breaking news
-
స్టాక్ మార్కెట్ వరుస సెలవులు.. సోమవారం ట్రేడింగ్ ఉంటుందా?
దేశీయ స్టాక్‌మార్కెట్‌కు వచ్చే వారం వరుసగా వరుస సెలవులు ఉన్నాయి. దీపావళి పండుగ కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) రెండు రోజులు మూతపడనున్నాయి. అయితే వచ్చే సోమవారం అంటే అక్టోబర్ 20న మార్కెట్ ట్రేడింగ్ ఉంటుందా.. లేదా? అన్న సందేహం ఇన్వెస్టర్లలో ఉంది. ఏయే రోజుల్లో స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సెలవు ఉంటుందో ఇప్పుడు చూద్దాం..ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన స్టాక్ మార్కెట్ హాలిడే (Stock Market Holidays) క్యాలెండర్ ప్రకారం.. దీపావళి (Diwali 2025) లక్ష్మి పూజ, బలిప్రతిపదా కారణంగా అక్టోబర్ 21, 22 తేదీలలో సెలవు ఉంటుంది. ఆయాల రోజుల్లో సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు.అక్టోబర్ 20న అమావాస్య తిథి రావడంతో ఈ రోజున పలు రాష్ట్రాల్లో దీపావళి పండుగను జరుపుకోనున్నారు. కానీ భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తెరిచే ఉంటాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అక్టోబర్ 21న వ్యాపారులు, ఇన్వెస్టర్ల కోసం 'ముహూర్త్ ట్రేడింగ్' పేరుతో ఒక గంట ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 2:45 గంటల వరకు ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ జరగనుంది.2025లో రాబోయే స్టాక్ మార్కెట్ సెలవులు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన మార్కెట్ హాలిడే క్యాలెండర్ లో 2025లో మొత్తం 14 ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇంకా మిగిలిన సెలవులు కింది విధంగా ఉన్నాయి..అక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజ అక్టోబరు 22 - బలిప్రతిపాద నవంబర్ 5 - ప్రకాష్ గురుపుర్బ్ శ్రీ గురునానక్ దేవ్ డిసెంబర్ 25 - క్రిస్మస్ -
Italy: ఎయిర్ ఇండియా షాక్.. దీపావళి ప్రయాణాలు వాయిదా!
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న పలువురు భారతీయులు దీపావళి పండుగకు స్వదేశానికి వస్తుంటారు. ఇందుకోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. అలాంటి ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాకిచ్చింది. కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొందామనే సంతోషంలో ఉన్న ప్రవాస భారతీయుల ఆశలపై ఎయిర్ ఇండియా నీళ్లు జల్లింది.దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ఇటలీ నుండి భారతదేశానికి బయలుదేరిన వందలాది మంది ప్రయాణికులు తాము శుక్రవారం ఎక్కాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దయ్యిందని తెలియడంతో షాక్‌నకు గురయ్యారు. తదుపరి విమానం సోమవారం(దీపావళి) లేదా ఆ మర్నాడు(మంగళవారం) బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా చెప్పడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. Hundreds of passengers returning for Diwali break left stranded after Air India’s flight from Milan to Delhi on Oct 17 (AI 138) is cancelled due to a technical glitch. Return now scheduled for four days later. Some were taken to a hotel, where they were later asked to leave.… pic.twitter.com/8LcmrocBfX— Jagriti Chandra (@jagritichandra) October 18, 2025సాంకేతిక సమస్య కారణంగా మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది.‘ఎయిర్ ఇండియా.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని, షెడ్యూల్ చేసిన విమానంలో సాంకేతిక సమస్య కారణంగా కారణంగా.. 2025, అక్టోబర్ 17న మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యింది’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ విమానంలో ఎక్కాల్సిన ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించామని, విమానాశ్రయం సమీపంలోనే వారికి ఈ ఏర్పాట్లు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది.‘ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలతో సీట్ల లభ్యత ఆధారంగా 2025, అక్టోబర్ 20 లేదా ఆ తర్వాత ప్రత్యామ్నాయ విమానాలలో ప్రయాణికులు తిరిగి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులందరికీ భోజనంతో సహా అవసరమైన అన్ని సహాయాలను ఎయిర్ ఇండియా అందిస్తుంది. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఎయిర్ ఇండియా నిబద్ధత కలిగివుంటుందని పునరుద్ఘాటిస్తున్నాం’ అని ప్రతినిధి పేర్కొన్నారు. -
షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) వ్యాఖ్యలపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్పందించాడు. షమీ నిజంగానే ఫిట్‌గా ఉండి ఉంటే కచ్చితంగా జట్టులో ఉండేవాడని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో చివరగా టీమిండియాకు ఆడాడు షమీ.టాప్ వికెట్ టేకర్ఈ వన్డే మెగా టోర్నీలో తొమ్మిది వికెట్లు తీసిన షమీ.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఈ రైటార్మ్ పేసర్‌కు సెలక్టర్లు చోటివ్వలేదు.అప్డేట్ లేదన్న అగార్కర్ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ మాట్లాడుతూ.. షమీ ఫిట్నెస్ గురించి తమకు అప్డేట్ లేదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షమీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు తెలిపాడు. రంజీలు ఆడగలిగే తాను వన్డేల్లో ఆడలేనా అంటూ సెలక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించాడు.షమీ కౌంటర్ఫిట్నెస్ గురించి ఎవరైనా తనను అడిగితే సమాధానం ఇస్తానే తప్ప.. తనంతట తానే ఫిట్‌గా ఉన్నానని చెప్పలేను కదా అంటూ అగార్కర్‌కు కౌంటర్ ఇచ్చాడు. తద్వారా సెలక్షన్ సమయంలో తనను ఎవరూ సంప్రదించలేదనే సంకేతాలు ఇచ్చాడు. ఈ విషయం గురించి అగార్కర్ తాజాగా స్పందించాడు.అగార్కర్ స్పందన ఇదేఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌కు హాజరైన అగార్కర్.. షమీ పట్ల తమ నిర్ణయం సరైందేనని పేర్కొన్నాడు. ‘‘ఒకవేళ అతడు నేరుగా మాట్లాడి ఉంటే.. అందుకు నేను సమాధానం ఇచ్చేవాడిని. కానీ అతడు సోషల్ మీడియాలో ఏ ఉద్దేశంతో మాట్లాడాడో తెలియదు.ఒకవేళ నేను ఈ విషయం గురించి చదివి ఉంటే.. అతడికి ఫోన్ ద్వారానైనా జవాబు ఇచ్చేవాడిని. ప్రతి ఒక్క ప్లేయర్ కోసం నా ఫోన్ ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. గత కొన్నినెలలుగా అతడితో నేను తరచూ చాట్ చేస్తూనే ఉన్నాను.ఏం జరుగుతుందో చూద్దాంకానీ మీకు ఇక్కడ హెడ్లైన్ ఇచ్చేలా ఏమీ మాట్లాడదలచుకోలేదు. టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన ఘనత షమీకి ఉంది. ఏదేనా ఉంటే పరస్పరం మాట్లాడుకుంటాం.ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా.. తను ఫిట్‌గా ఉంటే కచ్చితంగా టూర్‌కు పంపిస్తామని చెప్పాము. దురదృష్టవశాత్తూ అప్పుడు అతడు ఫిట్‌గా లేడు. ఇక దేశీ క్రికెట్ సీజన్ ఇప్పుడే ఆరంభమైంది కదా.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని పేర్కొన్నాడు.అయితే, ఇంగ్లండ్‌తో టెస్టులకు సిద్ధంగా లేకపోయినా.. వన్డే ఫార్మాట్‌కు తాను ఫిట్‌గా ఉన్నానని షమీ చెప్పగా.. అగార్కర్ మాత్రం ఇలా స్పందించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ‘భర్త కంటే ‘బాబా’నే ఎక్కువ!.. తండ్రి కోసం కుర్తా కొనలేని వాడు.. అతడికి రూ. 15 లక్షల గిఫ్ట్!’ -
25 ఏళ్లకే పెళ్లి చేసుకున్న దంగల్ నటి
దంగల్ ఫేమ్ జైరా వాసిం (Zaira Wasim) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించింది. తాజాగా ఆమె పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నిఖా జరిగినట్లు రెండు ఫోటోలను షేర్ చేసింది. అందులో తన ముఖం చూపించలేదు కానీ భర్తతో నెలవంకను చూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.దంగల్‌తో ఫేమ్16 ఏళ్ల వయసులో దంగల్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టింది జైరా. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో చిన్నప్పటి గీతా ఫొగట్ పాత్రలో యాక్ట్ చేసింది జైరా. ఈ మూవీకిగానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. తర్వాత సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. సినిమాలకు గుడ్‌బైaఈ రెండు సినిమాలకుగానూ నేషనల్ చైల్డ్ అవార్డు గెలుచుకుంది. ఆమె నటించిన మూడో సినిమా ద స్కై ఈజ్ పింక్. ఇదే తన ఆఖరి సినిమా! తన విశ్వాసాలకు ఈ గ్లామర్ ప్రపంచం సరిపోదంటూ 2019లో సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. సోషల్ మీడియాలో ఉన్న తన ఫొటోలను డిలీట్ చేయాలని అభిమానులను కోరింది. View this post on Instagram A post shared by Zaira Wasim (@zairawasim_) చదవండి: ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం -
ముద్దుల కోడలి పుట్టిన రోజు వేడుకల్లో నీతా : ఆమె టీ షర్ట్ గమనించారా?
రిలయన్స్ ముఖేష్ అంబానీ, నీతా దంపతుల ముద్దుల కోడలు, అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ పుట్టిన రోజు పార్టీ ఉత్సాహంగా జరిగింది.అనన్య పాండే, జాన్వి కపూర్ , తారా సుతారియా వంటి అనేక మంది బి-టౌన్ సెలబ్రిటీలు వేడుకలకు హాజరు కావడంతో ఈ బర్త్‌డే వేడుక స్టార్-స్టడ్ ఈవెంట్‌గా మారింది. ఓర్రీ అని పిలిచే ఓర్హాన్ అవత్రమణి తన సోషల్ మీడియా హ్యాండిల్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. దీంతో వేడుకలు వైరల్‌గా మారాయి.అక్టోబర్ 16న రాధిక మర్చంట్ పుట్టినరోజు సెలబ్రేషన్ జరిగింది. ఈ వేడుకలో అత్తగారు నీతా అంబానీ హైలైట్‌గా నిలిచారు. రాధిక ఫోటో ఉన్నటీ షర్టు ధరించి, ముద్దుల కోడల్ని ముద్దుగా ఆలింగనం చేసుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఆకాష్ అంబానీతో పాటు, రాధిక స్నేహితులు కూడా పార్టీలో కనిపించారు. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) కాగా వ్యాపారవేత్త వీరెన్ , శైలా మర్చంట్ దంపతుల కుమార్తె రాధిక, తన బాల్య స్నేహితుడు, ప్రేమికుడుఆకాష్ అంబానీని ( జూలై 2024)వివాహం చేసుకుంది. -
ఫలించిన వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగంలో వైద్య విద్య వ్యవస్థ బలోపేతానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేసిన అడుగులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యుల అందుబాటును పెంచడం కోసం వీలైనంత ఎక్కువ మంది వైద్యులను తయారు చేయడానికి వైఎస్ జగన్ 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను 750 ఎంబీబీఎస్ సీట్లతో 2023–24లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ కళాశాలల్లో మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఐదు కళాశాలల్లో మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్, అనస్థీషియా విభాగాల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మంజూరు చేసింది. ప్రస్తుత 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఈ సీట్లలో అడ్మిషన్లు జరుగనున్నాయి. దీంతో పీజీ చదివే డాక్టర్ల ద్వారా ఆ ఆస్పత్రుల్లో రోగుల సంరక్షణ మరింత మెరుగు పడనుంది.వందకు పైగా సీట్లకు అవకాశం వైద్య కళాశాలల కోసం ఐదు చోట్ల జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా గత ప్రభుత్వంలో అభివృద్ధి చేశారు. ఈ ఆస్పత్రుల్లో పీజీ సీట్లు మంజూరుకు వీలుగా ఐపీ, ఓపీ, సర్జరీలు, ఇతర వనరులు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో వందకుపైగా సీట్లు ఐదు కళాశాలల్లో సమకూరాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేటుకు కట్టబెట్టడంపై పెట్టిన శ్రద్ధ.. వైద్య విద్య బలోపేతంపై పెట్టలేదు. కళాశాలల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన ఫ్యాకల్టీ పోస్టులను సకాలంలో భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేని కారణంగానే ఎన్ఎంసీ 60 సీట్లే మంజూరు చేసినట్టు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే మరో 40కి పైగా సీట్లు సమకూరేవని డీఎంఈ వర్గాలు అంటున్నాయి.గత ప్రభుత్వ హయాంలో పీజీ సీట్ల పంట2019కి ముందు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కేవలం 970 పీజీ సీట్లు మాత్రమే ఉండేవి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు.. ఇలా అన్ని పోస్టులు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా చర్యలు తీసుకున్నారు. రోగుల తాకిడికి అనుగుణంగా పలు కళాశాలల్లో కొత్తగా పోస్టులు సృష్టించారు. ఈ చర్యల ఫలితంగా కళాశాలలకు పెద్ద ఎత్తున పీజీ సీట్లను ఎన్ఎంసి మంజూరు చేసింది. ఈ క్రమంలో ఐదేళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్య రెట్టింపు అయింది. 800 మేర పీజీ సీట్లు కొత్తగా రాష్ట్రానికి సమకూరాయి. జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కొత్త వైద్య కళాశాలల ద్వారా ఇప్పుడు మరిన్ని పీజీ సీట్లు మన మెడికోలకు అందుబాటులోకి రావడం గమనార్హం.కొత్త వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లు» ఏలూరు కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4 » మచిలీపట్నం కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎండీ పీడియాట్రిక్స్ 4» నంద్యాల కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎంఎస్ ఓబీజీ 4, ఎండీ అనస్థీషియా 4» రాజమండ్రి కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎండీ పీడియాట్రిక్స్ 4, ఎంఎస్ ఓబీజీ 4» విజయనగరం కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎండీ ఓబీజీ 4 -
ఎవడ్రా సామి నువ్వు.. పాక్‌ను ఇంతలా వణికిస్తున్నావ్?
అది కాబూల్‌లోని ఓ మారుమూల కొండ ప్రాంతం. ఓ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనం నిదానంగా వెళ్తోంది. ఓ క్షిపణి రయ్‌మంటూ దూసుకొచ్చి ఆ వాహనాన్ని ఢీ కొట్టింది. ‘హమ్మయ్యా..’ అంటూ పాక్ సైన్యం సంబురాలు చేసుకుంది. కట్ చేస్తే.. ఆ మరుసటిరోజే ‘నేను అమరుడ్ని..’ అనే రేంజ్లో ఓ వ్యక్తి వాయిస్‌తో ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. అంతే పాక్ సైనికాధికారుల ముఖంలో సంతోషం పోయి.. మళ్లీ తలపట్టుకున్నారు. పాకిస్తాన్-అఫ్గనిస్తాన్ మధ్య గత 10 రోజులుగా పరస్పర దాడులతో యుద్ధ పరిస్థితులు నెలకొన్నది చూస్తున్నదే!. ఈ దరిమిలా 48 గంటల కాల్పుల విరమణతో పరిస్థితి కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. అయితే.. ఒకప్పుడు జగ్రి దోస్తులుగా ఉన్న ఈ రెండు దేశాలు దుష్మన్లుగా మారడానికి కారణం.. ఒకే ఒక్కడు. వాడి పేరు నూర్ వాలి మోహ్సూద్(Noor Wali Mehsud). పాక్‌కు కొరకరాని కొయ్యగా(వ్యక్తిగా) మారిన ఇతని గురించి ఇంటర్నెట్లో ఇప్పుడు తెగ వెతికేస్తున్నారు. నూర్ వాలి మెహ్సూద్(47).. ఒకప్పుడు తాలిబాన్ ఉద్యమంలో భాగమైన వ్యక్తి. అయితే ఆ తర్వాతి కాలంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) అనే ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తూ.. పాక్‌ను వణికిస్తున్నాడు. ఇతని నేతృత్వంలో టీటీపీ సంస్థ పాక్ గడ్డపై పలు దాడులు జరిపింది. మరీ ముఖ్యంగా సైనిక స్థావరాలు, పోలీసు ఔట్‌పోస్టులను లెక్కలేన్నంటిని నాశనం చేసింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఇతని నేతృత్వంలో జరిగిన దాడులతో పాక్‌కు తీరని నష్టమే వాటిల్లింది. అలా.. తమ దేశ భద్రతా వ్యవస్థకు నూర్ వాలి మెహ్సూద్ పెనుముప్పుగా మారడంతో పాక్ ప్రభుత్వం శాంతి చర్చలకు ఆహ్వానించింది. అయితే.. నూర్ మొండి పట్టు వల్లే ఆ చర్చలు విఫలం కావడం గమనార్హం. తాజాగా ఇతగాడి చర్యల వల్ల పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పాక్ సైన్యం.. అతను ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై క్షిపణి దాడులు చేసింది. అయితే అనూహ్యంగా నూర్ వాలి దాడి నుంచి తప్పించుకున్నాడు. అతని అనుచరులు గాయాలతోనే బయటపడినట్లు తెలుస్తోంది. తన క్షేమసమాచారాన్ని తెలియజేస్తూ ఆ మరుసటిరోజే ఆడియో క్లిప్ ఒకటి నూర్ బయటకు వదిలాడు. ఈ టీటీపీ ఏంటసలు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) పలు నిషేధిత సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన గ్రూప్. అయితే.. ఇది ఏర్పడడానికి ఒక బలమైన కారణం ఉంది. లాల్ మసీదు ఏరియా.. ఇస్లామాబాద్‌లో ఒకప్పుడు మతపరమైన కేంద్రంగా విరజిల్లేది. మౌలానాలు అబ్దుల్ అజీజ్, అబ్దుల్ రషీద్ ఘాజీ సారథ్యంలో షరియా చట్టం అమలు కోసం ఉద్యమించారు. అయితే.. ఉద్యమం మాటున ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అప్పటి సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వం ఆపరేషన్ సైలెన్స్ పేరిట చర్యకు ఉపక్రమించింది. జులై 3-11 తేదీ మధ్య ఈ దాడిలో 100 మంది మరణించగా.. 11 మంది సైనికులు, 200 మంది పౌరులు గాయపడ్డారు.మరణించిన వాళ్లంతా మిలిటెంట్లేనని ముషారఫ్ నాడు ప్రకటించారు. లాల్ మసీద్ ఘటన భావోద్వేగంగా, మతపరంగా ప్రజలను ప్రభావితం చేసింది. అయితే.. ఈ ఘటనను ఇస్లాం మీద దాడిగా భావించిన పలు గ్రూపులు.. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రతీకారంగా కలసి TTPను డిసెంబర్ 2007లో ప్రకటించాయి. దీని లక్ష్యం.. అప్పటి ముష్రాఫ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం, పాకిస్తాన్లో షరియా చట్టం అమలయ్యేలా చూడడం. కాలక్రమంలో.. ఇది పాక్ సరిహద్దు ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకుని పాక్ భూభాగంపై తరచూ దాడులు చేస్తూ వస్తోంది.నూర్ సారథ్యం.. మరో మలుపు!2018లో అఫ్గన్ సరిహద్దులో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో టీటీపీ కీలక నేతలు ముగ్గురూ మరణించారు. దీంతో నూర్ వాలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. నూర్ వాలి మెహ్సూద్ సారథ్యంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) కొత్త పంథా ఎంచుకుంది. టీటీపీ అంటే అప్పటిదాకా పాక్ అమాయక పౌరులను బలిగొన్న కరుడుగట్టిన ఉగ్రసంస్థగా ముద్రపడిపోయింది. 2014లో ఓ పాఠశాలలో జరిపిన దాడిలో 130 మంది చిన్నారులు మరణించడం.. ఇందుకు ఓ ఉదాహరణ కూడా. అయితే మత పండితుడైన నూర్.. తన సారధ్యంలో అలాంటివి జరగకూడదని బలంగా తీర్మానించాడు. పాక్ సైన్యం అనేది ఇస్లాంకు వ్యతిరేకంగా.. 78 ఏళ్లుగా పాక్ ప్రజలను బందీఖానాలో ఉంచిందని, రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టిపోయిందని ఘాటు విమర్శలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పౌరుల జోలికి పోకూడదని.. కేవలం పాక్ ఆర్మీ, అవసరమైతేనే పోలీసులను లక్ష్యంగా చేసుకోవాలని టీటీపీ కేడర్‌కు సూచించాడు. అలా టీటీపీపై పడ్డ మచ్చను చెరిపేసే ప్రయత్నం చేశాడు నూర్. 2021లో అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో.. TTPకు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం కలిగింది. ప్రత్యేకించి.. పాక్ ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు పెరిగాయి. పాక్ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే.. నూర్ వాలి ఆఫ్ఘనిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నాడని, తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వ సహకారంతోనే మరింత రెచ్చిపోతున్నాడని. అంతేకాదు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఇస్లాం మతాన్ని వక్రీకరిస్తోందని, అలాంటి సంస్థకు భారతదేశమూ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ వచ్చింది. అయితే, ఈ ఆరోపణలను న్యూఢిల్లీ ఖండించింది, తాము ఎలాంటి మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసింది. -
రేపు తెలంగాణ బంద్.. డీజీపీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రేపటి (అక్టోబర్18,శనివారం) బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలని డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా చూసుకోవాలని.. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీజీపీ అన్నారు. బంద్ పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం ఈ నెల 18న బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. శనివారం చేపట్టబోయే బంద్‌కు రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ ప్రజలను కోరింది.బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రేపు జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ బీసీ సంఘాలు ఆల్ పార్టీల ఆధ్వర్యంలో బషీరాబాగ్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు. ఈ ర్యాలీలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీసీ జేఏసీ నాయకులు రాజారాం యాదవ్ పాల్గొన్నారుబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు తలపెట్టిన రేపటి తెలంగాణ బంద్ కార్యక్రమానికి అదిలాబాద్ భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పత్రిఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.ఖమ్మం: రేపు జరగబోయే బంద్‌కు సంపూర్ణ మద్దతు కోరుతూ డిప్యూటీ సీఎంకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మసనం శివరామకృష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ ఖమ్మం టౌన్ మహిళా అధ్యక్షురాలు గాజుల శ్రీదేవి ఖమ్మం టౌన్ అధ్యక్షుడు గద్దె వెంకటరామయ్య ఉపాధ్యక్షుడు అమృతం మల్లికార్జున్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కూరపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆసీస్‌తో తొలి వన్డే.. రోహిత్, కోహ్లి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌కు సమయం అసన్నమైంది. పెర్త్ వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుండగా.. ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆడనుంది.అందరి దృష్టి భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) పైనే ఉన్నాయి. వీరిద్దరూ దాదాపు ఏడు నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నారు. దీంతో రో-కో ద్వయం ఎలా ఆడుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్.పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే సమయంలో వరుణుడు పలు మార్లు ఆటకు అంతరాయం కలిగించే అవకాశముంది. వర్షం పడేందుకు 35 శాతానికి పైగా అస్కారం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం కూడా అక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.అయితే వర్షం కారణంగా పూర్తిగా రద్దు అయ్యే సూచనలు అయితే కన్పించడం లేదు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెర్త్ స్టేడియంలోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామమే అనే చెప్పుకోవాలి. కాబట్టి భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్చదవండి: ప్లే ఆఫ్స్‌కు చేరిన తెలుగు టైటాన్స్ -
పనిమనిషి జీతం రూ. 45 వేలు : అంత అవసరమా, నెట్టింట చర్చ!
సిలికాన్ సిటీ, ఐటీ సిటీ బెంగళూరు (Bengaluru) ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. గార్డెన్ సిటీ బెంగళూరులో జీవితం అంటే చాలా ఖరీదైనదే. అలాంటిది బెంగళూరులో కుటుంబంతో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ తన ఇంటి సహాయకురాలికి నెలకు రూ.45,000 కంటే ఎక్కువ చెల్లించడం చర్చకు దారితీసింది.తాజాగా రష్యాకు చెందిన ఒక కంటెంట్ క్రియేటర్ యులియా అస్లమోవా బెంగళూరు లైఫ్ గురించి పంచుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. తన బిడ్డను చూసుకునేందుకు నియమించుకున్న పనిమనిషికి నెలకు రూ. 45,000 చెల్లిస్తానని వెల్లడించింది. అంతేకాదు ఇంటి పనిని కూడా "వృత్తిపరంగా" చూస్తానని, ఏదేని కార్పొరేట్ ఉద్యోగం లాగే ప్రోత్సాహకాలను అందిస్తానని అస్లమోవా చెప్పారు. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) ఇంకా ఇంటి అద్దెకు 1.25 లక్షల రూపాయలు, తన పిల్లల స్కూల్ ఫీజు కోసం రూ.30వేలు, ఆహారంతో సహా ఇంటి ఖర్చుల కోసం రూ.75,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా కూడా ఈ మహిళ వెల్లడించింది. పనిమిషికి 45 వేలు ఇవ్వడం అంటే తనను "పిచ్చిదానిని" అని అనుకోవచ్చు. కానీ ఆమె విధేయత, వృత్తి నైపుణ్యం కారణంగా ఆమె ఈ ప్రతిఫలానికి అర్హురాలని తాను భావించినట్లు తెలిపింది. తన కుమార్తె ఎలినా కోసం నానీని నియమించుకునే ముందు కనీసం 20 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశానని ఆమె చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. బెంగళూరు సహా భారతదేశంలోని నలుమూలల నుండి ప్రజలు స్పందించారు. కొందరు ఆమెను ప్రశంసించగా మరికొందరు విమర్శించారు. మీరు ఎక్కువ చెల్లిస్తున్నారనీ, ఇంతకంటే తక్కువకు ఫ్లాట్లు దొరుకుతాయని కమెంట్ చేశారు. మరొక వినియోగదారు “అది TCS, ఇన్ఫోసిస్ ,యాక్సెంచర్ టెక్ ఫ్రెషర్లకు చెల్లించే దానికంటే ఎక్కువ.” అని పేర్కొన్నారు.అయితే విమర్శలపై స్పందిస్తూ అస్లమోవా తన వైఖరికి కట్టుబడి ఉండటం విశేషం. "మీరు ఇతరులతో చెడుగా ప్రవర్తిస్తే, కర్మ మీకు ఫలితం ఇస్తుంది" అని కౌంటర్ ఇవ్వడం గమనార్హం. అలాగే వ్యక్తిగత లేదా వృత్తిపరమైన వృద్ధికి బదులుగా ఇంటి పనికి రోజుకు చాలా గంటలు కేటాయించేవారు విలువైన అవకాశాలను కోల్పోతున్నారని చెబుతూ, వారు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో ఒక్కసారి పునరాలోచించుకోవాలని కోరారు.