథమ్‌లు, నిపుణులైన ఫండ్ మేనేజర్ల సహాయంతో స్పాట్, ఫ్యూచర్స్ మార్కెట్లలో ధరల వ్యత్యాసాన్ని ఈ ఫండ్స్ నిరంతరం పరిశీలిస్తూ ఉంటాయి. అయితే, అవకాశాలు క్షణాల్లో ఆవిరైపోతాయి కాబట్టి, ఈ వ్యూహాన్ని అమలు చేయడమనేది చెప్పినంత సులువైన వ్యవహారం కాదు. ధరపరంగా వ్యత్యాసం చాలా తక్కువ పర్సెంటేజీ పాయింట్లలోనే ఉండొచ్చు, కానీ మార్కెట్లోని మిగతా వారు కూడా ఆ అవకాశాన్ని గుర్తించే ఆస్కారం ఉంది, కాబట్టి ఆ వ్యత్యాసం చాలా వేగంగా మాయమైపోవచ్చు. కనుక మిగతావారికన్నా వేగంగా స్పందించాల్సి ఉంటుంది.ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఆకర్షణీయంఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్‌ను ప్రోత్సహించే విధంగా సెబీ ఇటీవలే కొన్ని చర్యలు ప్రకటించింది. 2024 నవంబర్ 29 నుంచి అదనంగా 45 సెక్యూరిటీల్లో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను అనుమతించింది. అలాగే, మార్కెట్ వృద్ధికి అనుగుణంగా ఉండేలా 2024 నవంబర్ 20 నుంచి ఇండెక్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టు సైజును రూ.15 లక్షలకు పెంచింది. ఈ చర్యలన్నీ, దేశీయంగా డెరివేటివ్స్ మార్కెట్‌ను విస్తరించేందుకు, వైవిధ్యభరితంగా మార్చేందుకు, మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు, రిటైల్ ఇన్వెస్టర్లు మరింతగా పాలుపంచుకునేలా ప్రోత్సహించేందుకు దోహదపడతాయి. కొత్త ఫ్యూచర్స్ అందుబాటులోకి రావడం వల్ల ఫండ్లు వివిధ రంగాలు, కంపెనీలు, మార్కెట్ క్యాప్‌లవ్యాప్తంగా తమ వ్యూహాలను మరింత వైవిధ్యంగా అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం లాభాలపై పన్ను ఎంత?పెట్టుబడులతో ప్రయోజనాలుమిగతావాటితో పోలిస్తే తక్కువ రిస్క్: మార్కెట్ గమనంతో పట్టింపు లేకుండా ఈ విధానం చాలా సింపుల్‌గా ఉంటుంది. మార్కెట్లో స్ప్రెడ్లను గుర్తించి, తదుపరి ఎక్స్పైరీ వరకు ‘లాకిన్’ చేయడంపైనే ఫండ్ దృష్టి పెడుతుంది.ఒడిదుడుకుల మార్కెట్లలో అనుకూలం: మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు రాబడులను అంచనా వేయడమనేది చాలా మటుకు మ్యుచువల్ ఫండ్ స్కీములకు కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. మరోవైపు, మార్కెట్లు స్థిరంగా ఉన్నప్పుడైనా, ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడైనా తక్కువ రిస్క్‌తో కూడుకున్న వ్యూహాలుగా ఆర్బిట్రేజ్ ఫండ్లు మెరుగ్గా రాణించగలుగుతాయి. మార్కెట్ ఒడిదుడుకుల్లో షేర్ల ధరలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి కాబట్టి, వివిధ మార్కెట్లలో వాటిని అప్పటికప్పుడు కొని అమ్మేయడం ద్వారా, ఆ పరిస్థితిని ఆర్బిట్రేజ్ ఫండ్స్ తమకు అనువైనదిగా మార్చుకుంటాయి. పన్ను ప్రయోజనాలు: ఈ ఫండ్స్ స్వభావరీత్యా హైబ్రిడ్ ఫండ్సే అయినప్పటికీ ఈక్విటీ ట్యాక్సేషన్కి అర్హత ఉంటుంది. ఫండ్ మొత్తం అసెట్స్‌లో కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. ఆర్బిట్రేజ్ ఫండ్‌ను ఏడాదికన్నా ఎక్కువ కాలం అట్టే పెట్టుకుంటే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) కింద 12.5 శాతం పన్ను రేటే వర్తిస్తుంది (రూ. 1.25 లక్షల మినహాయింపునకు లోబడి). పన్ను ఆదా చేస్తూ, స్థిరమైన రాబడులను అందించే సాధనాలను కోరుకునే ఇన్వెస్టర్లకు, ఆర్బిట్రేజ్ ఫండ్లు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉండగలవు. మార్కెట్లో ఒడిదుడుకులను అవకాశాలుగా మల్చుకునే అధునాతన వ్యూహాలతో ఆర్బిట్రేజ్ ఫండ్స్ పనిచేస్తాయి. హెచ్చుతగ్గులు, లిక్విడిటీ, నియంత్రణపరంగా స్థిరత్వం నెలకొన్న భారత మార్కెట్లో, పెట్టుబడిని కాపాడుకుంటూ స్థిరమైన వృద్ధి కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్లు ఆకర్షణీ యమైన ఆప్షన్. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ కోసం హెడ్జింగ్ కోరుకునే ఇన్వెస్టర్లు, ఆర్బిట్రేజ్ ఫండ్లను తప్పక పరిశీలించవచ్చు.- కార్తీక్ కుమార్, ఫండ్ మేనేజర్, యాక్సిస్, మ్యుచువల్ ఫండ్ -
ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఎంత వరకు సురక్షితం?
ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఎంత వరకు సురక్షితం? ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో ఇవి ఉండాలా? ఈక్విటీలో నగదు, ఫ్యూచర్స్ మార్కెట్లో ధరల పరంగా ఉండే వ్యత్యాసాలను అవకాశాలుగా తీసుకుని ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఇవి. ఈ రూపంలోనే ఇవి రాబడులను ఆర్జిస్తుంటాయి. ఉదాహరణకు ‘ఎస్’ అనే స్టాక్ ఈక్విటీ మార్కెట్లో రూ.100 వద్ద ట్రేడవుతుందనుకుందాం. ఇదే స్టాక్ ఫ్యూచర్ మార్కెట్లో రూ.101 వద్ద ట్రేడవుతుందనుకుంటే.. ఈ సందర్భంలో ఆర్బిట్రేజ్ ఫండ్ ‘ఎస్’ స్టాక్‌ను ఈక్విటీలో రూ.100కు కొనుగోలు చేసి.. ఫ్యూచర్ మార్కెట్లో రూ.101కు విక్రయిస్తుంది. దీంతో ఒక రూపాయి లాభాన్ని సొంతం చేసుకుంటుంది. సెటిల్మెంట్ తేదీనాడు (అంటే నెల చివర్లో కాంట్రాక్టుల ముగింపు) ధర నగదు, ఫ్యూచర్ మార్కెట్లో ఒక్కటిగా మారుతుంది. దాంతో ఆర్బిట్రేజ్ ఫండ్ అదే స్టాక్‌కు సంబంధించి మళ్లీ లావాదేవీలను పునరావృతం చేస్తుంది. ఈ సారి నగదు మార్కెట్లో విక్రయించి ఫ్యూచర్ మార్కెట్లో కొనుగోలు చేస్తుంది. దీంతో ఆయా లావాదేవీలు సమం అవుతాయి. ఒక్క విడత ఇలా చేసినట్టయితే ముందు గడించిన రూపాయి లాభం ఖాయమైనట్టే. అంతేకానీ, సెటిల్మెంట్ తేదీనాటికి ఆయా స్టాక్ ధర పెరిగిందా, తరిగిందా అన్నదానితో సంబంధం ఉండదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇదే మాదిరి లావాదేవీలు నిర్వహిస్తూ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెడుతుంటాయి. ఆర్బిట్రేజ్ అవకాశాల్లేని సమయాల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులను ట్రెజరీ బిల్లులు, స్వల్పకాల డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. రిస్క్‌ను పరిశీలించినట్టయితే.. చాలా తక్కువ రిస్క్‌లోనే ఇవి ఉంటాయి. కాకపోతే స్వల్ప కాలంలో మాత్రం అస్థిరతలతో ఉంటుంటాయి. కనీసం మూడు నెలలు అంతకంటే ఎక్కువ కాలం కోసం అయితే నష్టాలకు అవకాశాలు చాలా తక్కువ. అదే సమయంలో ఆర్బిట్రేజ్ ఫండ్స్ నుంచి ఎక్కువ రాబడులను ఆశించరాదు. లిక్విడ్ ఫండ్స్ స్థాయిలో రాబడులను అంచనా వేసుకోవచ్చు. అంటే రాబడులు బ్యాంకు ఖాతాల కంటే మెరుగ్గా ఉంటాయని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంలో మంచి రాబడులు, సంపద కోసం ఆర్బిట్రేజ్ ఫండ్స్ అనుకూలం కావు. కొన్ని నెలల నుంచి ఏడాది వరకు తమ నిధులను ఒక్కచోట ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారికి అనుకూలం. ముఖ్యంగా అధిక పన్ను రేటులో (30 శాతం) ఉన్న వారికి ఆర్బిట్రేజ్ ఫండ్స్ లాభదాయకం. ఎందుకంటే ఇందులో రాబడులను ఈక్విటీ రాబడులుగానే ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. అధిక పన్ను రేటులో లేని వారు, చాలా స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే లిక్విడ్ ఫండ్స్ సరిపోతాయి. ఇప్పటికైతే డివిడెండ్ ఇచ్చే మంచి మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉందా?.. అలాగే కనీసం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? – రత్నాకర్ డివిడెండ్ కోసం మ్యూచువల్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం అన్నది సరైన మార్గం కాదు. ఎందుకంటే దీనివల్ల పెద్దగా రాబడి ఉండదు. ఒక షేరును కొనుగోలు చేస్తే అది మీకు డివిడెండ్ ఇస్తుంది. అది స్టాక్ ధరలో సర్దుబాటు కాదు. అదే మ్యూచువల్ ఫండ్‌లో అయితే డివిడెండ్ చెల్లింపు ప్రభావం ఫండ్ యూనిట్ ఎన్ఏవీ (నికర యూనిట్ విలువ)లో ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక పథకంలో రూ.10 ఎన్‌ఏవీపై రూ.10,000ను ఇన్వెస్ట్ చేశారనుకుందాం. తర్వాత కాలంలో అది వృద్ధి చెంది ఎన్ఏవీ కాస్తా రూ.15కు చేరితే.. మీ పెట్టుబడి విలువ రూ.15,000 అవుతుంది. ఫండ్ సంస్థ రూ.2,000ను డివిడెండ్ కింద చెల్లించాలని నిర్ణయించినట్టయితే ఆ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. డివిడెండ్ చెల్లింపు ముగిసిన తర్వాత ఆ పథకంలో మీ పెట్టుబడి విలువ వెంటనే రూ.13,000కు తగ్గిపోతుంది. అంటే మీ పెట్టుబడుల నుంచి మీకు చెల్లింపులు చేయడం. ఫండ్స్‌లో డివిడెండ్ చెల్లింపుల విధానం ఇదే మాదిరిగా ఉంటుంది. కానీ, చాలా మంది ఫండ్స్ నుంచి వస్తున్న డివిడెండ్ పనితీరు కు నిదర్శనంగా పొరపడుతుంటారు. కానీ, స్టాక్‌లో అలా కాదు. లాభాల నుంచి డివిడెండ్ చెల్లింపులు చేయడం ఉంటుంది. ఫండ్‌ను డివిడెండ్ కోణం నుంచి ఎంపిక చేసుకోవడం సరికాదు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పైసా పైసా.. అదే వీటి స్పెషల్!
- డిపాజిట్లు, డెట్ ఫండ్స్ కంటే మెరుగైన రాబడి - ఎగుడు దిగుడు మార్కెట్లో ఇంకాస్త అధికం - పన్ను ప్రయోజనాలు కూడా అధికమే - స్వల్పకాలిక ఇన్వెస్టర్లకి ఆర్బిట్రేజ్ ఫండ్లే ప్రత్యామ్నాయం ఒకరకంగా చెప్పాలంటే ఈ ఫండ్లు నష్టాలనందించటమనేది ఎక్కడో తప్ప జరగదు. మార్కెట్లు పడుతున్నా, పెరుగుతున్నా వీటి పనితీరు భిన్నంగా ఉంటుంది కనక ఇవి లాభాలార్జించడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కాకపోతే మరీ ఈక్విటీ ఫండ్లలా మార్కెట్లు బాగున్నపుడు ఏడాదిలో 30 శాతం లాభాలివ్వటం... బాగులేనపుడు 30 శాతం నష్టాలివ్వటమనేది వీటిలో జరగదు. వీటిలో లాభాలొచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇవి పరిమితంగానే ఉంటాయి. బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువ ఉంటాయనేది మాత్రం చెప్పొచ్చు. అందుకే... ఈ ఒడిదుడుకుల మార్కెట్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. గతేడాది కేవలం రూ.13,885 కోట్లుగా ఉన్న ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విలువ ఇప్పుడు రూ.27,000 కోట్లు దాటింది. అంటే దాదాపు రెట్టింపయింది. దీన్నిబట్టే వీటికున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ ఫండ్స్‌పై అవగాహన కల్పించేదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం.. ఆర్బిట్రేజ్ ఫండ్స్ కొత్తవేమీ కావు. ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నవే. కొన్ని ఫైనాన్షియల్ సంస్థలైతే అచ్చంగా ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ మాత్రమే చేస్తాయి కూడా. కాకపోతే వీటిపై రిటైల్ ఇన్వెస్టర్లకు అవగాహన మాత్రం తక్కువే ఉంది. గతేడాది డెట్ ఫండ్స్ పన్ను ప్రయోజనాలను తగ్గించడం... వడ్డీరేట్లు కూడా తగ్గటంతో ఇన్వెస్టర్లు ఆర్బిట్రేజ్ వంటి ఇతర ప్రత్యామ్నాయ పథకాల కేసి చూస్తున్నారు. ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉండే ఈ ఫండ్లు... చాలా సందర్భాల్లో బ్యాంకు డిపాజిట్ల కంటే రెండుమూడు శాతం అధిక రాబడినే అందిస్తున్నాయి. ఇక బ్యాంకు డిపాజిట్లు, డెట్ ఫండ్స్‌తో పోలిస్తే పన్ను భారం వీటిలో తక్కువ. ఈ ఆకర్షణలే వీటివైపు రిటైలర్లు మొగ్గేలా చేస్తున్నాయిపుడు. ఎవరికి అనుకూలం.. స్వల్పకాలంలో బ్యాంకు డిపాజిట్ల కంటే అధికాదాయం కావాలనుకునే వారికి ఇవి అనుకూలమైనవని చెప్పొచ్చు. సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల కాలపరిమితిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే పన్ను ప్రయోజనాల కోసమైతే 12 నెలల వరకు వేచి చూడొచ్చు. అంతేకాని వీటిని దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా పరిగణించకూడదు. -
ఏంటా లాభాలు..
డిపాజిట్లు, డెట్ ఫండ్స్‌తో పోలిస్తే ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఆకర్షణీయమైన పన్ను ప్రయోజనాలున్నాయని చెప్పొచ్చు. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంలో 65 శాతం కంటే అధికంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వీటిని ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. దీంతో ఏడాది దాటిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను భారం ఉండదు. అదే ఏడాదిలోగా వైదొలిగితే 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభ పన్ను, ఆ పన్నుపై 3 శాతం సర్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే బ్యాంకు డిపాజిట్లలో వచ్చే వడ్డీ ఆదాయంపై మీ శ్లాబును బట్టి పన్ను భారం ఏర్పడుతుంది. అలాగే ఏడాదికి వడ్డీ రూ.10,000 దాటితే టీడీఎస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తింపు పరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచారు. దీంతో డెట్ ఫండ్స్ పన్ను ప్రయోజన ఆకర్షణను కోల్పోయాయి.


