అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తుల వేలం
కర్నూలు: హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తులను ఈ.వేలం పాట ద్వారా విక్రయించనున్నట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ, సీఐడీ ఎస్పీ గజారావు భూపాల్ బుధవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తులు
ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలోని సర్వేనెం.176, 177/ఈ, 177/ఈ2, 185, 183, 184, 190లోని 24.23 ఎకరాల వ్యవసాయ భూమి.
అక్షయ గోల్డ్ ఆస్తులు
ఎమ్మిగనూరు పట్టణంలోని శివ సర్కిల్లో సర్వే నెం.282/బీలోని నివాస స్థలాన్ని(ప్లాట్ నెం.45,46లో 528.30 చదరపు గజాలు). ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక ధరావత్తు చెల్లించవచ్చు. బిడ్డింగ్ ఇతర విషయాలకు ఈ.యాక్షన్ పోర్టల్ వెబ్సైట్లలో https://konugolu.ap.gov.in (OR) www.cidap.gov.in చూసుకోవాలి. లేదా 94931 74045నెంబరును సంప్రదించవచ్చని ఎస్పీలు పేర్కొన్నారు.