breaking news
A1-division
-
చంద్రబాబు ఏ1గా కేసు నమోదు చేస్తాం
రాజమహేంద్రవరం రూరల్: పుంగనూరులో రెచ్చగొట్టేలా మాట్లాడి విధ్వంసానికి కారకుడైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏ1గా కేసు నమోదు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ముందే నిర్ణయించిన షెడ్యూల్ రూట్లో వెళ్లకుండా, ఎందుకు పుంగనూరులోకి ప్రవేశించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలనే కుట్రేనని అన్నారు. బీరు బాటిళ్లు, రాళ్లు, కర్రలు వారికి అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఈ ఘటనలో పోలీసులు సహా 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయన్నారు. గాయపడిన పోలీసులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. పోలీసులపై దాడి, పోలీసు వాహనాల విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్నామని.. సీసీ పుటేజ్, ఇతర ఆధారాలు పరిశీలిస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. -
వంశీవర్ధన్ వీరవిహారం
బాట్లింగ్, ఎంపీ కోల్ట్స్ మ్యాచ్ డ్రా ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో హైదరాబాద్ బాట్లింగ్, ఎంపీ కోల్ట్స్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే బాట్లింగ్ బ్యాట్స్‌మన్ వంశీవర్ధన్ రెడ్డి (274 బంతుల్లో 201 నాటౌట్, 24 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో జట్టుకు 194 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో బాట్లింగ్‌కు 10, కోల్ట్స్‌కు 3 పాయింట్లు లభించాయి. 156/4 స్కోరుతో గురువారం చివరి రోజు ఆటప్రారంభించిన హైదరాబాద్ బాట్లింగ్.. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వంశీ అజేయ డబుల్ సెంచరీ సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌ను 327/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఎంపీ కోల్ట్స్ బౌలర్ అమన్ ఐలవత్ 3 వికెట్లు తీశాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన ఎంపీ కోల్ట్స్ మ్యాచ్ ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. జయ్ పాండే (46 నాటౌట్), ఆకాశ్ కులకర్ణి (36 నాటౌట్) రాణించారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 423/5 డిక్లేర్డ్; కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 175, రెండో ఇన్నింగ్స్: 238 (ప్రశాంత్ అవస్తి 68; షోయబ్ 3/25, అమోల్ షిండే 3/60) ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 308, రెండో ఇన్నింగ్స్: 206/3 (ఆకాశ్ 103 నాటౌట్, టి.రవితేజ 83), ఎస్బీహెచ్ తొలి ఇన్నింగ్స్: 400 (ఆకాశ్ భండారి 77, చైతన్య 65; హర్ష 4/48, అమ్రుద్దీన్ 4/64) ఆర్.దయానంద్ తొలి ఇన్నింగ్స్: 208, రెండో ఇన్నింగ్స్: 253/9 (శశాంక్ నాగ్ 76, వికాస్ 62; ప్రత్యూష్ 4/68, అహ్మద్ అస్కరి 3/67), ఫలక్‌నుమా తొలి ఇన్నింగ్స్: 161, రెండో ఇన్నింగ్స్: 36/2. సుమంత్, యతిన్ సెంచరీలు కొల్లా సుమంత్ (157 బంతుల్లో 151 నాటౌట్, 18 ఫోర్లు), యతిన్ రెడ్డి (227 బంతుల్లో 115, 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో బీడీఎల్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 65 పరుగుల ఆధిక్యం లభించింది. కాంటినెంటల్ తో డ్రా అయిన ఈ మ్యాచ్‌లో బీడీఎల్‌కు 5, కాంటినెంటల్ కు 2 పాయింట్లు దక్కాయి. చివరి రోజు ఆటలో బీడీఎల్ 6 వికెట్లకు 459 పరుగులు చేసింది. కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్‌లో 394 పరుగులు చేసింది. మెహదీహసన్‌కు 6 వికెట్లు ఎన్స్‌కాన్స్, దక్షిణ మధ్య రైల్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. ఎన్స్‌కాన్స్ బౌలర్ మెహదీహసన్ (6/123) బౌలింగ్‌లో రాణించడంతో రైల్వే తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 345 పరుగులు చేసింది. 440/8 స్కోరు చేసిన ఎన్స్‌కాన్స్‌కు తొలి ఇన్నింగ్స్ లో 95 పరుగుల ఆధిక్యం లభించింది.