breaking news
abcd 3 movie
-
అటు డ్యాన్స్... ఇటు ఫైట్
డ్యాన్స్ మూమెంట్స్‌ను బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత డైరెక్టర్ యాక్షన్ అనగానే ఫైట్ స్టార్ట్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఏంటి? ఆమె కన్ఫ్యూజ్ అయ్యారా? అని ఆలోచించకండి. ఎందుకంటే శ్రద్ధా ఫుల్ క్లారిటీతోనే అలా చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... ప్రస్తుతం ‘సాహో’ మూవీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొంటున్నారామె. ఈ సినిమా షాట్ గ్యాప్‌లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది రీసెంట్గా సైన్ చేసిన ‘ఏబీసీడీ 3’ చిత్రం కోసమే. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌ధావన్ కథానాయకుడు. నోరా ఫతేహి కీలక పాత్ర చేస్తారు. తొలుత ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ను కథానాయికగా తీసుకున్నారు. కానీ, సల్మాన్‌తో కత్రినా చేస్తున్న ‘భారత్’ సినిమా డేట్స్ ‘ఏబీసీడీ 3’తో క్లాష్ అవడం.. కత్రినా తప్పుకోవడంతో శ్రద్ధా లైన్లోకి వచ్చారు. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఎక్కువ టైమ్ లేకపోవడంతో ‘సాహో’ సెట్లోనే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారట శ్రద్ధా కపూర్. శ్రద్ధా మాత్రమే కాదు.. వరుణ్ ధావన్ కూడా డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారు. అయితే ఆయన ముంబైలో.. శ్రద్ధా మాత్రం ఏ షూటింగ్లో ఉంటే అక్కడే. ‘సాహో, ఏబీసీడీ 3’ సినిమాలే కాకుండా ‘చిఛోరే, సైనా’ చిత్రాలతో బిజీగా ఉన్నారామె. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
వరుణ్, శ్రద్ధాలతోనే ఏబీసీడీ 3
ఎనీబడీ కెన్ డాన్స్ 2 అంటూ కలెక్షన్లు కొల్లగొట్టిన రెమో డిసౌజా ఇప్పుడు ఏబీసీడీ 3 సినిమా కూడా తీసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో కూడా ఏబీసీడీ 2 హీరో హీరోయిన్లు వరుణ్ ధావన్, శ్రద్ధాకపూరే నటించబోతున్నారు. ప్రస్తుతం తాను వేరేసినిమా చేస్తున్నానని, వరుణ్, శ్రద్ధా కపూర్ కూడా వేరే వేరే సినిమాలు చేస్తున్నారని.. ఒక్కసారి తాము మగ్గురం ఫ్రీ అయితే అప్పుడు వెంటనే ఏబీసీడీ 3 సినిమా తీస్తామని ఆయన చెబుతున్నారు. ఏబీసీడీ 2 సినిమా సక్సెస్ పార్టీని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. 2013లో డాన్స్ నేపథ్యంలో రెమో తీసిన ఏబీసీడీ సినిమా ఇప్పటికే రెండు భాగాలు విడుదలై రెండూ విజయం సాధించాయి. ఏబీసీడీ సినిమాకు దాదాపు 104 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఏబీసీడీ 2 ఇప్పటికే 103.25 కోట్ల రూపాయల కలెక్షన్లు దండుకుంది. ఇప్పటికీ చాలాచోట్ల విజయవంతంగా నడుస్తోంది.