Akshaya Tritiya 2025
-
అమ్మకాలు 'అక్షయం'!
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ అక్షయ తృతీయ రోజున పసిడి కొంటే కలిసొస్తుందన్న విశ్వాసం అమ్మకాలకు అండగా నిలిచింది. విలువ పరంగా 35 శాతం అధిక అమ్మకాలు ఉంటాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. పరిమాణం పరంగా గతేడాది మాదిరే 20 టన్నులుగా ఉండొచ్చని పేర్కొన్నారు. మరోపక్క, బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త శాంతించడం కూడా కలిసొచ్చింది. దక్షిణాదిన జ్యుయలరీ దుకాణాలకు ఉదయం నుంచే వినియోగదారులు క్యూకట్టారు. ఉత్తరాదిన మధ్యాహ్నం నుంచి వినియోగదారులు రావడం పెరిగింది. అయినప్పటికీ దక్షిణ భారత్‌లోనే కస్టమర్ల రాక అధికంగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా మంగళ సూత్రాలు, చైన్లు, వెండి ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగినట్టు వర్తకులు తెలిపారు. వివాహాల సీజన్ ఆరంభం కావడంతో మంగళసూత్రాల కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి చూపించినట్టు చెప్పారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు ధోరణి సాధారణంగా దక్షిణాదిన కనిపించేది. క్రమంగా ఇది ఉత్తరాదికీ విస్తరించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 25–40 ఏళ్ల వయసులోని కస్టమర్లు సైతం బంగారం కొనుగోళ్లకు ముందుకొచ్చినట్టు రోక్డే తెలిపారు. ముఖ్యంగా ఆభరణాలు, కాయిన్లు, బార్లు కొనుగోలుకు ఆసక్తి చూపించినట్టు చెప్పారు. ‘‘ధరల పెరుగుదలతో కొనుగోలు శక్తిపై ప్రభావం పడింది. అయినప్పటికీ అక్షయ తృతీయ రోజున బలమైన కొనుగోళ్ల సెంటిమెంట్ ఉంది’’ అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా సీఈవో సచిన్ జైన్ తెలిపారు. 2024 అక్షయ తృతీయ రోజున రూ.72,300గా ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర ఇటీవలే రూ. లక్ష స్థాయిని అధిగమించి... ప్రస్తుతం 99,000 స్థాయిలో ఉంది. అంటే దాదాపు 37 శాతం ఎగసింది. పాత ఆభరణాల మార్పిడి.. అక్షయ తృతీయ రోజున అమ్మకాల్లో 50 శాతం మేర పాత బంగారం మార్పిడితోనే ఉన్నట్టు పీఎన్జీ జ్యుయలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు బడ్జెట్ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. మొత్తం మీద గతేడాది అక్షయ తృతీయతో పోల్చి చూస్తే అమ్మకాలు 10–15 శాతం పెరిగాయని కామా జ్యుయలర్స్ ఎండీ కొలిన్‌షా తెలిపారు. దేశవ్యాప్తంగా కీలక మార్కెట్లలో స్టడెడ్ జ్యుయలరీ అమ్మకాలు పెరిగినట్టు జీఎస్ఐ ఇండియా ఎండీ రమిత్ కపూర్ వెల్లడించారు.దిగొచ్చిన బంగారం ధర అక్షయ తృతీయ రోజున బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.900 తగ్గి రూ.98,550 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు ఒకదశలో 43 డాలర్ల వరకు క్షీణించి 3,274 డాలర్లను తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆటో టారిఫ్‌ల ప్రభావం తగ్గించే దిశగా ఆదేశాలు జారీ చేయడం.. పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి చర్చల్లో పురోగతి ఉందని ప్రకటించడం బంగారం ధరలు తగ్గేందుకు కారణమైనట్టు కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కేనత్ చైన్వాలా తెలిపారు. -
అక్షయ తృతీయ.. దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి
అక్షయ తీజ్ లేదా పరశురామ జయంతి అని కూడా పిలిచే అక్షయ తృతీయ (Akshaya tritiya 2025) అనేది వైశాఖ మాసం చివర్లొ శుక్ల పక్ష తదియ నాడు జరుపుకునే వసంత పండుగ. అక్షయ అంటే శ్రేయస్సు, నాశనం లేనిది ఆశ, విజయంతో పాటు ఆనందం పరంగా శాశ్వతత్వం ,తృతీయ అంటే చంద్రుని మూడవ దశ.ఈ రోజు ద్రౌపది, కృష్ణుడు , అక్షయ పాత్రకు సంబంధించిన పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ప్రముఖ గాయని చిన్మయి (Chinmayi Sripada) ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది.అక్షయ తృతీయ అంటే దానం, ధర్మం చేయాల్సిన రోజని గుర్తు చేసింది.ద్రౌపది అక్షయ పాత్ర విశేషం తరువాత అక్షయ తృతీయను ఆచరణలోకి వచ్చిందని పేర్కొంది. ఈ రోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, పేదలకు ఒక్క రూపాయి అయినా దానం ఇవ్వాలని సూచించింది. మనుషులు, జంతువులు, మొక్కలు, పక్షులకు కాసింత ఆహారాన్ని పెట్టండి. ఈ దానమే ఇక చాలు అనే తృప్తి నిస్తుంది అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)ద్రౌపది అక్షయ పాత్రకథద్రౌపది, రాజకుమారులైన పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, సూర్యుడు తన తపస్సు ఫలితంగా పాండవులలో పెద్దవాడైన యుధిష్టురుడికి అక్షయ పత్రం ప్రసాదించాడు. పాండవ అగ్రజుడు ధర్మరాజు ద్రౌపద్యాదిత్యుడినే ఉపాసించి ఆ స్వామి నుంచి 'అక్షయ పాత్ర' వరంగా పొందినట్టు స్కాందపురాణంలోని 'కాశీఖండం' ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే పాండవులు వనవాస కాలంలో కృష్ణుడి నుండి అక్షయ పాత్రను పొందారు. ఇది ఒక మాయా పాత్ర, ఇది ఎల్లప్పుడూ వారికి ఆహారాన్ని అందించేది. ఆ అక్షయ పాత్ర ద్రౌపది భోజనం చేసే వరకు ఎల్లప్పుడూ ఆహారం ఉంటుంది , ఆ తరువాత తలక్రిందులుగా ఉంచుతుంది. అంటే అప్పటికి ఆహారం అయిపోతుంది. ఒకసారి కోపానికి, శాపానికి పేరుగాంచిన దుర్వాస ముని తన వేలాది మంది శిష్యులతో కలిసి పాండవుల ఇంటికి భోజనానికి వచ్చాడు. కానీ అప్పటికి ఆహారం అంతా అయిపోయింది . తినడానికి ఏమీ లేదు. బ్రాహ్మణులు వచ్చినప్పుడు పాత్ర ఖాళీగా ఉండటంతో ద్రౌపది శ్రీకృష్ణుడి సహాయం కోసం ప్రార్థించింది.అలా శ్రీకృష్ణుడికి అనుగ్రహంతో బ్రాహ్మణులందరూ స్వయంచాలకంగా పూర్తిగా సంతృప్తి చెందడంతో, దూర్వాసుడి శాపం నుంచి తప్పించుకుంటుంది ద్రౌపది. ద్రౌపదిని కృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడాడిన రోజే అక్షయ తృతీయ అని పురాణాల ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?అక్షయ తృతీయ రోజును విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు ఆవిర్భవించిన రోజుగా కూడా పరిగణిస్తారు. అందుకే ఈ రోజును కొన్నిసార్లు ప్రశురామ జయంతి అని కూడా పిలుస్తారు. మరొక పురాణం ప్రకారం, వేద వ్యాసుడు గణేశుడికి మహాభారతం పారాయణం చేయడం ప్రారంభించిన రోజు ఇదేనని నమ్ముతారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత:అక్షయ తృతీయ రోజున ఏదైనా శుభకార్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అక్షయ తృతీయ రోజున దానం చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుంది. విష్ణుమూర్తి పాదాలకు అక్షతలతో అర్చించి, ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని విశ్వసిస్తారు. అక్షయ తృతీయను స్వయంసిద్ధ ముహూర్తంగా పరిగణిస్తారు. అంటే ఈ రోజున ఎలాంటి ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు, ఏ పని మొదలుపెట్టినా మంచి ఫలితాలుంటాయని, . ఈ రోజున దానం, ధర్మం, పుణ్యకార్యాలు చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. -
అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
ఇండియాలో బంగారానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. శుభకార్యాల్లో బంగారు నగలను ధరిస్తుంటారు. ఆపదలో ఆర్థికంగా ఆదుకునే వనరుగా పసిడి తోడ్పడుతుంది. అక్షయ తృతీయ రోజున కాసింత బంగారం కొంటే ఏడాదంతా సంపద సొంతం అవుతుందని నమ్ముతుంటారు. కానీ ఇటీవల బంగారం తులం ధర రూ.లక్ష చేరువలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో భారత్ కంటే తక్కువకే పసిడి విక్రయిస్తున్నారు. అలాంటిది భారత్‌లో బంగారం అధిక ధరకు దోహదం చేసే కొన్ని కీలక అంశాలను తెలుసుకుందాం.దిగుమతి సుంకాలు, పన్నులుభారతదేశం బంగారంపై గణనీయమైన దిగుమతి సుంకాలు, పన్నులను విధిస్తుంది.ఈ సుంకాలు 12.5% వరకు ఉండవచ్చు. బంగారం కొనుగోళ్లపై అదనంగా 3% వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఉంటుంది. మేకింగ్ ఛార్జీలపై మరో 5 శాతం జీఎస్టీ వడ్డీస్తున్నారు.కరెన్సీ మారకం రేట్లుఅంతర్జాతీయంగా బంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది. అమెరికా డాలరుతో పోలిస్తే భారత రూపాయి (ఐఎన్ఆర్) బలహీనపడినప్పుడు బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. మారకం రేట్లలో ఈ హెచ్చుతగ్గులు భారతదేశంలో బంగారం ధరను నేరుగా ప్రభావితం చేస్తాయి .పండుగలు, పెళ్లిళ్లుభారతదేశంలో బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, దీపావళి, ధంతేరస్, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిప్రపంచ ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇన్వెస్టర్లు సురక్షిత సంపదగా బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి పెరిగిన డిమాండ్ అధిక ధరలకు దారితీస్తుంది. ఇది భారత మార్కెట్లో ప్రతిబింబిస్తుంది.ఇదీ చదవండి: తక్కువ ధరకే బంగారం కావాలా!సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లుఅమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత రిజర్వ్ బ్యాంక్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుతున్నాయి. ఈ బల్క్ కొనుగోళ్లు ప్రపంచ డిమాండ్‌ను పెంచుతాయి. -
గోల్డెన్ ఛాన్స్! బంగారం తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం తులం త్వరలో రూ.లక్షలకు చేరుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారంతో పోలిస్తే బుధవారం అక్షయ తృతీయ రోజున పసిడి ధర స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,750 (22 క్యారెట్స్), రూ.97,910 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.50, రూ.60 తగ్గింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.50, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.50 దిగి రూ.89,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.60 తగ్గి రూ.98,040 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లుగానే వెండి ధరలు(Silver Price) కూడా బుధవారం తగ్గాయి. మంగళవారం ముగింపు ధరలతో పోలిస్తే వెండి ధర కేజీ రూ.2,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,09,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం (Chandanotsavam) కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం.1. పరశురాముని జన్మదినం.2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.3. త్రేతాయుగం మొదలైన దినం.4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా, (అది పుణ్యం కావచ్చు, లేదా పాపం కావచ్చు) అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధం లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ, కూజాలో గానీ, మంచి నీరు పోసి, దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు.అతిథులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే, ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే, మన ఉత్తర జన్మలలో, వాటికి లోటురాదు. గొడుగులు, చెప్పులు, విసనకర్రల లాటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టాన్ని, విజయాన్ని చేకూర్చుతుంది అని పౌరాణిక ఉదంతాలు కొన్ని చెబుతున్నాయి.బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి?మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి, ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం (Gold) కొనాల్సిందేనా! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి?అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి, ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం, హోమం, వ్రతం, పుణ్యం, దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందనీ, జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి, ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో, అప్పుచేసో, తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు, అప్పులు, పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.అక్షయ తృతీయ రోజున వర్జ్యం , రాహుకాలంతో పనిలేదు''వైశాఖ శుక్ల పక్షోతు తృతీయ రోసిణి యుతాదుర్లభా బుధచారేణ సోమనాపి ఉతా తథా''మత్స్య పురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం (Akshaya Tritiya Vratham) గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది.పుణ్యకార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే , పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.ఈ రోజున ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం (Rahu Kalam) వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు అంటున్నారు.చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?ఇంకా గృహనిర్మాణం, ఇంటిస్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే అక్షయ తృతీయనాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసినా సంపద , పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.- డీ వీ ఆర్ -
తక్కువ ధరకే బంగారం కావాలా!
అక్షయ తృతీయ కారణంగా ఈరోజు చాలామంది బంగారం కొనేందుకు షాపుల ముందు బారులు తీరుతున్నారు. దేశంలో పసిడి ధరలు దాదాపు తులం రూ.లక్షకు చేరువయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారత్ కంటే తక్కువ ధరకే బంగారం లభిస్తుంది. వాటి వివరాలు కింద తెలుసుకుందాం.దుబాయ్, యుఏఈఈ దేశం ‘బంగారు నగరం’గా ప్రసిద్ధి చెందింది. బంగారంపై తక్కువ పన్నులు ఉండడంతో ఇక్కడ అత్యంత సరసమైన ధరలకే పసిడి లభిస్తుంది. ఇక్కడ బంగారం సాధారణంగా భారతదేశం కంటే 10-15 శాతం చౌకగా ఉంటుంది. యూఏఈలో బంగారంపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్) లేకపోవడం గమనార్హం. దీనికితోడు దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడంతో సరసమైన ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే భారతీయులు ఈ దేశాన్ని అన్వేశిస్తున్నారు.థాయ్‌లాండ్‌ఇక్కడ బ్యాంకాక్, పట్టాయా బంగారం కొనుగోలుకు ప్రసిద్ధ ప్రదేశాలు. తక్కువ మేకింగ్ ఛార్జీలు, పన్నుల కారణంగా భారత్‌తో పోలిస్తే ఈ దేశం తక్కువ ధరకే బంగారు ఆభరణాలను అందిస్తోంది. సాధారణంగా థాయ్‌లాండ్‌లో బంగారం భారత్ కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. ఆ దేశంలో తక్కువ తయారీ ఖర్చులు, బంగారంపై స్వల్పంగా పన్నులు విధిస్తున్నారు. భారత్‌తో పోలిస్తే సాపేక్షంగా తక్కువ మేకింగ్ ఛార్జీలతో బంగారు ఆభరణాలు లభిస్తాయి.సింగపూర్తక్కువ పన్నులు, బంగారం ధరల్లో పోటీ కారణంగా గోల్డ్ షాపింగ్‌కు సింగపూర్ కీలక గమ్యస్థానంగా ఉంది. నాణ్యమైన బంగారాన్ని విక్రయించడంలో ఈ దేశానికి మంచి పేరు ఉంది. ఇక్కడ ధరలు భారతదేశం కంటే 5-8 శాతం చౌకగా ఉంటాయి. ఈ దేశంలో గ్రేడ్ బంగారంపై జీఎస్టీ లేదు. దాంతో చౌకగా లభిస్తుంది.మలేషియాకౌలాలంపూర్‌లో సరసమైన బంగారం ధరలు ఉన్నాయి. తక్కువ తయారీ ఛార్జీలు, పన్నుల కోసం చూస్తున్న భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ దేశంలో పోటీ ధరలను అందించే అనేక దుకాణాలు ఉన్నాయి. మలేషియాలో బంగారం భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. బంగారంపూ తక్కువ పన్నులు, మేకింగ్ ఛార్జీలను అందిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఫాక్స్‌కాన్ ఆదాయం రూ.1.7 లక్షల కోట్లుహాంగ్ కాంగ్హాంగ్ కాంగ్ బంగారం, విలువైన లోహాలపై పన్ను మినహిస్తుంది. దాంతో తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ దేశం బంగారం ట్రేడింగ్‌కు ప్రధాన కేంద్రంగా ఉంది. పోటీ ధరల కారణంగా చాలా మంది భారతీయులు ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. హాంకాంగ్‌లో బంగారం సాధారణంగా భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. -
అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ రోజున (నేడు) దేశవ్యాప్తంగా రూ.16,000 కోట్ల విలువైన ఆభరణాల అమ్మకాలు నమోదు కావొచ్చని ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ అంచనా వేస్తోంది. ధరలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోళ్లలో మిశ్రమ ధోరణి ఉంటుందని అఖిల భారత రిటైల్ వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్ష స్థాయిలో ఉండగా, వెండి ధర సైతం కిలోకి రూ.లక్ష సమీపంలో ఉండడం గమనార్హం. గతేడాది అక్షయ తృతీయ నుంచి బంగారం ధర చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగిపోవడం తెలిసిందే. ‘‘సాధారణంగా అక్షయ తృతీయ రోజున కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ధరలు పెరిగిపోవడం ఈ ఏడాది వినియోగ డిమాండ్‌పై ప్రభావం చూపించొచ్చు. అక్షయ తృతీయ రోజున 12 టన్నుల బంగారం (రూ.12,000 కోట్లు), 400 టన్నుల వెండి (రూ.4,000 కోట్లు) కలిపి మొత్తం మీద రూ.16,000 కోట్ల అమ్మకాలు ఉండొచ్చని అంచనా’’అని ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. కస్టమర్ల కొనుగోళ్ల సెంటిమెంట్ కొంత తగ్గొచ్చన్నారు.అంతర్జాతీయంగా భౌగోళిక, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత సాధనంగా బంగారంలో పెట్టుబడులు పెరిగిపోవడం ధరల ర్యాలీకి కారణమని తెలిసిందే. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండడం జ్యుయలరీ డిమాండ్ పడిపోకుండా సాయపడుతున్నట్టు సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భార్తియా తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా అమ్మకాలు పెంచుకునేందుకు ప్రముఖ జ్యయలరీ సంస్థలు ధరలో, తయారీ చార్జీల్లో తగ్గింపును ఇప్పటికే ప్రకటించాయి. -
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
అక్షయ తృతీయ (Akshaya Tritiya 2025) సందర్భంగా బంగారం కొనుగోలు చేసేవారు మాత్రమే కాకుండా.. కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశీయ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ అద్భుతమైన ఆఫర్స్ అందించడం మొదలుపెట్టింది.ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అక్షయ తృతీయను పురస్కరించుకుని 72 గంటల ఎలక్ట్రిక్ రష్ అనే లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ప్రత్యేక తగ్గింపులు, ఉచిత పొడిగించిన వారంటీలు..ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అదే రోజు స్కూటర్ డెలివరీలు కూడా ఉంటాయి.ఓలా ఎలక్ట్రిక్ ఇస్తున్న ఆఫర్ సమయంలో.. జెన్ 2, జెన్ 3 మోడళ్లతో సహా S1 పోర్ట్‌ఫోలియో అంతటా రూ.40,000 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపులు తరువాత Gen 2 స్కూటర్ల ధరలు రూ. 67,499 నుంచి.. Gen 3 లైన్అప్ ధర రూ. 73,999 నుంచి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.ఓలా #హైపర్‌డ్రైవ్ సర్వీస్ కింద.. అదే రోజు డెలివరీ, రిజిస్ట్రేషన్ వంటివి చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు స్కూటర్లను ఆన్లైన్లో లేదా డీలర్‌షిప్‌లో కొనుగోలు చేసుకోవచ్చు.అక్షయ తృతీయ ఆఫర్స్ ఇస్తున్న ఇతర కంపెనీలుఅక్షయ తృతీయ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా.. బజాజ్ ఆటో, హోండా మోటార్ సైకిల్ వంటివి కూడా ఆఫర్స్ అందిస్తున్నాయి. అయితే ఏ కంపెనీ ఎంత ఆఫర్ ఇస్తుందనే విషయం తెలుసుకోవడానికి మీ సమీపంలోని బ్రాండ్ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
భారతీయులు అలంకార ప్రియులు. కాబట్టి చాలామంది ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాలలో కూడా ఎక్కువగా బంగారమే ఉంటుంది. ఇప్పుడు (2025లో) గోల్డ్ అంటే.. కొనడానికి కూడా కొంతమంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఒకప్పుడు (1925లో) తులం పసిడి రేటు రూ. 18.75 ఉండేదంటే బహుశా కొందరు నమ్మక పోవచ్చు. నమ్మకపోయినా అదే నిజం. ఈ కథనంలో శతాబ్దానికి ముందు ఇండియాలో గోల్డ్ రేటు ఎలా ఉండేదో తెలుసుకుందాం.▸1925: రూ. 18.75▸1935: రూ. 30.81▸1945: రూ. 62.00▸1955: రూ. 79.00▸1965: రూ. 72.00▸1975: రూ. 540.00▸1985: రూ. 2130.00▸1995: రూ. 4680.00▸2005: రూ. 7000.00▸2015: రూ. 26845.00▸2016: రూ. 29560.00▸2017: రూ. 29920.00▸2018: రూ. 31730.00▸2019: రూ. 36080.00▸2020: రూ. 48480.00▸2021: రూ. 50000.00▸2022: రూ. 53000.00▸2023: రూ. 60000.00▸2024: రూ. 80000.00▸2025: రూ. 97970.001925లో 10 గ్రాముల రూ.18.75 వద్ద ఉండేది. అయితే ఈ రోజు గోల్డ్ రేటు రూ. 97,970 వద్దకు చేరింది. అంటే వందేళ్లలో బంగారం ధర 97951.25 రూపాయలు పెరిగింది.బంగారం ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. బంగారం కొనేవారి సంఖ్య ఎక్కువవ్వడం, నిల్వలు తక్కువ కావడం. భౌగోళిక, రాజకీయ కారణాలు. బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి పెరగడం కూడా గోల్డ్ ధరలు పెరగడానికి కారణమయ్యాయి. దీంతో పసిడి ధర సుమారు లక్ష రూపాయలకు చేరింది.ఇదీ చదవండి: భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే? -
అక్షయ తృతీయ : పదేళ్లలో ఇన్ని వేలు పెరిగిందా? కొందామా? వద్దా?
వైశాఖమాసం, శుక్ల పక్ష తృతీయ నాడు జరుపుకునే నాడు జరుపుకునే అక్షయ తృతీయ అంటే ఆ సందడే వేరు. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ పండుగ జరుపుకోనున్నారు. ఈ రోజున చేసే ఏ పని అయినా అక్షయం అవుతుందని, ఇంట్లో సిరిసంపదలు నిండుగా ఉంటాయని విశ్వసిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. అందుకే గోరంతైనా బంగారమో, వెండో కొనుగోలు చేయాలని ఆశపతారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, శుభకార్యాలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు అక్షయ తృతీయను అనేది ప్రగాఢ విశ్వాసం.భారతీయులకు బంగారం అంటే లక్ష్మదేవి అంత ప్రీతి. ఇక అక్షయ తృతీయ అనగానే బంగారు నగల్ని సొంతం చేసుకోవాలని ఆశపడతారు. బంగారం కొనుగోళ్లు భారతీయులకు అక్షయ తృతీయ వేడుకలలో అంతర్భాగం. కానీ ఇటీవలికాలంలో బంగారం ధరలు ఆకాశన్నంటేంతగా ఎగిసి అందనంటున్నాయి. ఇప్పుడు 24 క్యారెట్ల నస్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. లక్షకు సమీపంలో ఉంది. ఈ క్రమంలో గత పదేళ్లలో బంగారం ధరల్లో మార్పు గురించి తెలుసుకుందాం. ఈ క్రమంలో 11 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో పుంజుకోవడం గమనార్హం.2014లో అక్షయ తృతీయ నాడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకురూ. 30,182 వద్ద ఉండగా అదే 2025 నాటి ధరలను గమనిస్తే ఏకంగా 218 శాతం పెరిగి రూ. 95,900 కు చేరుకుంది. ఈ ఒక్క సంవత్సరం 2025లోనే ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా 30 శాతానికి పైగా పుంజుకుంది.ఇదీ చదవండి : Akshaya Tritiya 2025 : శుభ సమయం, మంగళవారం గోల్డ్ కొనొచ్చా? కేవలం 1942లో క్విట్ ఇండియా సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది. 1947లో రూ.రూ.88.62 రెట్టింపు అయింది. ఇక తరువాత తగ్గడం అన్న మాట లేకుండా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. స్వాతంత్ర్యం తరువాత మొదలైన బంగారం ధర పెరుగుదల అలా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే.పదేళ్లలో పసిడి పరుగుబంగారం ధర 10 సంవత్సరాలలో రూ. 68,500 పెరిగింది. 2015లో అక్షయ తృతీయకు నాటి ధరలతో పోలిస్తే నేటికి HDFC సెక్యూరిటీస్ డేటా ప్రకారం, గత 10 సంవత్సరాలలో బంగారం ధరలు రూ. 68,500 కంటే ఎక్కువ పెరిగాయి.2019లో అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసి ఉంటే, అప్పుడు ధరలు 10 గ్రాములకు రూ.31,729గా ఉంది. అంటే అప్పటి పెట్టుబడిపై 200 శాతం పుంజుకున్నట్టే. గత ఏడాది అక్షయ తృతీయ నుండి పుత్తడి 30 శాతానికి పైగా ర్యాలీ అయింది. 2024లో 10 గ్రాముల రూ. 73,240 వద్ద ఉంది. 2024 మధ్యకాలం నుండి బంగారం ధరలు విపరీతంగా పుంజుకున్నాయి. దాదాపు 22 శాతం పెరిగి రూ. 73,240 వద్దకు చేరాయి.చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్! హై నుంచి కాస్త తగ్గే అవకాశం, కానీ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు మానవ్ మోడీ “చాలావరకు డిమాండ్ ,సరఫరా కారకాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపలేదు. ముఖ్యంగా మార్కెట్లో అధిక అనిశ్చితులు ఉన్న సందర్భంలో. గత రెండు నెలలుగా బంగారం ధరలు బాగా పెరిగాయి. అందువల్ల ధరల్లో కొత్త తగ్గుదల కనిపించవచ్చు. అయితే బంగారం ధరలకు సానుకూలతలు , ప్రతికూలతలు రెండూ ఉన్నాయి, మిశ్రమ ఆర్థిక డేటా పాయింట్లు, సుంకాల యుద్ధం, అధిక ద్రవ్యోల్బణ అంచనాలు, నెమ్మదించిన వృద్ధి ఆందోళనలు, రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న రుణాలు లాంటి బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. -
అక్షయ తృతీయ శుభ సమయం, మంగళవారం గోల్డ్ కొనొచ్చా?
అక్షయ తృతీయ (Akshaya Tritiya 2025) పర్వదినం అనగానే అందరికీ గుర్తు వచ్చేది బంగారం. నిజానికి ఈ పండుగను లక్ష్మీదేవి( Lakshmi Devi )కి సంబంధించిన వేడుకగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున కుబేరుడిని కూడా పూజిస్తారు. అలాగే ఈ రోజు తమ తాహతుకు తగ్గట్టు ఎంతో కొంత బంగారం( Gold) వెండి( Silver ) వస్తువులను తమ ఇంటికి తెచ్చుకోవాలని, ఇది తమకు చాలా శుభప్రదమని విశ్వసిస్తారు. తద్వారా ఏడాదంతా తమ ఇల్లు శుభప్రదంగా ఆర్థికంగా కళకళలాడుతుందని నమ్మకం. ఇదీ చదవండి: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్! వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం.అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా అంటే నాశనం లేకుండా ఉంటాయని నమ్మకం. . నిజానికి ఒకపుడు అక్షయ తృతీయ, బంగారం కొనుగోళ్లుపై పెద్దగా ప్రాచుర్యం ఉండేది కాదు. కానీ ఇటీవలి కాలంలో అక్షయ తృతీత సందడి బాగా పెరిగింది. దీనికి తగ్గట్టు జ్యుయల్లరీ వ్యాపారులు కూడా పలు రకాల ఆఫర్లతో ఆకర్షింటారు.దీంతోపాటు, అక్షయ తృతీయ ఏదైనా కొత్త వస్తువులను కొనుగోలు చేసుకోవాలనుకునేవారు తమ రాశి ప్రకారం కొనుగోలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నమాట.ఈ ఏడాది అక్షయ తృతీయ ముహూర్తం వివరాలు పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా ఉదయ తిథినే ప్రామాణికంగా భావిస్తాం కాబట్టి , ఈ సమయంలో ఏ వ్రతమైనా, పూజ అయినా ఆచరించవచ్చు. అలాగే అక్షయ తృతీయ రోజున శ్రేయస్సుకు చిహ్నమైన బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అయితే ప్రస్తుతం పసిడి ధర కొండెక్కి కూచున్న నేపథ్యంలో ఇతర వస్తువులను అయినా కొనుగోలు చేయవచ్చు. అలాగే దానధర్మాలు చేయాలని కూడా పెద్దలు చెబుతారు. అయితే ఏదైనా కొనుగోలు చేసేందుకు శుభ సమయం వచ్చేసి ఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు.అక్షయ తృతీయ- బంగారం కొనడానికి శుభ సమయాలుఏప్రిల్ 29 మంగళవారం బంగారం కొనుగోలు సమయాలు - 05:31 PM నుండి 04:38 AM వరకుఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు. -
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
భారత్‌లో బంగరానికి ఉన్న విలువ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తరాలుగా పసిడి సంపదకు గుర్తుగా ఉంటోంది. సంపద ఉంటే ఆర్థిక ఇబ్బందులు దరిచేరకుండా హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి ఏటా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. ఆరోజు పసిడి కొంటే ఆ ఏడాదంతా సంపద సొంతం అవుతుందని అనుకుంటారు. రేపు అక్షయ తృతీయ సందర్భంగా సాధారణంగా బంగారం షాపులు కిక్కిరిసిపోతాయి. అయితే బంగారాన్ని కేవలం నగల రూపంలోనే కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ మార్కెట్లో వివిధ మార్గాల ద్వారా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)ఫిజికల్ గోల్డ్ సొంతం చేసుకోవాలనే ఇబ్బంది లేకుండా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) మంచి ఎంపిక. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఫిజికల్ గోల్డ్ ధరను ట్రాక్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. షేర్ల మాదిరిగానే వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ చేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్ ప్రతి యూనిట్ సాధారణంగా ఒక గ్రాము బంగారం లేదా దానిలో కొంత భాగాన్ని సూచిస్తుంది. వీటివల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో సులభంగా కొనడం, విక్రయించడం చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ మాదిరిగా కాకుండా మేకింగ్ ఛార్జీలు లేదా నిల్వ ఖర్చులు ఉండవు. ధరలు నేరుగా బంగారం రేట్లతో ముడిపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా పెట్టుబడికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లను ట్రేడ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం ఉంటుంది. మార్కెట్లో చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీల నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.డిజిటల్ గోల్డ్ (Digital Gold)డిజిటల్ గోల్డ్ అనేది భౌతికంగా బంగారాన్ని సొంతం చేసుకోకుండా అందులో పెట్టుబడి పెట్టడానికి ఒక ఆధునిక మార్గం. ఇది ఆన్లైన్లో బంగారాన్ని కొనడానికి, విక్రయించడానికి, నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు కొనుగోలు చేసే బంగారానికి సురక్షితమైన వాల్ట్‌ల్లో నిల్వ చేసిన భౌతిక బంగారం మద్దతుగా నిలుస్తుంది. కనీసం రూ.10 నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చు. 24 క్యారెట్ల బంగారం నాణ్యతకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ డిజిటల్ గోల్ట్కు బీమా చేసిన వాల్ట్‌ల ద్వారా భద్రత కల్పిస్తారు. దాంతో దొంగతనం జరుగుతుందేమోనని ఆందోళన చెందనవసరం లేదు. అవసరమైనప్పుడల్లా డిజిటల్ బంగారాన్ని ఫిజికల్ గోల్డ్ లేదా క్యాష్‌గా మార్చుకోవచ్చు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి ప్లాట్‌ఫామ్‌లతోపాటు ప్రముఖ బ్యాంకులు ఈ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అందిస్తున్నాయి. ఎంఎంటీసీ-పీఏఎంపీ, సేఫ్గోల్డ్ ఆగ్మాంట్ గోల్డ్ లిమిటెడ్ వంటి సంస్థలు ఈ పెట్టుబడులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ గోల్డ్ కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు లోబడి ఉంటుంది.ఇదీ చదవండి: భగ్గుమంటున్న పసిడి ధరలు! తులం ఎంతంటే..చివరగా.. అప్పు చేసి వద్దు!అక్షయ తృతీయ మంచి రోజు.. ఏది కొన్నా కలిసి వస్తుందని భావించి అప్పులు చేసి మరీ బంగారం కొనేవారూ ఉన్నారు. కానీ అప్పు చేసి కొంటే రుణాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే బంగారం కొనకపోయినా పర్లేదు.. ఉన్నంతలో ఆ రోజున నలుగురికి సాయపడితే.. అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు! అప్పు మాత్రం చేయకండి. -
అక్షయ తృతీయ ఆఫర్లు షురూ
కోల్‌కతా: బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో అక్షయ తృతీయ అమ్మకాలు తగ్గకుండా జ్యుయలర్లు మార్కెటింగ్ సన్నాహాలు మొదలుపెట్టారు. మరిన్ని అమ్మకాలు సాధించేందుకు వీలుగా డిస్కౌంట్లు, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ నెల 30న అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ) అన్న విషయం తెలిసిందే. ఏటా ఆ రోజున బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తుంటారు. ఈ ఏడాది అధిక ధరల నేపథ్యంలో అమ్మకాలపై మిశ్రమ అంచనాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. దీంతో ప్రముఖ బ్రాండ్లు తనిష్క్, సెంకో గోల్డ్, ఎంపీ జ్యుయలర్స్, పీసీ చంద్ర జ్యుయలర్స్ ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయి. → టాటా బ్రాండ్ తనిష్క్ బంగారం ఆభరణాల తయారీ చార్జీల్లో 20 శాతం తగ్గింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. → బంగారం ధరపై రూ.350 డిస్కౌంట్‌ను సెంకో గోల్డ్ ఆఫర్ చేస్తోంది. అలాగే తయారీ చార్జీల్లో 30 శాతం రాయితీ ఇస్తోంది. డైమండ్ ఆభరణాలపై తయారీ చార్జీల్లో 100 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. → ఎంపీ జ్యుయలర్స్ గ్రాము బంగారంపై రూ.300 డిస్కౌంట్ ప్రకటించింది. తయారీ చార్జీల్లో 10 శాతం రాయితీ ఇస్తోంది. → పీసీ చంద్ర జ్యుయలర్స్ గ్రాము బంగారంపై రూ.200.. తయారీ చార్జీల్లో 15 శాతం తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది. డైమండ్ జ్యుయలరీపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. మంచి డిమాండ్ ఉంటుంది.. ‘‘అక్షయ తృతీయ సందర్భంగా అమ్మకాలు మంచిగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే వినియోగదారుల్లో బంగారం పట్ల విశ్వాసం బలంగా ఉంది’’అని అంజలి జ్యుయలర్స్ డైరెక్టర్ అనర్గ ఉట్టియ చౌదరి తెలిపారు. దీంతో తయారీ చార్జీల్లో రాయితీలు ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో బంగారాన్ని సురక్షిత సాధనంగా చూస్తున్నట్టు చెప్పారు. దీంతో బంగారంపై మరింత పెట్టుబడులకు కొనుగోలుదారులు మొగ్గు చూపించొచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే బంగారం ధరలు స్వల్పకాలంలో మరో 5–7 శాతం వరకు పెరగొచ్చని.. సమీప కాలంలో దిద్దుబాటు అవకాశాలు కనిపించడం లేదన్నారు. ధరలు పెరగడంతో అమ్మకాల పరిమాణం తగ్గినట్టు సెంకో గోల్డ్ ఎండీ, సీఈవో సువాంకర్ సేన్ తెలిపారు. అయితే అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్ల డిమాండ్ బలంగా ఉండొచ్చన్న అంచనాతో ఉన్నారు. ముత్యాలు, రత్నాలను చేర్చడం ద్వారా వివాహ ఆభరణాల ధరలను 25–30 శాతం వరకు తగ్గించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జియో ఫైనాన్స్ యూజర్లకు గోల్డెన్ ఆఫర్ముంబై: అక్షయ తృతీయను పురస్కరించుకుని పసిడి కొనుగోళ్లకు సంబంధించి జియో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. జియోఫైనాన్స్, మైజియో యాప్ యూజర్లకు జియో గోల్డ్ 24కే డేస్ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు రూ. 1,000 నుంచి రూ. 9,999 వరకు విలువ చేసే డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసే వారు జియోగోల్డ్1 కోడ్‌ను ఉపయోగించి అదనంగా 1 శాతం పసిడిని ఉచితంగా దక్కించుకోవచ్చు. రూ. 10,000కు మించిన కొనుగోళ్లపై జియోగోల్డ్‌ఎట్100 ప్రోమో కోడ్‌తో 2 శాతం పసిడి అందుకోవచ్చు. ఆఫర్ వ్యవధిలో ఒక్కో యూజరు 10 లావాదేవీల వరకు, గరిష్టంగా రూ. 21,000 వరకు విలువ చేసే పసిడిని పొందవచ్చు. గోల్డ్ సిప్‌లు కాకుండా ఏకమొత్తంగా చేసే పసిడి కొనుగోళ్లకు ఇది వర్తిస్తుంది. -
బంగారం.. కొనేదెలా..?
న్యూఢిల్లీ: బంగారం ధర రూ.లక్షలకు పెరిగిపోవడం వినియోగదారులు, ముఖ్యంగా మహిళల ఆకాంక్షలపై నీళ్లు చల్లినట్లయింది. భారతీయ మహిళలకు బంగారంతో విడదీయలేని అనుబంధమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య కుటుంబాలకు చెందిన వారు సైతం బంగారు ఆభరణాల కోసమని చెప్పి తమకు తోచినంత పొదుపు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ధరలు అసాధారణంగా పెరిగిపోవడాన్ని వారు ఇప్పుడు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఏటా వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయ(మొదటి తదియ), వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ ఏడాది ఇప్పటికే బంగారం ధరలు 22 శాతం పెరిగిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జవవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ.79,390గా ఉండగా, అక్కడి నుంచి చూస్తే రూ.1.01 లక్షల వరకు వెళ్లి ప్రస్తుతం రూ.98వేల స్థాయిలో ఉంది. ఇలా అయితా ఎలా కొనగలం? ‘‘వచ్చే నవంబర్‌లో నా కుమార్తె వివాహం ఉంది. ఈలోపే బంగారం ధర గణనీయంగా పెరిగింది. ఇప్పుడు వివాహం కోసం బంగారం ఎలా కొనుగోలు చేయాలి?’’ అన్నది నోయిడాకు చెందిన రూప అభిప్రాయం. పండగలు, వివాహాల సమయంలో బంగారం కొనుగోలు చేయకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుందని ఢిల్లీ మయూర్ విహార్‌కు చెందిన సుశీలా దేవి మనోగతం. గతంలో 10 గ్రాములు కొనేవాళ్లం కాస్తా.. ఇప్పుడు 5 గ్రాములతో సరిపెట్టుకోవడమేనని నిర్వేదం వ్యక్తం చేశారు. ‘‘నాకు బంగారం ఆభరణాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఏటా ఒకసారి కొనుగోలు చేస్తుంటా. ధర రూ.లక్షకు చేరడం నన్ను కలచివేస్తోంది’’అని ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా జిల్లా వాసి సీతా సాహు తెలిపారు. మరోవైపు చెప్పుకోతగ్గ స్థాయిలో బంగారం ఆభరణాలను సమకూర్చుకున్నవారు.. ధరలు భారీగా పెరిగిపోవడం పట్ల ఒకింత ఆనందాన్నీ వ్యక్తం చేస్తున్నారు. ‘‘నా భర్త ఏటా బంగారం కొనిపెడుతుండేవారు. కానీ, నేడు ఆయన లేకపోయినప్పటికీ.. ఆభరణాలు మాత్రం నాకు గౌరవంతోపాటు, మద్దతుగా నిలుస్తున్నాయి’’అని పుణెకు చెందిన అర్చనా దేశ్‌ముఖ్ (65) చెప్పారు. అమ్మకాలపై ప్రభావం.. ధరల పెరుగుదలతో అమ్మకాలు తగ్గుతున్నట్టు ఆభ రణాల వర్తకులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న వర్తకులపై దీని ప్రభావం ఎక్కువగా కనిపి స్తోంది. ‘‘దశాబ్దాల నుంచి ఇదే వ్యాపారంలో ఉ న్నాం. మొదటిసారి కస్టమర్ల మొహాల్లో అయోమయాన్ని చూస్తున్నాం. గతంలో కస్టమర్లు ఆభరణాల డిజైన్లను ఎన్నింటినో చూసేవారు. ఇప్పుడు వాటిని చూసి వెనక్కి ఇచ్చేస్తున్నారు. ధరలు ఇలాగే పెరిగితే చిన్న వర్తకులు కొనసాగడం కష్టమే’’అని ఢిల్లీ మ యూర్ విహార్‌కు ‘ఊరి్మళా జ్యుయలర్స్’ స్వర్ణకారి ణి సోనూసోని తెలిపారు. కానీ మహిళలు బంగా రం తప్పకుండా పొదుపు చేసి, ఆభరణాలను కొనుగోలు చేస్తూనే ఉంటారని రాధేశ్యామ్ జ్యుయలర్స్‌కు చెందిన కరణ్ సోని అభిప్రాయపడ్డారు. లైట్ వెయిట్ జ్యుయలరీకి డిమాండ్? బంగారం ధరలు పెరిగిపోవడంతో ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లు తేలికపాటి ఆభరణాలను కొనుగోలు చేయొచ్చని జ్యుయలర్లు అంచనా వేస్తున్నారు. ‘‘అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ఈ ఏడాది ధరలు పెరిగినప్పటికీ లైట్ వెయిట్ ఆభరణాల రూపంలో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. ధరల పెరుగుదల పట్ల కస్టమర్లు అసహనం వ్యక్తం చేసినప్పటికీ.. సురక్షిత సాధనంగా, మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం కావడంతో క్రమంగా అమ్మకాలు సానుకూల స్థితికి చేరుకుంటాయన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో విక్రయాలను పెంచుకునేందుకు వర్తకులు అన్ని రకాల ధరల్లో ఆభరణాలను అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అధిక ధరలతో అమ్మకాల పరిమాణం క్రితం ఏడాది స్థాయిలోనే ఉండొచ్చని లేదా 10 శాతం వరకు తగ్గొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా అభిప్రాయపడ్డారు. అక్షయ తృతీయ, వివాహాల సీజన్ కావడంతో విక్రయాల పట్ల ఆశావహంగా ఉన్నట్టు పీఎన్జీ జ్యుయలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ పేర్కొన్నారు. -
పని బంగారం, బతుకు నిస్సారం
బంగారం ధర ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. తులం బంగారం లక్ష మార్కు దాటేసింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ.. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు బంగారు ఆభరణాల తయారీ కార్మికులు మాత్రం పనులు లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో ఆ రంగంపై ఆధారపడి ఉన్న చిన్న వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాణిజ్య రాజధానిగా పిలిచే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కార్మికులపై దాని ప్రభావం అధికంగా పడుతోంది.వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా 40 వేల మంది బంగారు ఆభరణాల తయారీ కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ పాతబస్తీలో సుమారుగా 50 సముదాయాల్లో ఐదు నుంచి ఆరు వందలకు పైగా, గవర్నర్‌పేట బీసెంట్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో మరో రెండు వందలకు పైగా కార్ఖానాలు కొనసాగుతున్నాయి. సుమారుగా 25 వేల మంది కారి్మకులు వీటిపై ఆధారపడి ఉన్నారు. ఇవి కాకుండా రెండు జిల్లాలో పెద్ద స్థాయిలో ఆభరణాల తయారీ చేసే మరో వంద వరకూ కార్ఖానాలు పని చేస్తున్నాయి. వీటిల్లో ఏడెనిమిది వేల మంది వరకూ కార్మికులు పని చేస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా ఇళ్ల వద్ద ఆభరణాల తయారీ చేసే వారి సంఖ్య సైతం ఏడెనిమిది వేల వరకూ ఉంటుంది. వీరిలో సుమారు ఏడు నుంచి పది వేల మంది బెంగాల్ కార్మికులు ఉన్నట్లు అంచనా. పనులు లేక ఆత్మహత్యలు.. పనులు లేక బంగారు ఆభరణాల తయారీ కార్మిక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఇటీవల కొంతమంది కార్మికులు పనులు లేక ఆదాయం రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆ సంఘాల నేతలు చెబుతున్నారు. యనమలకుదురులో ఒక కార్మికుడు ఆభరణాల తయారీకి వినియోగించే సైనెడ్‌ను కూల్‌డ్రింక్‌లో కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. అలాగే పనులు లేకపోవటంతో చాలా మంది ఈ రంగాన్ని వదిలి ఇతర రంగాలకు తరలిపోతున్నారని వారు వాపోతున్నారు. బహుళజాతి సంస్థలతో తీవ్ర ప్రభావం.. దశాబ్దం క్రితం వరకూ స్వర్ణకారుల (Goldsmith) జీవితాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోయాయి. దాదాపుగా అందరికీ చేతినిండా పనులు ఉండేవి. కానీ పది సంవత్సరాలుగా బహుళజాతి సంస్థల కారణంగా స్థానికంగా పనులు తగ్గి కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. ముఖ్యంగా చాలా సంస్థలు ఉత్తరాది నుంచి ఆభరణాలను తయారు చేయించు కొని దిగుమతి చేసుకుంటున్నాయి. విస్తృత ప్రచార ఆర్భాటాలు, ఆకర్షించే దుకాణ సముదాయం, ఆకట్టుకునే రాయితీలు, భారీ పెట్టుబడులతో కార్పొరేట్ సంస్థలు ఈ రంగంలోకి రావటంతో స్వర్ణకారుల బతుకు చిత్రం భారంగా మారింది. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి: రోజూ బంగారం అమ్మకాలు: 250 కిలోలకు పైగా(అంచనా) ఆభరణాల తయారీ కార్మికులు: 40 వేలుదారుణంగా కొనుగోళ్లు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిత్యం 250 కిలోల బంగారం అమ్మకాలు జరుగుతుంటాయని అంచనా. విజయవాడలో సుమారుగా 25 నుంచి 30 వరకూ కార్పొరేట్ బంగారం అమ్మకాల దుకాణాలు కొనసాగుతున్నాయి. వాటిల్లో రోజూ దాదాపు125 నుంచి 150 కిలోల అమ్మకాలు జరుగుతుంటాయన్నది వ్యాపార వర్గాల అంచనా. విజయవాడతో పాటుగా మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో ఏడు నుంచి ఎనిమిది వందల చిన్న దుకాణాలు బంగారం విక్రయాలు చేస్తుంటాయి. వీటిల్లో సుమారుగా మరో 25 నుంచి 40 కిలోల బంగారం విక్రయాలు జరుగుతుంటాయి. ఇవి కాకుండా విజయవాడలో దాదాపుగా ఏడెనిమిది వందల కార్ఖానాలు కొనసాగుతున్నాయి. వాటిల్లో సుమారు వంద కిలోల మేర బంగారం నిత్యం వినియోగిస్తుంటారు. ఇవి సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాలు. కానీ బంగారం విక్రయాలు వివాహాల సీజన్, అక్షయ తృతీయ, ధనత్రయోదశి రోజుల్లో మరింత అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ వినియోగం సగానికన్నా పడిపోయిందని వ్యాపార, కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. వ్యాపారాలు పడిపోయాయి.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో వ్యాపారాలు దారుణంగా పడిపోయాయి. దీని ప్రభావంతో వ్యాపారులతో పాటుగా ఆభరణాల తయారీ చేసే కార్మికులు నానా తంటాలు పడుతున్నారు. – కోన శ్రీహరిసత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి, బెజవాడ జ్యూవెలరీ అండ్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. బంగారు ఆభరణాల తయారీ కారి్మకులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు చేరుకున్నారు. ఇటీవల యనమలకుదురులో ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు బంగారం ధరల (Gold Rate) పెరుగుదల ప్రధాన కారణం. చాలా మంది ఈ వృత్తిని వదిలేసి రోజువారీ కార్మికులలుగా వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి. – తోలేటి శ్రీకాంత్, చైర్మన్, వైఎస్సార్ సీపీ చేతివృత్తుల విభాగంపరిస్థితి దయనీయం.. ఆభరణాల తయారీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. తులం బంగారం (Gold) లక్షకు చేరుకోవటంతో ఈ పరిస్థితులు చాలా రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. పనులు లేకపోవటంతో ఆదాయం లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. – మందారపు పోతులూరి ఆచారి, ప్రధాన కార్యదర్శి, శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘంఇదీ చదవండి : Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!