breaking news
Aham Reboot Movie
-
అహం.. అలా చేసుంటే ఇంకా బాగుండేది: పరుచూరి
ఒకే ఒక్క క్యారెక్టర్.. గంటన్నర సినిమా.. సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ అహం- రీబూట్. ఆహాలో రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమాపై దర్శకరచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో రివ్యూ ఇచ్చారు.అలా చేసుంటే..ఆయన మాట్లాడుతూ.. రేడియో జాకీగా పని చేసే ఓ యువకుడి చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఒకే పాత్రతో సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఒకే క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కష్టం. ఇందులో సోలోమ్యాన్ షోలా కాకుండా ప్రియురాలి పాత్రను నెమరువేసుకునే సన్నివేశాలు రూపొందించి ఉంటే ఇంకా బాగుండేది. అప్పుడు ప్రేక్షకులు సినిమాను ఇంకా బాగా చూసేవారు.తాపత్రయం బాగుంటుందిసినిమా గురించి మరింత మాట్లాడుతూ.. తన జీవితంలో ఒకరిని కోల్పోయినందుకు చనిపోదామనుకునే దశ నుంచి దాన్నుంచి బయటపడటం అనేది మంచి సందేశం. తన జీవితంలో జరిగిన సంఘటన మరొకరి జీవితంలో జరగకూడదని హీరో పడే తాపత్రయం బాగుంటుంది. చిన్నచిన్న సమస్యలకే ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది మంచిది కాదని సినిమాలో చక్కగా చెప్పారు.ప్రయోగాలు ఆపకూడదునూతన ఒరవడి కోసం ఇలాంటి సినిమాలను అప్పుడప్పుడు చూడాలి. కొన్నిసార్లు ప్రయోగాలు అద్భుత విజయాలను సాధిస్తాయి. మరికొన్నిసార్లు దెబ్బతింటాయి. దెబ్బతిన్నాం కదా అని ప్రయోగాలు ఆపకూడదు అని పేర్కొన్నారు. కాగా సుమంత్ హీరోగా నటించిన అహం మూవీకి ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించాడు. -
Aham Reboot: సోలో క్యారెక్టర్.. గంటన్నర సినిమా
ఒకే ఒక్క క్యారెక్టర్.. దాదాపు గంటన్నర సినిమా. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలై, కొత్తదనాన్ని ప్రదర్శిస్తున్న సినిమా ‘అహం రీబూట్’. ఫిల్మ్ మేకింగ్‌లో..ఓటీటీ ఫ్లాట్‌ఫాం వినూత్న ప్రయోగాలకు వేదికగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే ఓటీటీ వేదికగా సినిమా రూపు రేఖలే మార్చుతూ విభిన్న కథాంశంతో, సరికొత్త సినిమాటిక్ ఫీల్‌తో వస్తున్న సినిమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కోవలోకే వస్తుంది ప్రముఖ సినీనటుడు సుమంత్ నటించిన ‘అహం రీబూట్’. నగరం వేదికగా రూపుదిద్దుకున్న ఈ సినిమా మరోసారి తెలుగువారి ప్రమోగాత్మకతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఆహాలో విడుదలైన 2 నెలల్లోనే 2 కోట్ల మంది వీక్షించిన సినిమాగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా తన అనుభవాలను సాక్షితో పంచుకున్నారు దర్శకులు ప్రశాంత్ సాగర్..,95 నిమిషాల నిడివి ఉన్న సినిమా పూర్తైయ్యేంత వరకు ఒకే ఒక్క క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు అనుసంధానం చేయడం అంత సులువు కాదంటున్నారు దర్శకులు ప్రశాంత్‌సాగర్. సినిమా కోసమే నగరానికొచ్చి, సినిమాతోనే ప్రయాణం చేయాలంటే ఇంతకుమందెన్నడూ చూడని ప్రయోగాలను ఆసక్తికరంగా చూపించగలగాలని ఆయన అంటున్నారు. ఒక రాత్రిలో జరిగే కథతో రూపొందించుకున్న ఈ సినిమాను అక్కినేని సుమంత్‌కు చెప్పాను. వినూత్న ప్రయోగాలు, నూతనత్వం ఉన్న కథాంశాలను వదులుకోని సుమంత్..ట్రయల్ ట్రైలర్ అడిగారు. ఆయన అడిగినట్టుగానే చేసి ఇవ్వడంతో నో చెప్పకుండా చేసి ఒప్పుకున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని ఈ మధ్యనే అమేజాన్ వేదిక కూడా ప్రసారం చేస్తుంది. సోలో క్యారెక్టర్‌తో గతంలోనూ ఒకటీ, రెండూ సినిమాలు వచ్చినప్పటికీ ఓటీటీ వేదికగా కొత్త ఫిల్మ్ మేకింగ్‌తో ఆకట్టుకుంటుంది అహమ్ రీబూట్. కొత్త సినిమాను పరిచయం చేయాలనే నిర్మాత రఘువీర్ గోరపర్తి లక్ష్యం నెరవేరడం మరింత సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో కంటెంట్ రైటర్ సుమలత, ప్రేక్షకులను సంగీతంతో ఎంగేజ్ చేసిన శ్రీరాం మద్దూరి మంచి గుర్తింపు పొందుతున్నారు. చిన్న, పెద్ద అని తేడాలేకుండా, నాన్ కమర్షియల్, డీగ్లామర్ సినిమాను కూడా ప్రేక్షకులు ఇంతలా ఆదరించడం తమలాంటి సినిమా ప్రేమికులకు శుభపరిణామం అని అన్నారు