breaking news
AIPMT
-
జులై 25న మెడికల్ ప్రవేశ పరీక్ష
- క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో అనివార్యమైన రీ- ఎగ్జామ్ - సుప్రీంకోర్టు ఆదేశాలతో కొత్త షెడ్యూల్ విడుదల చేసిన సీబీఎస్ఈ - జులై 25 న పరీక్ష.. ఆగస్టు 17 లోగా ఫలితాలు న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఆలిండియా ప్రీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ జులై 25న జరగనుంది. ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో గడిచిన మే 5న జరిగిన ప్రవేశ పరీక్షను సుప్రీంకోర్టు రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోర్టు ఆదేశాలప్రకారం తాజాగా రూపొందించిన షెడ్యూల్ ను సీబీఎస్ఈ అధికారులు మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు. ముఖ్యాంశాలు.. - పరీక్ష పునఃనిర్వహణ: జులై 25 - ఫలితాల విడుదల: ఆగస్టు 17 లోగా - మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తకి గడువు: ఆగస్టు 28 - రెండోదశ కౌన్సెలింగ్: సెప్టెంబర్ 4లోగా - చివరి, మూడో దశ కౌన్సెలింగ్: సెప్టెంబర్ 11లోగా ప్రశ్నా పత్రాలు లీకైన నేపథ్యంలో పరీక్షను రద్దుచేసిన సుప్రీంకోర్టు అది చెల్లదని స్పష్టం చేసింది. నాలుగువారాల్లోగా కొత్తగా పరీక్ష నిర్వహించే ఏర్పాట్లు చేయాలని కూడా సీబీఎస్ఈని ఆదేశించింది. పరీక్ష కేంద్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ప్రశ్నా పత్రాల లీకేజీ సమస్య ఏర్పడుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారైనా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. మెత్తం 6.3 లక్షల మందికి ఇప్పటికే ఓసారి పరీక్షకు హాజరయ్యారు. మెదట హాల్ టికెట్లు పొందిన విద్యార్థులందరూ ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా జూలై 25 న నిర్వహించే పరీక్షకు హాజరుకావచ్చని అధికారులు పేర్కొన్నారు. -
ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ రద్దు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆల్ ఇండియా ప్రి మెడికల్ టెస్టు ప్రశ్నా పత్రాలు లీకైన నేపథ్యంలో అది చెల్లదని స్పష్టం చేసింది. నాలుగువారాల్లోగా కొత్తగా పరీక్ష నిర్వహించే ఏర్పాట్లు చేయాలని కూడా సీబీఎస్ఈని ఆదేశించింది. పరీక్ష కేంద్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ప్రశ్నా పత్రాల లీకేజీ సమస్య ఏర్పడుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారైనా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. అంతకుముందు మరోసారి పరీక్షకు ఏర్పాట్లు చేస్తే జాప్యం అవుతుందని, విద్యార్థులు నష్టపోతారని సీబీఎస్ఈ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది. ప్రశ్నాపత్రాలు లీక్ అవలేదని సీబీఎస్ఈ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మొత్తం 6.3 లక్షల మందికి ఇప్పటికే ఓసారి పరీక్ష నిర్వహించింది. ప్రశ్నాపత్రాలు లీకవడంతో కొందరు కోర్టుకు వెళ్లగా జూన్ 5న వెలువరించాల్సిన ఫలితాలు ఆగిపోయాయి.