సీజేపీ నిరసనలు.. అమీర్ ఖాన్ మేనల్లుడికి బిగ్ షాక్
అమీర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు పెద్ద షాకే ఇచ్చారు. అక్టోబర్ 28లోగా దేశం విడిచి వెళ్లాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన సీజేపీ నిరసనలో పాల్గొనడమే ఇందుకు కారణం. ఇమిగ్రేషన్ చట్ట నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 10న ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదాన్ వద్ద సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఈ నిరసన జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్, ఆయన భాగస్వామి లేఖా వాషింగ్టన్, అమీర్ ఖాన్ బంధువు జైన్ మేరీ ఖాన్ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు.ఇమ్రాన్ ఖాన్‌కు అమెరికా పౌరసత్వం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇక్కడ జరిగే నిరసనల్లో పాల్గొనే హక్కు ఉండదని.. ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఆయనకు నోటీసులు జారీ చేసి, అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు.Actor Imran Khan, nephew of Aamir Khan, has been issued a notice by Mumbai Police directing him to leave India by October 28. Imran Khan had participated in a protest at Mumbai’s August Kranti Maidan demanding the resignation of Chief Election Commissioner Gyanesh Kumar. Mumbai Police had also detained him. Action has been taken against Imran Khan under the relevant provision of the Immigration Act over his participation in the protest despite not being an Indian citizen: Mumbai Police— IANS (@ians_india) October 15, 2026చట్టంలోని సెక్షన్లు ఏం చెబుతున్నాయి?ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025 ఉల్లంఘన కింద.. ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు ఎగ్జిట్ నోటీసులు ఇచ్చారు. ఈ యాక్ట్‌లోని సెక్షన్ 7 విదేశీయుల భారత్‌లో ప్రవేశం, ప్రయాణం, నివాసం, నిష్క్రమణను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కల్పిస్తుంది. అలాగే సెక్షన్ 29 ప్రకారం, చట్టం.. దాని కింద రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన సందర్భాల్లో, లేదంటే భద్రతకు సంబంధించిన ప్రతికూల నివేదిక ఉన్నప్పుడు, విదేశీయుడిని దేశం నుంచి తొలగించేందుకు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈ నిబంధనల కింద ఇమ్రాన్‌కు నోటీసులు జారీ చేశారు.జైన్ మేరీ, లేఖాకు గాయాలుఅయితే సీజేపీ నిరసనల సమయంలో పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని.. యూనిఫాంలో ఉన్న సిబ్బంది బలంగా పట్టుకోవడంతో గాయాలయ్యాయని లేఖా వాషింగ్టన్ ఆరోపించారు. తనతో పాటు జైన్ మేరీ ఖాన్‌కు కూడా చేతులు, వేళ్లు, కాళ్లపై గాయాలయ్యాయని ఆమె సోషల్ మీడియాలో వివరించారు. జైన్ మేరీ కూడా తన చేతులు, వేళ్లు, కాళ్లపై కనిపించిన గాయాల గుర్తులను వీడియోలో చూపించారు. పోలీసుల చర్యపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.లేఖా కథనం ప్రకారం.. స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకునేందుకు తామంతా ఆగస్టు క్రాంతి మైదాన్‌కు వెళ్లారు. అక్కడ ఇమ్రాన్ మీడియాతో మాట్లాడుతుండగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, అనంతరం తమను పోలీసు వాహనంలోకి ఎక్కించి కొన్ని గంటలపాటు తిప్పారని ఆమె ఆరోపించారు.ఇమ్రాన్ ఏమన్నారు?తాను ఏ రాజకీయ సంస్థకు ప్రాతినిధ్యం వహించడం లేదని, ఒక పౌరుడిగా అక్కడికి వెళ్లానని ఇమ్రాన్ మీడియాకు తెలిపారు. విడుదలైన తర్వాత పోలీసులతో మాట్లాడిన వీడియోల్లో ‘జై హింద్’ అంటూ నినాదం చేయడం కూడా కనిపించింది. పోలీసు వాహనంలో దాదాపు రెండు గంటలపాటు తిప్పారని ఆయన వివరించిచాడు. అమెరికా పౌరసత్వంపై వివాదంఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని పేర్కొంటూ బీజేపీ నేత కిరీట్ సోమయ్య ఆయన నిరసనలో పాల్గొనడంపై విచారణ జరపాలని, దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబై పోలీసులు ఇమిగ్రేషన్ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నోటీసులపై తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలియాల్సి ఉంది.ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు మేనల్లుడు. ప్రముఖ దర్శకుడు నాసిర్ హుస్సేన్ మనవడు కూడా. 2008లో అబ్బాస్ టైర్‌వాలా దర్శకత్వంలో వచ్చిన ‘జానే తూ యా జానే నా’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. జెనీలియా కథానాయికగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ అప్పట్లో యువతను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘కిడ్నాప్’, ‘లక్’, ‘ఐ హేట్ లవ్ స్టోరీస్’, ‘బ్రేక్ కే బాద్’, ‘ఢిల్లీ బెల్లీ’, ‘మేరే బ్రదర్ కీ దుల్హన్’, ‘ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ’, ‘మత్రు కీ బిజ్లీ కా మండోలా’, ‘గోరి తేరే ప్యార్ మే’, ‘కట్టీ బట్టీ’ వంటి సినిమాల్లో నటించారు. కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, 2026లో ‘హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్’లో ప్రత్యేక పాత్రతో మళ్లీ తెరపై కనిపించారు. ఆయన పార్ట్నర్ లేఖా వాషింగ్టన్ కూడా నటే. తెలుగులో ‘వేదం’లో మంచు మనోజ్‌కు జోడిగా నటించారు.ఇదీ చదవండి: అదసలు ప్రేమే కాదు.. బిహార్-రష్యా ప్రేమ్ కహానీలో బిగ్ ట్విస్ట్