breaking news
-
అమ్మాయిల పిచ్చి! నువ్వు చూశావా? రమ్యకు నాగ్ కౌంటర్
బిగ్‌బాస్ షోలో (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) అక్షింతలు వేస్తున్నాడు. నోరుంది కదా అని అందరిమీదా పెత్తనం చెలాయించాలని చూసిన మాధురికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు. మాటతీరు మార్చుకోమని హెచ్చరించాడు. ఇప్పుడిక రమ్య వంతు వచ్చింది. ఈమె వచ్చీరావడంతోనే కల్యాణ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని అతడిపై ముద్ర వేసింది. రమ్య కామెంట్స్.. నోరెళ్లబెట్టిన కల్యాణ్నిజానికి కల్యాణ్ (Pawan Kalyan Padala) చూపులు, ప్రవర్తన.. కాస్త తేడాగా ఉన్నప్పటికీ మరీ అమ్మాయిల పిచ్చి అనేయడం తప్పుగానే అనిపించింది! నాపై చేతులు వేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటిచ్చేస్తాను అని రమ్య మాట్లాడిన వీడియోను కన్ఫెషన్ రూమ్‌లో ప్లే చేశాడు నాగ్. అది చూసి నోరెళ్లబెట్టాడు కల్యాణ్. ఒకరిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వేమీ అతడిని జీవితాంతం చూడలేదని కౌంటరిచ్చాడు నాగ్. ఫుల్ క్లారిటీకల్యాణ్ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు సరిగా ఉందా? లేదా? అని ప్రేక్షకుల్ని అడగ్గా సగం మంది అవునని, మిగతా సగం మంది కాదని బదులిచ్చారు. ప్రేక్షకుల రెస్పాన్స్‌కు కల్యాణ్ షాకయ్యాడు. అంటే జనాల్లో తనపై ఏ విషయంలో వ్యతిరేకత ఉందో ఈ ఎపిసోడ్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా మారాడు. ఇంకా ఆటపై ఫోకస్ పెడితే మాత్రం కల్యాణ్ విన్నింగ్ రేస్‌లో దూసుకుపోవడం ఖాయం! చదవండి: మాధురికి క్లాస్ పీకిన నాగార్జున.. తీరు మార్చుకోమని హెచ్చరిక! -
హీరోయిన్ను అలా టచ్ చేసిన సౌబిన్.. వీడియో వైరల్
సందట్లో సడేమియా... శునకానందం పొందాలయా...అన్నట్టుగా మారుతోంది కొందరు ప్రబుద్ధుల ప్రవర్తన. అభిమానం పేరిట అసభ్యత ముదురుతోంది. ముఖ్యంగా హీరోయిన్లపై అది అనుచితంగా మారుతోంది. రకరకాల కారణాలతో జన సమూహాల్లోకి వస్తున్న కధానాయికలను అసభ్యకరంగా తాకకూడని చోట తాకుతున్న సంఘటనలు కంపరం కలిగిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలలో బాధితులుగా మారిన పలువురు తారల జాబితాలో ఇప్పుడు మళయాళ నటి నవ్యనాయర్ కూడా జరిగింది. వివరాల్లోకి వెళితే... పాతిరాత్రి అనే మళయాళ చిత్రంలో సౌబిన్ షాహిర్ (కూలీ ఫేమ్) నవ్యనాయర్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని వీరిద్దరూ పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే క్రమంలో కోజికోడ్‌లోని హైలైట్ మాల్లో సినిమా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ తర్వాత సినిమా తారాగణం వేదిక నుంచి బయటకు వెళుతుండగా, ఊహించని సంఘటన జరిగింది, అక్కడ జనంలో ఉన్న ఒక వ్యక్తి నటి నవ్య నాయర్‌ను అకస్మాత్తుగా వెనుక నుంచి తడిమాడు. ఇది జరిగిన వెంటనే సౌబిన్ షాహిర్(Soubin Shahir) కూడా నవ్యనాయర్ను కాపాడే క్రమంలో తాను కూడా టచ్ చేశాడు. ఈ సంఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించడం ప్రారంభించారు. తొలుత తనను తాకిన వ్యక్తి వైపు నవ్యనాయర్ ఉరిమిచూడడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లలో అనేక మంది నటికి మద్దతుగా కామెంట్స్ చేశారు. అయితే కొందరు మాత్రం ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు, అపరిచితులు తాకితే ఉరిమి చూసిన నటి సౌబిన్ తాకితే ఎందుకు ఊరుకుంది? అంటూ కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే దీనిపై చాలా మంది అభిమానులు సౌబిన్ను సమర్థించడానికి ముందుకు వచ్చారు, వీడియోను పరిశీలనగా చూడాలని అందులో, అగంతకుడు తాకిన తర్వాత ఆమెకు రక్షణగా మాత్రమే సౌబిన్ వ్యవహరించాడని అంటూ కొందరు పరిణితి ప్రదర్శించారు. అంతేకాక తనను రెండవ సారి తాకింది సౌబిన్ అని ఆమెకు తెలుసు. అంటూ గుర్తు చేశారు. ‘‘ఒకరి శరీరంపై చేతులు పెట్టడానికి అనుమతి అవసరం... ఈ సంఘటనలో సౌబిన్ ఆమెను రక్షించడానికి ప్రయత్నిoచినట్టు స్పష్టంగా తెలుస్తోంది.’’ అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.రతీనా దర్శకత్వం వహించి బెంజీ ప్రొడక్షన్స్ నిర్మించిన పాతిరాత్రి సినిమాలో నవ్య సౌబిన్లు పోలీస్ ఆఫీసర్లు జాన్సీ, హరీష్ పాత్రలను పోషించారు. అర్ధరాత్రి జరిగే ఒక రహస్య సంఘటనను వారు వెలికితీసే థ్రిల్లర్ ఈ జంటను అనుసరిస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల అవుతోంది. View this post on Instagram A post shared by IndianCinemaGallery (@indiancinemagallery_official) -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
న్యూఢిల్లీ: ప్లేఆఫ్స్ రేసులో ఉన్న తెలుగు టైటాన్స్‌కు వరుస పరాజయాలు కుంగదీస్తున్నాయి. టైబ్రేక్‌కు దారితీసిన గత మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిన తెలుగు టైటాన్స్ గురువారం జరిగిన పోరులో యు ముంబా చేతిలో 26–33తో పరాజయం పాలైంది. టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్, కెప్టెన్ విజయ్ మలిక్ (10) ఒంటరి పోరాటం చేశాడు. రెయిడింగ్‌లో 17 సార్లు కూతకెళ్లి 9 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను టాకిల్ చేసి మరో పాయింట్ సాధించాడు. సహచరుల్లో భరత్ (5) మాత్రమే మెరుగ్గా ఆడాడు. డిఫెండర్లు అంకిత్ 3, అవి దుహన్, శుభమ్ షిండే చెరో 2 పాయింట్లు చేశారు. యు ముంబా తరఫున రెయిడర్ అజిత్ చౌహాన్ (8) రాణించాడు. ఇతనికి సహచరులు సందీప్ (4), రింకూ (4), అమిర్ మొహమ్మద్ (3), పర్వేశ్ (3)లను చక్కని సహకారం లభించింది. ప్రస్తుతం 8 విజయాలతో మూడో స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్‌కు ఈ సీజన్లో ఇక మూడే మ్యాచ్‌లు మిగిలున్నాయి. టైటాన్స్ రేపు పుణేరి పల్టన్‌తో పోటీపడుతుంది. అనంతరం 19న గుజరాత్, 22న ఆఖరి పోరులో హరియాణా స్టీలర్స్‌తో తలపడుతుంది. పాట్నా , హరియాణా గెలుపు అంతకుముందు హోరాహోరీగా జరిగిన తొలి మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్ అయిన పట్నా పైరేట్స్ టైబ్రేక్‌లో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 32–32 స్కోరుతో సమంగా నిలిచాయి. టైబ్రేక్‌లో పట్నా 6–5తో పైచేయి సాధించింది. పట్నా కెపె్టన్ అయాన్ రెయిడింగ్‌లో చెలరేగాడు. 20 సార్లు కూతకెళ్లిన అతను 14 సార్లు పాయింట్లతో వచ్చాడు. మిగతా వారిలో రెయిడర్ అంకిత్ కుమార్ (5), డిఫెండర్ నవ్‌దీప్ (4) రాణించారు. బెంగళూరు బుల్స్ తరఫున అలీ రెజా మీర్జాయిన్ (17) ఒక్కడే శ్రమించాడు. అనంతరం జరిగిన మూడో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 53–26తో యూపీ యోధాస్‌పై ఘన విజయం సాధించింది. స్టీలర్స్ జట్టులో శివమ్ (15), జైదీప్ (6), సాహిల్ నర్వాల్ (4) రాణించారు. యూపీ తరఫు గగన్ గౌడ (7), భవానీ రాజ్‌పుత్, హితేశ్ చెరో 3 పాయింట్లు చేశారు. నేటి మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్‌తో దబంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్‌పాంథర్స్‌తో యూపీ యోధాస్ తలపడతాయి. -
బెంగుళూరులో దారుణం.. సీసీ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు
బెంగుళూరు: ప్రమాదం ఏ రూపంలో ఎదురవుతుందో చెప్పలేం.. బెంగుళూరులో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపింది. గత నెల సెప్టెంబర్ 13న గణేష్ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాకు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి.. నగలు దోచుకున్నారు. నిందితులను ప్రవీణ్, యోగనందగా పోలీసులు గుర్తించారు. బైక్‌పై ఆ మహిళల వద్దకు వచ్చి వారి బంగారు గొలుసులను లాక్కోవడానికి ప్రయత్నించారు.భయపడిన ఉష తన గొలుసును వారికి ఇచ్చేసింది. కానీ మరొక మహిళ వరలక్ష్మి, ప్రతిఘటించింది. దీంతో యోగానంద ఆమెపై కత్తితో క్రూరంగా దాడి చేసి.. రెండు వేళ్లను నరికాడు. ఆ తర్వాత నిందితులు 55 గ్రాముల బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి పారిపోయారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది.ఈ ఘటనపై పోలీసులు వారాల తరబడి దర్యాప్తు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను అరెస్టు చేసింది. వారు దొంగిలించిన బంగారాన్ని, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత యోగనంద పుదుచ్చేరి, ముంబై, గోవా వంటి నగరాలకు పారిపోయి.. ఆ తర్వాత కర్ణాటకలోని తన సొంత గ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అతనికి గతంలో నేర చరిత్ర ఉందని, ఒక హత్య కేసులో కూడా ప్రమేయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు వరలక్ష్మి ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.On camera: Two men on a bike wielding machetes rob women in Bengaluru, chop off two fingers and snatch their gold chain. Arrested after a month, police have now recovered 74g of gold and the weapons.https://t.co/ymRnB0fF5t pic.twitter.com/ElKFdlFKH2— Deepak Bopanna (@dpkBopanna) October 18, 2025 -
దబంగ్ ఢిల్లీ మరో విజయం
ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఢిల్లీ జట్టు శుక్రవారం జరిగిన పోరులో 37–31 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. ఢిల్లీ తరఫున అక్షిత్ ధుల్ 12 పాయింట్లతో సత్తా చాటగా... నవీన్ 6, ఫజల్ 5 పాయింట్లు సాధించారు. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో ఢిల్లీ 16 మ్యాచ్‌లు ఆడి 13 విజయాలు, 3 పరాజయాలతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–29 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను చిత్తుచేసింది. జైపూర్ తరఫున అలీ సమది 13 పాయింట్లు, నితిన్ 11 పాయింట్లతో రాణించగా... యోధాస్ తరఫున సురేందర్ 12 పాయింట్లతో పోరాడాడు. గ్రూప్ అడుగున ఉన్న జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 51–49తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో దబంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్‌తో పుణేరి పల్టన్, బెంగాల్ వారియర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ ఆడతాయి. -
రూ. 1 లక్ష కోట్ల మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ ఎంట్రీ..
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ విభాగంలోకి ప్రవేశించింది. గృహావసరాల కోసం ఓలా శక్తి పేరుతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) సొల్యూషన్‌ను ఆవిష్కరించింది.దేశీయంగా విద్యుత్ కొరత లేదని, కాకపోతే నిల్వ చేసుకోవడానికి సంబంధించి సవాళ్లు ఉంటున్నాయని సంస్థ సీఎండీ భవీష్ అగర్వాల్ తెలిపారు. దీన్ని ఒక అవకాశంగా మల్చుకోవచ్చని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం ప్రపంచ స్థాయి బ్యాటరీ, సెల్ టెక్నాలజీని రూపొందించామని, ఓలా శక్తి దానికి కొనసాగింపని అగర్వాల్ చెప్పారు.అధునాతన 4680 భారత్ సెల్‌ని ఉపయోగించి దీన్ని పూర్తిగా దేశీయంగా తయారు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం బీఈఎస్ఎస్ మార్కెట్ రూ. 1 లక్ష కోట్లుగా ఉండగా, 2030 నాటికి రూ. 3 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.ఓలా శక్తి ముఖ్య ఫీచర్లుతక్షణ పవర్ స్విచింగ్:సాంప్రదాయ ఇన్వర్టర్లు లేదా డీజిల్ జనరేటర్ల మాదిరిగా కాకుండా, ఉపకరణాలను సురక్షితంగా ఉంచుతూ, తక్షణమే (0 మిల్లీసెకన్లు) శక్తిని మారుస్తుంది.స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్:రియల్‌టైమ్‌లో శక్తి వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. నియంత్రిస్తుంది. వినియోగ విధానాలను తెలుసుకుని వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. విద్యుత్, డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది.వోల్టేజ్ రక్షణ: విస్తృత వోల్టేజ్ పరిధిలో (120V–290V) పనిచేస్తుంది. పరికరాలను హెచ్చుతగ్గుల నుండి రక్షిస్తుంది.సురక్షితం, సమర్థవంతం: రన్నింగ్ లేదా నిర్వహణ ఖర్చులు లేకుండా ఆటోమోటివ్-గ్రేడ్ భద్రత, 98 శాతం వరకు సామర్థ్యం. వాతావరణ నిరోధకత: IP67-రేటెడ్ బ్యాటరీలకు దుమ్ము, నీరు, భారీ వర్షాల నుండి పూర్తిగా రక్షణఅధునాతన ఫీచర్లు:టైమ్-ఆఫ్-డే (ToD) ఛార్జింగ్, స్మార్ట్ బ్యాకప్ ప్రాధాన్యత, రిమోట్ డయాగ్నస్టిక్స్, OTA సాఫ్ట్వేర్ అప్డేట్లు, విస్తరణ ఎంపికలు, అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఆన్లైన్ ఆపరేషన్.ధర, లభ్యతఓలా శక్తి 1.5 kWh, 3 kWh, 5.2 kWh, 9.1 kWh కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. మొదటి 10,000 యూనిట్లకు ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి.. 1.5 కిలోవాట్లకు రూ.29,999, 3 కిలోవాట్లకు రూ. 55,999, 5.2 కిలోవాట్లకు రూ.1,19,999, 9.1 కిలోవాట్లకు రూ. 1,59,999 లుగా కంపెనీ నిర్ణయించింది. రూ.999 ధరతో రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది మకర సంక్రాంతి నుండి డెలివరీలు ఉంటాయని భావిస్తున్నారు. -
నా కోడళ్లు బంగారం.. డిమాండ్ చేసే అత్తను కాను: అమల
'నా కోడళ్లు బంగారం అంటోంది' హీరో అక్కినేని నాగార్జున భార్య, నటి అమల అక్కినేని (Amala Akkineni). మంచి కోడళ్లు దొరికినందుకు సంతోషంగా ఉన్నానని చెప్తోంది. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ, జైనబ్‌ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అమల మాట్లాడుతూ.. నాకు అద్భుతమైన కోడళ్లు దొరికారు. వాళ్లు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు. వాళ్ల రాకతో నా జీవితం కొత్తగా మారింది. వారి వల్లే నాకు గర్ల్స్ సర్కిల్ ఏర్పడింది. బిజీగా ఉండటం మంచిదే!కోడళ్లిద్దరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఈ కాలం అమ్మాయిలు బిజీగా ఉండటం మంచిదే! వాళ్ల పనుల్లో వారు బిజీగా ఉంటే నా పనులతో నేను బిజీగా ఉంటాను. సమయం దొరికినప్పుడు అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తుంటాం. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలని డిమాండ్ చేసే అత్తను కాదు, అలాగే డిమాండ్ చేసే భార్యను కూడా కాదు.. ఒక సాధారణ తల్లిని మాత్రమే! అని అమల చెప్పుకొచ్చింది.అక్కినేని కుటుంబంనాగార్జున 1984లో లక్ష్మీ దగ్గుబాటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాగచైతన్య సంతానం. 1990వ సంవత్సరంలో దంపతులు విడిపోయారు. అనంతరం 1992లో నాగ్.. నటి అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అఖిల్ సంతానం. నాగచైతన్య గతంలో సమంతను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నాడు. 2024లో హీరోయిన్ శోభిత ధూళిపాళను పెళ్లాడాడు. అఖిల్.. జైనబ్‌ను పెళ్లి చేసుకున్నాడు.చదవండి: ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం! -
ఈవీ ఉంటే.. ఇంటి ధర పెంచుడే..
ఇంధన వనరుల ధరలు రోజుకు ఒకలా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోజిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది.2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కొత్త ప్రాజెక్ట్‌లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగం (రెట్రోఫిట్) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది.ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్ స్థలాన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయిస్తాయని అంచనా.ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐఓటీ) చార్జింగ్ ఉపకరణాలు, ఇంటర్నెట్ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి కనుక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 2–5 శాతం వరకు ఉంటుందని తెలిపారు.ఆఫీస్ స్పేస్‌లలో కూడా..ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్ స్పేస్‌లకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవిన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్ పార్కింగ్‌లలో ఖాళీ ప్లేస్‌లు లేకపోవడమే అసలైన సవాలు.ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్ ఆపరేట్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సర్వీస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్ఎల్ సూచించింది. -
అప్పుడు గాజులమ్ముకున్నా.. ఇప్పుడు కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా!
బోల్డ్ సినిమాల్లో నటించి పాపులర్ అయింది వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్ (Rekha Boj). సినిమా అవకాశాలు ఎక్కువ పెద్దగా అవకాశాలు రాకపోయేసరికి యూట్యూబ్‌లో కవర్ సాంగ్స్ చేస్తోంది. ఆ మధ్య పుష్ప మూవీలోని సామి సామి.. పాట కవర్ సాంగ్ చేసేందుకు రెండు గాజులు అమ్ముకుంది. అంతటితో ఆగడం లేదు.. కుదిరితే కిడ్నీలైనా అమ్ముకుంటాను కానీ యాక్టింగ్‌ను మాత్రం వదిలేది లేదని తెగేసి చెప్తోంది.షార్ట్‌ఫిలింతో జర్నీ మొదలురేఖా భోజ్ మాట్లాడుతూ.. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం 'లవ్ ఇన్ వైజాగ్'. షణ్ముఖ్ జశ్వంత్‌తో కలిసి యాక్ట్ చేశాను. తర్వాత డర్టీ పిక్చర్ అనే లఘు చిత్రం చేశాను. కాలాయా తస్మై నమః సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాను. నా జీవితంలో ఫస్ట్ కవర్ సాంగ్ సామి సామి.. బంగారు గాజులు అమ్మి మరీ ఈ పాట చేశాను. ఈ సాంగ్ వల్లే మాంగళ్యం సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ మూవీ నాకు మంచి పేరు తీసుకొచ్చింది.కమిట్మెంట్స్ ఇచ్చుంటే..గత ఐదారేళ్లుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ కమిట్మెంట్స్ అడుగుతున్నారు. బంగ్లా రాసిస్తా.. అవి కొనిస్తా.. అదీ ఇదీ అని మభ్యపెట్టేవారు. కమిట్మెంట్ అడిగినవాళ్లకు గట్టిగానే కౌంటర్లిచ్చాను. అలాంటివి చేసుంటే ఈపాటికి చాలా సంపాదించేదాన్ని. నేనేదో.. నా దగ్గరున్న వస్తువులు అమ్ముకుంటూ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ ఇండస్ట్రీని వదిలి ఎక్కడికీ వెళ్లలేను. నాతో పనిచేసేందుకు నిర్మాతలు ముందుకు రాకపోతే నా ఆస్తి అమ్మేసైనా సరే.. ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. గాజులమ్మగా వచ్చిన రూ.4 లక్షలతో సామి సామి పాట ఎలా చేశానో.. కిడ్నీ అమ్మి, ఆ డబ్బుతో సినిమా చేద్దామనుకుంటున్నా.. నాలుగేళ్లుగా బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు..ఎందుకంటే సినిమానే నా ప్రపంచం. ఇకపోతే పాపులారిటీ కోసం బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కి వెళ్లేందుకు ప్రయత్నించాను. గత నాలుగేళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నా.. గతేడాది ఇంటర్వ్యూ కూడా అయింది. అంతా ఓకే అన్నారు.. ఇంకో వారంలో షో స్టార్ట్ అన్న సమయంలో రిజెక్ట్ చేశారు. ముక్కూమొహం తెలియనివాళ్లు కూడా షోకి వస్తున్నారు. మరి నన్నెందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. నాకు అవకాశం ఇచ్చుంటే దాన్ని బాగా ఉపయోగించుకునేదాన్ని. బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్‌కు సైతం వీడియో పంపించాను. కానీ అదృష్టం కలిసి రావడం లేదు అని రేఖా బోజ్ చెప్పుకొచ్చింది.చదవండి: ఈసారి ఇద్దరు కెప్టెన్స్.. సుమన్ ప్రమాణ స్వీకారం! -
ఫిబ్రవరిలో ప్రారంభం
‘రంగస్థలం’ (2018) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు దుబాయ్‌లో జోరుగా జరుగుతున్నాయని తెలిసింది. గతంలో రామ్‌చరణ్, సుకుమార్ కలిసి ఈ సినిమా కథా చర్చల కోసం దుబాయ్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ దుబాయ్‌లో ఉంటూ, ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. రామ్‌చరణ్ కెరీర్‌లోని ఈ 17వ సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుందట.ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు కృతీ సనన్, సమంత వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలోని ఈ సినిమా వచ్చే మార్చి 27న రిలీజ్ కానుంది.