breaking news
arambam
-
మళ్లీ ఫాంలోకి వచ్చాడు
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ నిర్మాణ సంస్థగా పేరున్న సూర్య మూవీ ఇటీవల కాలంలో ఆ జోరు చూపించలేకపోతుంది. శంకర్ లాంటి టాప్ డైరెక్టర్స్‌తో వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాత ఏఎమ్ రత్నం.. తర్వాత ఆ స్ధాయి విజయాలు సాధించలేకపోయాడు. ముఖ్యంగా ఒక కొడుకును హీరోగా, మరో కొడుకును దర్శకుడిగా పరిచయం చేసిన రత్నం, వారిని ఇండస్ట్రీలో నిలబెట్టే క్రమంలో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో చాలాకాలం సినిమాలకు దూరంగానే ఉండిపోయాడు. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రత్నం, ప్రస్తుతం మళ్లీ మంచి ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపిస్తున్నాడు. తన పాత బ్యానర్ శ్రీ సూర్యా మూవీస్ కలిసి రాలేదనుకున్నాడో ఏమో గాని, రీ ఎంట్రీలో కొత్త బ్యానర్ మీద సినిమాలు చేస్తున్నాడు. తన కూతురుని నిర్మాతగా పరిచయం చేస్తూ శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నాడు. అజిత్ హీరోగా తెరకెక్కిన ఆరంభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన రత్నం తరువాత, వరుసగా ఎన్నై అరిందాల్, వేదలం సినిమాలను అజిత్ హీరోగానే తెరకెక్కించాడు. ఈ మూడు సినిమాలు భారీ విజయాలు నమోదు చేయటంతో ఏఎమ్ రత్నం చాలా ఆనందం గా ఉన్నాడు. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన వేదలం ఫస్ట్ వీకెండ్లోనే సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టింది. భారీ వర్షాలు పడుతున్నా, ఇప్పటికీ మంచి కలెక్షన్లు వస్తుండటంతో ఈ సినిమా లాంగ్ రన్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనినిస్తోంది. దీంతో మరోసారి ఏఎమ్ రత్నంకు పూర్వ వైభవం రావడం ఖాయం అంటున్నారు కోలీవుడ్ సినీ అభిమానులు. -
స్టయిలిష్ ఆట
అజిత్, నయనతార ఓ జంటగా, ఆర్య, తాప్సీ మరో జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘ఆరంభం’. ఓ కీలక పాత్రను రానా చేసిన ఈ చిత్రానికి విష్ణువర్థన్ దర్శకత్వం వహించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాని ‘ఆట ఆరంభం’ పేరుతో ఓమిక్స్ క్రియేషన్స్ అధినేత డా. శీనుబాబు .జి తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ఈ 24న పాటలను, వచ్చే నెల 6న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా శీనుబాబు మాట్లాడుతూ - ‘‘తమిళంలో ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించింది. వసూళ్లపరంగా కొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో రానా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అంత అద్భుతంగా నటించారు. అజిత్ నటన, నయనతార, తాప్సీ అందచందాలు, యువన్‌శంకర్‌రాజా స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్టయిలిష్ దర్శకుడిగా గుర్తింపు ఉన్న విష్ణువర్థన్ టేకింగ్ ఓ హైలైట్. వాణిజ్య అంశాలు మెండుగా ఉన్న ఈ చిత్రం తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.