breaking news
-
లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే..
పచ్చనోటు మనిషి జీవితంలో ఎంతో ప్రభావం చూపుతుంది. డబ్బుపై ఆశ కడు పెదరికంలో ఉన్న వ్యక్తిని సైతం రాజును చేయగలదు. ఆ ఆశ కొద్దిగా మితిమీరితే అదే డబ్బు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుంది. ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న బీఆర్ శెట్టి జీవితంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఆ ఆశే తన రూ.87,936 కోట్ల(అంచనా) విలువైన వ్యాపారాన్ని కేవలం రూ.74కే అమ్ముకునేలా చేసింది. అసలు అంత విలువైన కంపెనీని ఎందుకు ఇంత తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందో తెలుసుకుందాం.బి.ఆర్.శెట్టిగా ప్రసిద్ధి చెందిన బావగుతు రఘురామ్ శెట్టి 1942 ఆగస్టు 1న కర్ణాటకలోని ఉడిపిలో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో జన్మించారు. ఇతని పూర్వీకుల మాతృభాష తుళు, కానీ తాను కర్ణాటకలో పుట్టుడంతో కన్నడ మీడియం పాఠశాలలో చదివారు. మణిపాల్‌లో ఫార్మాస్యూటికల్ విద్యను పూర్తి చేశారు. ఉడిపి మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. చంద్రకుమారి శెట్టిని వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.స్టాక్ ఎక్స్ఛేంజీలో..శెట్టి 31 ఏళ్ల వయసులో ఇతర ఖర్చులుపోను జేబులో కేవలం రూ.665తో యూఏఈలోని దుబాయ్‌కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. అక్కడే 1975లో యూఏఈ మొదటి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ (ఎన్ఎంసీ)ను స్థాపించారు. తన భార్య అందులో ఏకైక వైద్యురాలిగా సేవలందించేంది. ఒకే క్లినిక్‌తో ప్రారంభమైన ఎన్ఎంసీ తక్కువ కాలంలోనే పెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదిగింది. బహుళ దేశాల్లో ఏటా మిలియన్ల మంది రోగులకు సేవలు అందించేది. ఇది యూఏఈలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నుంచి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన మొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎన్ఎంసీ అప్పట్లో చరిత్ర సృష్టించింది.వ్యాపారాల జాబితా..శెట్టి కేవలం ఆ సంస్థను స్థాపించడంతోనే ఆగిపోకుండా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు. దాంతో ఇతర వెంచర్లు ఆరోగ్య సంరక్షణకు అతీతంగా విస్తరించాయి. అతను నియోఫార్మా అనే ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని, ఫినాబ్లర్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను స్థాపించారు. తన వ్యాపార పోర్ట్‌ఫోలియోలో రిటైల్, అడ్వర్టైజింగ్, హాస్పిటాలిటీలో పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్‌లో ఐకానిక్ కట్టడంగా ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. సొంతంగా ప్రైవేట్ విమానం కూడా ఉండేది. 2019 నాటికి శెట్టి భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 42వ స్థానంలో నిలిచారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.18,000 కోట్లుగా ఉండేది.అనధికార నగదు లావాదేవీలు2019లో ఎన్‌ఎంసీపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తడంతో కీలక మలుపు చోటుచేసుకుంది. యూకేకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ హెల్త్ అనధికారికంగా తన నగదు ప్రవాహాన్ని పెంచిందని, రుణాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. ఈ వాదనలు ఎన్ఎంసీ స్టాక్ ధరలు తీవ్రంగా క్షీణించేందుకు కారణమయ్యాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ వ్యవహారం దెబ్బతీసింది. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో గణనీయమైన అవకతవకలు జరిగినట్లు తేలింది. శెట్టి నిబంధనల దుర్వినియోగం, మోసం ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో 2020 ప్రారంభంలో ఎన్ఎంసీను ఎక్స్చేంజీ బోర్డు నుంచి తొలగించారు. నేరారోపణలు రాకముందు ఎన్ఎంసీ కంపెనీ విలువ సుమారు రూ.87,936 కోట్లుగా ఉండేది. ఈ సంస్థను బలవంతంగా అక్కడి నిబంధనల మేరకు అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చి చివరకు కేవలం రూ.74కే విక్రయించారు.ఇతర కంపెనీలపై ప్రభావంఈ పతనం శెట్టికి చెందిన ఇతర వెంచర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫినాబ్లర్ కంపెనీలో కూడా ఇలాంటి ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలువడ్డాయి. ఇది అతని ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ శెట్టి ఖాతాలను స్తంభింపజేసింది. అతనిపై అనేక అధికార పరిధుల్లో చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.పడిపోయిన ఆస్తుల విలువబ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చిన అప్పులు పెరుగుతుండడం, న్యాయపరమైన సవాళ్లతో శెట్టి ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. అతని ఆస్తుల నికర విలువ పడిపోయింది. అతను దివాలా తీసినట్లు తన దగ్గరి వర్గాలు ప్రకటించాయి. అతని విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక దుర్వినియోగం అతని పతనానికి దోహదం చేశాయని నివేదికలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: అవసరాలకు అనువైన బహుమతులు.. తీరు మార్చుకున్న కంపెనీలు -
కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీ!?
సాక్షి, హైదరాబాద్: 42 శాతం రిజర్వేషన్ల సాధన డిమాండ్‌తో బీసీ సంఘాలు ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనల్లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శనివారం ఉదయం ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో.. ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లితో పాటే నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేస్తూ కనిపించాడు.‘‘కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు.. ప్రతి ఇంటి నుండి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలి. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు ఎంతో అవసరం’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కవితను ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో నొచ్చుకున్న ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. విదేశాల్లో చదువుకున్న ఆదిత్య ఇటీవలే ఇండియాకు రాగా.. అనూహ్యంగా ఇవాళ్టి బంద్, ధర్నాల్లో పాల్గొనడం గమనార్హం. దీంతో 20 ఏళ్లకే కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రెడీనా? అనే చర్చ నెట్టింట జోరుగా నడుస్తోంది. -
రోహిత్, అర్షదీప్ పోరాటం వృధా.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
మలేసియాలో జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్‌లో (Sultan of Johor Cup 2025) భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు (Indian Junior Men's Hockey Team) తొలి పరాజయం ఎదురైంది. నిన్న (అక్టోబర్ 15) ఆస్ట్రేలియాతో జరిగిన పూల్ మ్యాచ్‌లో (India vs Australia) భారత్ 2-4 తేడాతో ఓటమి పాలైంది.భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ (22వ నిమిషం), అర్ష్‌దీప్ సింగ్ (60వ నిమిషం) గోల్స్ సాధించగా.. ఆస్ట్రేలియా తరఫున ఆస్కార్ స్ప్రౌల్ (39, 42), ఆండ్రూ ప్యాట్రిక్ (40) మరియు కెప్టెన్ డిలన్ డౌనీ (51) గోల్స్ చేశారు.ఈ మ్యాచ్ తొలి క్వార్టర్లో భారత్ అద్భుతంగా ఆడింది. ఆదిలోనే గోల్ కీపర్ ప్రిన్స్ దీప్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి గోల్‌ను సేవ్ చేశాడు. 17వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను అన్మోల్ ఎక్కా గోల్‌గా మలచలేకపోయాడు. 22వ నిమిషంలో కెప్టెన్ రోహిత్ మ్యాచ్ తొలి గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించాడు.25వ నిమిషంలో అమీర్ అలీ సోలో రన్‌తో గోల్‌కి ప్రయత్నించగా.. ఆస్ట్రేలియా గోల్‌కీపర్ అద్భతంగా అడ్డుకున్నాడు.ఆతర్వాత కొద్ది నిమిషాలకే మ్యాచ్ భారత్‌వైపు నుంచి ఆస్ట్రేలియావైపు మళ్లింది. 39 నుంచి 42 నిమిషాల్లోపు ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఆఖరి నిమిషంలో (60) అర్షదీప్ సింగ్ అద్భుతమైన డిఫ్లెక్షన్‌తో గోల్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య మలేసియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితంపై భారత సెమీస్ బెర్త్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం భారత్ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా, ఓ ఓటమితో 7 పాయింట్లు కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఓ డ్రాతో 10 పాయింట్లు కలిగి ఉండి టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. చదవండి: సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్ -
ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం పట్టుకుందా?
సుమన్, గౌరవ్ కెప్టెన్స్ అయ్యారని ముందే లీక్ అవడంతో ఎపిసోడ్లో పస లేకుండా పోయింది. హౌస్‌మేట్స్‌ను వచ్చినప్పటినుంచి చెడుగుడు ఆడేసుకుంటున్న ఆయేషా ఒక్క గేమ్‌లో ఓడిపోయినందుకు గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..అంతా నావల్లే..కెప్టెన్సీ కంటెండర్లను జంటలుగా విడిపోమన్నాడు బిగ్‌బాస్ (Bigg Boss 9 Telugu). సుమన్‌తో జత కట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు గౌరవ్ అతడితో జోడీ కట్టాడు. మాధురి- రమ్య, ఆయేషా- సాయి, గౌరవ్- సుమన్ జంటలు కెప్టెన్సీ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో సుమన్-గౌరవ్ చాలా ప్రశాంతంగా ఆడి గెలిచారు. ఓటమిని ఆయేషా జీర్ణించుకోలేకపోయింది. నాకు చీకట్లో కళ్లు సరిగా కనిపించలేదు, నా వల్లే గేమ్ పోయిందంటూ తన చెంపపై తనే కొట్టుకుంటూ ఏడ్చింది. ఆమెనలా చూసి మాధురి సైతం కన్నీళ్లు పెట్టుకుంది.పవన్ వాడేసిన నిఖిల్గెలిచిన జంట సుమన్ (Suman Shetty)- గౌరవ్‌ను కెప్టెన్స్‌గా ప్రకటించాడు బిగ్‌బాస్. అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్.. తన కెప్టెన్సీ కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్స్‌లో ఒకర్ని చాలెంజ్ చేయొచ్చన్నాడు. దీంతో అతడు గౌరవ్‌తో తలపడతానన్నాడు. అలా వీరిద్దరికీ సాండ్ టాస్క్ పెట్టగా ఇందులో గౌరవ్ గెలిచి తన కెప్టెన్సీ కాపాడుకున్నాడు. అలా గెలిచాడో, లేదో.. అప్పుడే సుమన్‌తో చర్చించి ఆయేషాకు ఓ వరమిచ్చాడు. భరణిలో భయం మొదలైందా?ఆయేషాకి పడుకోవడానికి బెడ్ లేదు కాబట్టి.. ఇంకో ఇద్దరమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్‌లో పడుకోవచ్చు.. మేము బయట మిగిలిన బెడ్స్‌పై పడుకుంటాం అన్నాడు. ఈ మాటకు అందరూ చప్పట్లు కొట్టారు. ఇక బంధాల సుడిగుండంలో చిక్కుకున్న భరణి (Bharani Shankar)కి తన ఫ్యూచర్ అర్థమైపోయింది. ఎలిమినేట్ అవుతానని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం ఇమ్మాన్యుయేల్ మాటల్లో స్పష్టమైంది. సంజనతో ఇమ్మూ మాట్లాడుతూ.. ఎప్పుడైనా నేను డేంజర్లో ఉన్నప్పుడు.. ఇంట్లో ఎవరూ నన్ను కాపాడలేనప్పుడు నువ్వు నాతో ఉంటావా? అని భరణి అన్న అడిగాడని చెప్పాడు. మహా ముదురుఆ మాటకు సంజనా అవాక్కైపోయి.. నీ దగ్గర పవరాస్త్ర ఉంది, కాబట్టి నిన్ను ముందే లాక్ చేస్తున్నాడన్నమాట! మహా ముదురు అని కామెంట్ చేసింది. ఇంకా ఇమ్మూ మాట్లాడుతూ.. హౌస్‌లో 15 మంది ఒకవైపు, నువ్వొకడివే ఒకవైపు ఉంటే.. నీవైపు న్యాయం ఉంటే.. అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పా.. అని ఇమ్మూ సంజనాతో చెప్పుకొచ్చాడు. అంటే భరణిలో ఎలిమినేషన్ భయం మొదలైందన్నమాట!చదవండి: ‘కె-ర్యాంప్’ మూవీ ట్విటర్ రివ్యూ -
హీరోయిన్ను అలా టచ్ చేసిన సౌబిన్.. వీడియో వైరల్
సందట్లో సడేమియా... శునకానందం పొందాలయా...అన్నట్టుగా మారుతోంది కొందరు ప్రబుద్ధుల ప్రవర్తన. అభిమానం పేరిట అసభ్యత ముదురుతోంది. ముఖ్యంగా హీరోయిన్లపై అది అనుచితంగా మారుతోంది. రకరకాల కారణాలతో జన సమూహాల్లోకి వస్తున్న కధానాయికలను అసభ్యకరంగా తాకకూడని చోట తాకుతున్న సంఘటనలు కంపరం కలిగిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలలో బాధితులుగా మారిన పలువురు తారల జాబితాలో ఇప్పుడు మళయాళ నటి నవ్యనాయర్ కూడా జరిగింది. వివరాల్లోకి వెళితే... పాతిరాత్రి అనే మళయాళ చిత్రంలో సౌబిన్ షాహిర్ (కూలీ ఫేమ్) నవ్యనాయర్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని వీరిద్దరూ పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే క్రమంలో కోజికోడ్‌లోని హైలైట్ మాల్లో సినిమా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ తర్వాత సినిమా తారాగణం వేదిక నుంచి బయటకు వెళుతుండగా, ఊహించని సంఘటన జరిగింది, అక్కడ జనంలో ఉన్న ఒక వ్యక్తి నటి నవ్య నాయర్‌ను అకస్మాత్తుగా వెనుక నుంచి తడిమాడు. ఇది జరిగిన వెంటనే సౌబిన్ షాహిర్(Soubin Shahir) కూడా నవ్యనాయర్ను కాపాడే క్రమంలో తాను కూడా టచ్ చేశాడు. ఈ సంఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించడం ప్రారంభించారు. తొలుత తనను తాకిన వ్యక్తి వైపు నవ్యనాయర్ ఉరిమిచూడడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లలో అనేక మంది నటికి మద్దతుగా కామెంట్స్ చేశారు. అయితే కొందరు మాత్రం ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు, అపరిచితులు తాకితే ఉరిమి చూసిన నటి సౌబిన్ తాకితే ఎందుకు ఊరుకుంది? అంటూ కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే దీనిపై చాలా మంది అభిమానులు సౌబిన్ను సమర్థించడానికి ముందుకు వచ్చారు, వీడియోను పరిశీలనగా చూడాలని అందులో, అగంతకుడు తాకిన తర్వాత ఆమెకు రక్షణగా మాత్రమే సౌబిన్ వ్యవహరించాడని అంటూ కొందరు పరిణితి ప్రదర్శించారు. అంతేకాక తనను రెండవ సారి తాకింది సౌబిన్ అని ఆమెకు తెలుసు. అంటూ గుర్తు చేశారు. ‘‘ఒకరి శరీరంపై చేతులు పెట్టడానికి అనుమతి అవసరం... ఈ సంఘటనలో సౌబిన్ ఆమెను రక్షించడానికి ప్రయత్నిoచినట్టు స్పష్టంగా తెలుస్తోంది.’’ అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.రతీనా దర్శకత్వం వహించి బెంజీ ప్రొడక్షన్స్ నిర్మించిన పాతిరాత్రి సినిమాలో నవ్య సౌబిన్లు పోలీస్ ఆఫీసర్లు జాన్సీ, హరీష్ పాత్రలను పోషించారు. అర్ధరాత్రి జరిగే ఒక రహస్య సంఘటనను వారు వెలికితీసే థ్రిల్లర్ ఈ జంటను అనుసరిస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల అవుతోంది. View this post on Instagram A post shared by IndianCinemaGallery (@indiancinemagallery_official) -
తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!
ధనత్రయోదశి, దీపావళి ఒకదాని తరువాత ఒకటి వస్తున్నాయి. చాలామంది ఈ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడతారు. గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతి రోజూ కొత్త గరిష్టాలను చేరుకుంటున్న.. బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలేమిటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.శుక్రవారం బంగారం రేటు ఔన్సుకు 4,300 డాలర్ల కంటే ఎక్కువకు చేరి.. కొత్త గరిష్టాన్ని తాకింది. ఐదేళ్లల్లో ఈ ధరలు ఆల్‌టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది. వెండి ధర ఔన్సుకు 54 డాలర్లు దాటి.. 1980 తరువాత జీవితకాల గరిష్టాలను చేరుకుంది. భారతదేశంలో.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.31 లక్షలు దాటేసింది. వెండి రేటు ఏకంగా రూ. 2 లక్షలు దాటేసింది.ధరలు పెరగడానికి కారణాలుప్రపంచ ఉద్రిక్తతల మధ్య సురక్షిత ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ చుట్టూ ఉన్న భయాలు, అమెరికా & చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య వివాదాలు.. ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడి సంకేతాలు పెట్టుబడిదారులను బంగారం, వెండి వైపు నెట్టాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.'బంగారం 4,300 డాలర్లు దాటడం మనం చూడటం ఇదే మొదటిసారి' అని ఒక వస్తువు వ్యాపారి పేర్కొన్నారు. ఆగస్టు నుంచి ఈ ర్యాలీ కొనసాగుతోందని అన్నారు. ఈ వారం వెండి పెరుగుదల కూడా భారీగానే ఉంది. ఔన్సు 54 డాలర్లు దాటేసింది. నాలుగు దశాబ్దాల తరువాత ధరలు కొత్త రికార్డులను చేరుకున్నాయని అన్నారు.ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యష్ సెడాని, పెరుగుతున్న ధరల గురించి స్పందిస్తూ.. బంగారంతో పోలిస్తే వెండి ధరలు మరింత వేగంగా పెరుగుతున్నాయని అన్నారు. దీనికి కారణం పారిశ్రామిక డిమాండ్ అని తెలుస్తోంది. బంగారంతో పోలిస్తే.. పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల డిమాండ్ మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, కొనసాగుతున్న సైనిక సంఘర్షణలు అనిశ్చితిని గణనీయంగా పెంచాయి. దీనివల్ల బ్యాంకులు & పెట్టుబడిదారులు బంగారం.. వెండిని సురక్షితమైన ఆస్తులుగా మార్చడానికి ప్రేరేపించబడ్డాయి. వడ్డీ రేటులో కదలికలు.. కేంద్ర బ్యాంకు చర్యలు కూడా ధరలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషించాయి.ఇదీ చదవండి: బంగారం కొనగలమా!.. రాకెట్లా దూసుకెళ్లిన రేటుధన్తేరాస్ & దీపావళి పండుగల సమయంలో బంగారం కొనుగోలును సంప్రదాయంగా భావించి.. ఎక్కువమంది గోల్డ్ కొంటారు. ఇది డిమాండును అమాంతం పెంచేస్తోంది. అయితే పండుగల తరువాత.. ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చూచిస్తున్నారు. అయితే దీపావళి నాటికి మరింత రేటు పెరిగే అవకాశం ఉందని కేడియా అడ్వైజరీ ఎండీ & డైరెక్టర్ అజయ్ కేడియా అన్నారు. -
షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) వ్యాఖ్యలపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్పందించాడు. షమీ నిజంగానే ఫిట్‌గా ఉండి ఉంటే కచ్చితంగా జట్టులో ఉండేవాడని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో చివరగా టీమిండియాకు ఆడాడు షమీ.టాప్ వికెట్ టేకర్ఈ వన్డే మెగా టోర్నీలో తొమ్మిది వికెట్లు తీసిన షమీ.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఈ రైటార్మ్ పేసర్‌కు సెలక్టర్లు చోటివ్వలేదు.అప్డేట్ లేదన్న అగార్కర్ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ మాట్లాడుతూ.. షమీ ఫిట్నెస్ గురించి తమకు అప్డేట్ లేదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షమీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు తెలిపాడు. రంజీలు ఆడగలిగే తాను వన్డేల్లో ఆడలేనా అంటూ సెలక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించాడు.షమీ కౌంటర్ఫిట్నెస్ గురించి ఎవరైనా తనను అడిగితే సమాధానం ఇస్తానే తప్ప.. తనంతట తానే ఫిట్‌గా ఉన్నానని చెప్పలేను కదా అంటూ అగార్కర్‌కు కౌంటర్ ఇచ్చాడు. తద్వారా సెలక్షన్ సమయంలో తనను ఎవరూ సంప్రదించలేదనే సంకేతాలు ఇచ్చాడు. ఈ విషయం గురించి అగార్కర్ తాజాగా స్పందించాడు.అగార్కర్ స్పందన ఇదేఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌కు హాజరైన అగార్కర్.. షమీ పట్ల తమ నిర్ణయం సరైందేనని పేర్కొన్నాడు. ‘‘ఒకవేళ అతడు నేరుగా మాట్లాడి ఉంటే.. అందుకు నేను సమాధానం ఇచ్చేవాడిని. కానీ అతడు సోషల్ మీడియాలో ఏ ఉద్దేశంతో మాట్లాడాడో తెలియదు.ఒకవేళ నేను ఈ విషయం గురించి చదివి ఉంటే.. అతడికి ఫోన్ ద్వారానైనా జవాబు ఇచ్చేవాడిని. ప్రతి ఒక్క ప్లేయర్ కోసం నా ఫోన్ ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. గత కొన్నినెలలుగా అతడితో నేను తరచూ చాట్ చేస్తూనే ఉన్నాను.ఏం జరుగుతుందో చూద్దాంకానీ మీకు ఇక్కడ హెడ్లైన్ ఇచ్చేలా ఏమీ మాట్లాడదలచుకోలేదు. టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన ఘనత షమీకి ఉంది. ఏదేనా ఉంటే పరస్పరం మాట్లాడుకుంటాం.ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా.. తను ఫిట్‌గా ఉంటే కచ్చితంగా టూర్‌కు పంపిస్తామని చెప్పాము. దురదృష్టవశాత్తూ అప్పుడు అతడు ఫిట్‌గా లేడు. ఇక దేశీ క్రికెట్ సీజన్ ఇప్పుడే ఆరంభమైంది కదా.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని పేర్కొన్నాడు.అయితే, ఇంగ్లండ్‌తో టెస్టులకు సిద్ధంగా లేకపోయినా.. వన్డే ఫార్మాట్‌కు తాను ఫిట్‌గా ఉన్నానని షమీ చెప్పగా.. అగార్కర్ మాత్రం ఇలా స్పందించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ‘భర్త కంటే ‘బాబా’నే ఎక్కువ!.. తండ్రి కోసం కుర్తా కొనలేని వాడు.. అతడికి రూ. 15 లక్షల గిఫ్ట్!’ -
చురుగ్గా ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, అమరావతి: ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. నాలుగైదు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తిరుపతి జిల్లా తడ మండలం భీములవారిపాలెంలో 4.5 సెంటీమీటర్లు, చిత్తూరు జిల్లా పెద్దపంజాణిలో 3.5, సోమల మండలం పెద్దఉప్పరపల్లిలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా కదిలి.. 26వ తేదీన వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. -
తెలుసు కదా మూవీ రివ్యూ
టైటిల్: తెలుసు కదానటీనటులు:సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీనిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్రచన, దర్శకత్వం: నీరజ కోనసంగీతం: ఎస్. థమన్సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ విఎస్ఎడిటర్: నవీన్ నూలివిడుదల తేది: అక్టోబర్ 17, 2025డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్న స్టార్ బాయ్ సిద్ధుకి ‘జాక్’ భారీ షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘తెలుసు కదా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజ కోన తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ (Telusu Kada Movie Review)లో చూద్దాం.కథేంటంటే..స్టార్ హోటల్ లో చీఫ్ చెఫ్‌గా పనిచేసే వరుణ్ కుమార్(సిద్దు) అనాథ. కాలేజీ డేస్‌లో లవ్ బ్రేకప్ అవ్వడంతో అమ్మాయిలను ఎంత వరకు ప్రేమించాలనే విషయంలో క్లారిటీతో ఉంటాడు. భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు. మ్యాట్రిమొనీ ద్వారా అంజలి(రాశి ఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి తర్వాత అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. కొన్నాళ్ల తర్వాత డాక్టర్ రాగా(శ్రీనిధి శెట్టి) ద్వారా సరోగసీతో తల్లి కావొచ్చనే విషయం అంజలికి తెలుస్తుంది. బిడ్డను మోసేందుకు డాక్టర్ రాగా ముందుకు వస్తుంది. కట్ చేస్తే.. కాలేజీ డేస్‌లో వరుణ్ ప్రేమించిన అమ్మాయినే డాక్టర్ రాగా. ఈ విషయం తెలిసి కూడా రాగా తన బిడ్డను మోసేందుకు ఒప్పుకుంటాడు వరుణ్. ఈ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాగా-వరుణ్ బ్రేకప్‌కి కారణం ఏంటి? తనను వదిలేసి వెళ్లిపోయిన రాగా పట్ల ఎంతో కోపం పెంచుకున్న వరుణ్.. ఆమె తన బిడ్డను మోసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు? రాగా-వరుణ్‌ల విషయం అంజలికి తెలిసిందా లేదా? మాజీ ప్రేయసి ఒకవైపు.. కట్టుకున్న భార్య మరోవైపు.. ఇద్దరి మధ్య వరుణ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? వరుణ్ కోరుకున్నట్లుగా చివరకు తండ్రి అయ్యాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. పెళ్లి అయిన తర్వాత తల్లికాలేని భార్య.. ప్రియుడి బాధను అర్థం చేసుకొని బిడ్డను మోసేందుకు ముందుకు వచ్చిన ప్రియురాలు.. వీరిద్దరిని హీరో ఎలా డీల్ చేశాడనేదే సినిమా కథ. ప్రేమ, ఈగో, ఎమోషన్స్ చుట్టూ కథనం తిరుగుతుంది. దర్శకురాలు నీరజ కోన ఎంచుకున్న పాయింట్ కాస్త కొత్తగా ఉన్నా.. కొన్ని చోట్ల హీందీ చిత్రం చోరి చోరి చుప్కే చుప్కే పోలికలు కనిపిస్తాయి. మెచ్యూర్డ్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు కానీ.. ప్రియురాలే బిడ్డను కనేందుకు ముందుకు రావడం అనే లైన్‌ని సినిమా చూసే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. కొన్ని సున్నితమైన విషయాలను కూడా కాస్త బోల్డ్‌గానే చూపించారు. ఈ విషయంలో దర్శకురాలిని అభినందించాల్సిందే. కానీ కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో మాత్రం కొంతవరకే సఫలం అయ్యారు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. హీరో బ్రేకప్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పెళ్లి గురించి ప్లాన్ చేయడం.. ఈ క్రమంలో అంజలిని కలవడం.. ఇద్దరి ఇష్టాలు ఒకేలా ఉండడంతో పెళ్లి చేసుకోవడం.. పిల్లలు పుట్టరనే విషయం తెలిసే వరకు కథనం సింపుల్‌గానే సాగుతుంది. రాగా ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. బిడ్డను మోసేందుకు తనే ముందుకు రావడంతో తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ మొత్తం వరుణ్, రాగా, అంజలిల చుట్టే తిరుగుతుంది. వరుణ్, రాగాల గురించి అంజలికి తెలిసిన తర్వాత ఏం జరిగిందనేదే సెకండాఫ్ స్టోరీ. ఫస్టాప్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ముగ్గురి మధ్య వచ్చే సీన్లు రొటీన్‌గానే ఉంటాయి. కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి. అయితే సినిమాలోని డైలాగ్స్ అన్ని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం బాగుంటుంది. ఎవరెలా చేశారంటే..ఈగో, ఎమోషన్స్‌తో కూడిన వరుణ్ పాత్రలో సిద్దు ఒదిగిపోయాడు. శ్రీనిధి, రాశీ ఖన్నాలతో సిద్దు కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. ప్రేమ, పెళ్లి వద్దు.. ఉన్నంత సేపు సంతోషంగా గడిపి తర్వాత ఎవరిదారి వారు చూసుకుందామనే అమ్మాయి రాగా పాత్రకి శ్రీనిధి న్యాయం చేసింది. హీరో భార్య అంజలిగా రాశీ ఖన్నా చక్కగా నటించింది. వైవా హర్ష తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, డిఫరెంట్ ఫ్రెండ్ పాత్రలో మెప్పించాడు. చిన్న చిన్న డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అయితే ఆ బీజీఎం మొత్తం ఇటీవల వచ్చిన ఓజీ సినిమాను గుర్తు చేస్తుంది. జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ కి రిచ్ నెస్ తీసుకొచ్చింది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
రీఎంట్రీలో అదరగొట్టిన సంజూ శాంసన్.. ‘మెరుపు’ అర్ధ శతకం
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో శుభారంభం అందుకున్నాడు. మహారాష్ట్రతో మ్యాచ్‌లో ఈ కేరళ బ్యాటర్ ‘మెరుపు’ అర్ధ శతకం సాధించాడు. దేశీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ తాజా సీజన్ బుధవారం మొదలైన విషయం తెలిసిందే.రుతురాజ్ గైక్వాడ్ పోరాటంఈ క్రమంలో ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళ- మహారాష్ట్ర (Kerala Vs Maharashtra) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. మహారాష్ట్ర బ్యాటింగ్‌కు దిగింది. టాపార్డర్ విఫలమైన చోట రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad- 151 బంతుల్లో 91; 11 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడటంతో... మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 84.1 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్ల ధాటికి ఒక దశలో 18/5తో నిలిచిన మహారాష్ట్ర ఆ తర్వాత లోయర్ ఆర్డర్ పోరాటంతో తేరుకుంది. జలజ్ సక్సేనా (49; 4 ఫోర్లు), వికీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) ఆకట్టుకున్నారు.కేరళ బౌలర్లలో నిదీశ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టు గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10.4 ఓవర్లలో 3 వికెట్లకు 35 పరుగులు చేసింది.ఘీ క్రమంలో 35/3 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలు పెట్టిన కేరళ ఇన్నింగ్స్‌ను సంజూ చక్కదిద్దాడు.సంజూ శాంసన్ ‘మెరుపు’ అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ 63 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 54 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అజారుద్దీన్ 36 పరుగులతో ఆకట్టుకోగా.. సల్మాన్ నిజార్ 49 పరుగులతో రాణించాడు.అయితే, మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం అందకపోవడంతో 63.2 ఓవర్లలో కేరళ 219 పరుగులకు ఆలౌట్ అయింది. సంజూ పోరాడినప్పటికీ కేరళను ఆధిక్యంలోకి తీసుకురాలేకపోయాడు. ఇరవై పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు శుభారంభమే దక్కింది. ఆధిక్యంలో మహారాష్ట్రతొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఓపెనర్లు పృథ్వీ షా 37, అర్షిన్ కులకర్ణి 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసేసరికి తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా మహారాష్ట్ర 51 పరుగులు చేసింది. తద్వారా కేరళ కంటే 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు సంజూకాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా సెలక్టర్లు సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదన్న విషయం తెలిసిందే. దీంతో అతడు సొంత జట్టు కేరళ తరఫున రీఎంట్రీ ఇస్తూ రంజీ బరిలో దిగాడు. అయితే, ఆసీస్‌తో టీ20 సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో త్వరలోనే సంజూ జట్టును వీడనున్నాడు. ఇక అక్టోబరు 19- 29 వరకు ఆసీస్- భారత్ మధ్య వన్డే సిరీస్.. అక్టోబరు 29- నవంబరు 8 మధ్య టీ20 సిరీస్ జరుగునుంది. చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్