-
AP: ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురు మృతి
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కడపలోని ఘాట్ రోడ్డులో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. దీంతో, విషాదఛాయలు అలుముకున్నాయి.వివరాల ప్రకారం.. కడపలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి, ఒక పురుషుడు మృతిచెందారు. మృతులు బద్వేలు మండలం చింతపుత్తయ పల్లెకు చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వారుగా నిర్ధారణ అయ్యింది. జాతర నేపథ్యంలో వీరంతా రాయచోటి నుంచి కడపకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.ఇక, గువ్వల చెరువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బద్వేలు, బీకోడూరు మండలాల్లో చెందిన వారికి ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. -
ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..
దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్. జారీ చేసినప్పటి నుంచి వీటిని ఇంత వరకూ అప్డేట్ చేసుకోనివారు వెంటనే చేసుకోవాలి. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్‌ను అప్డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ)అవకాశం కల్పించింది. ఇందుకోసం గతేడాది గడువును విధించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ప్రస్తుతానికి జూన్ 14 వరకు గడువు విధించారు. ఆ తర్వాత రూ .50 రుసుమును చెల్లించి ఆధార్ కేంద్రాల వద్ద అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం.. కార్డుదారులు తమకు కార్డు జారీ చేసినప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి గుర్తింపు రుజువు (పీఓఐ), చిరునామా రుజువు (పీఓఏ) అప్డేట్ చేసుకోవాలి. రెగ్యులర్ అప్డేట్లు ఆధార్ లోని సమాచారం, ప్రస్తుత డాక్యుమెంటేషన్‌కు అనుగుణంగా ఉండేలా చూస్తాయి.ఆధార్‌ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలను పొందేటప్పుడు, బ్యాంకు ఖాతాలను తెరిచేటప్పుడు లేదా ఇతర అవసరమైన కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసేటప్పుడు సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాకుండా ఆధార్ సమాచారాన్ని క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవడం వల్ల డెమోగ్రాఫిక్ డేటాబేస్‌లో ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి అధికారులకు వీలవుతుంది. తద్వారా దుర్వినియోగాలు, మోసాలు నివారించడంతోపాటు ప్రజా సేవల్లో జాప్యాలు, తిరస్కరణలను తగ్గించడానికి ఆస్కారం కలుగుతుంది.ఆన్లైన్లో ఏమేమి అప్డేట్ చేయవచ్చు?ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని యూఐడీఏఐ అందిస్తున్నప్పటికీ, ఆధార్‌లోని కొన్ని రకాల వివరాలను అప్డేట్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. యూఐడీఏఐ ప్రస్తుతం మై ఆధార్ పోర్టల్ ద్వారా నిర్దిష్ట డెమోగ్రాఫిక్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అనుమతిస్తోంది. అవి ఏమిటంటే..🔹పేరు (చిన్న మార్పులు చేసుకోవచ్చు)🔹పుట్టిన తేదీ (కొన్ని పరిమితులున్నాయి)🔹చిరునామా🔹జెండర్🔹భాష ప్రాధాన్యతలుబయోమెట్రిక్ సమాచారం మారదుఆన్లైన్లో ఆధార్ బయోమెట్రిక్ సమాచారం అప్డేట్ చేసేందుకు వీలులేదు. ఫోటో, వేలిముద్రలు, ఐరిస్ (కనుపాప) స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే, భౌతికంగా ఆధార్ నమోదు కేంద్రంలో మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే బయోమెట్రిక్ వివరాలను ధ్రువీకరించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అవసరమైన పరికరాలు కేంద్రాల వద్ద మాత్రమే ఉన్నాయి.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఇలా..👉అధికారిక పోర్టల్ https://myaadhaar.uidai.gov.in ను సందర్శించండి.👉"లాగిన్" బటన్ పై క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.👉రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. మీ ప్రొఫైల్ యాక్సెస్ చేయడానికి దానిని నమోదు చేయండి.👉లాగిన్ అయిన తర్వాత పేజీ పై కుడివైపున ఉన్న 'డాక్యుమెంట్ అప్డేట్'పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ప్రస్తుత గుర్తింపు రుజువు, చిరునామా రుజువును ధ్రువీకరించి అప్డేట్ చేస్తారు.👉డ్రాప్‌డౌన్ మెనూ నుంచి తగిన డాక్యుమెంట్ రకాలను ఎంచుకుని స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. ఫైళ్లు JPEG, PNG లేదా PDF ఫార్మాట్ లో, 2MB కంటే తక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోండి.👉వివరాలన్నీ సరిచూసుకుని డాక్యుమెంట్ లను సబ్మిట్ చేయండి. తర్వాత మీకొక సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు (SRN) వస్తుంది. దీనితో అప్డేట్ స్థితిని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. -
అర్ధరాత్రి నడిరోడ్డుపై డర్టీ పిక్చర్
అర్ధరాత్రి.. అదీ బిజీ రహదారిపై సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరించాడో ఒక్కడో రాజకీయ నేత. ఓ మహిళతో అభ్యంతకర రీతిలో కనిపించి చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం అతగాడి డర్టీ పిక్చర్(Dirty Picture) వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భోపాల్: మధ్యప్రదేశ్ మంద్సౌర్ జిల్లా బని గ్రామానికి బీజేపీ నేత మనోహర్‌లాల్ ధాకడ్(Manoharlal Dhakad) తీరుపై ఇటు రాజకీయ వర్గాలు, అటు సామాన్య ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆదమరిచి ఓ మహిళతో శృంగారం చేశాడు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో అందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డు కాగా, ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. అందులోని దృశ్యాల ప్రకారం.. తొలుత ఓ వైట్ కలర్ కార్ ఎక్స్‌ప్రెస్‌వే పక్కన వచ్చి ఆగింది. అందులోంచి నగ్నంగా ఉన్న ఓ మహిళ కిందకు దిగింది. ఆపై కిందకు దిగిన మనోహర్‌లాల్ ఆమెతో అభ్యంతరకర భంగిమలో రెచ్చిపోయాడు. మే 13వ తేదీ అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో మనోహర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మనోహర్ బీజేపీ లోకల్ లీడర్ కాగా, ఆయన భార్య మంద్సౌర్ జిల్లా పంచాయితీ సభ్యురాలు.ఈ గలీజు వీడియోపై ఆయన స్పందన కోరేందుకు మీడియా ప్రయత్నించగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై జిల్లా బీజేపీ చీఫ్ రాజేష్ దీక్షిత్ స్పందించారు. మనోహర్‌లాల్‌కు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదని, ఆయన కేవలం ఆన్లైన్ సభ్యుడు మాత్రమేనని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై రాష్ట్ర స్థాయి బీజేపీ నేత ఒకరు స్పందించారు. ఇలాంటి వాళ్లకు పార్టీలో ఎట్టిపరిస్థితుల్లో చోటు ఉండబోదని స్పష్టం చేశారు. -
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది అంటూ కవితకు కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కవిత లేఖపై స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్.. మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. మా పార్టీలో ప్రజాస్వామిక స్పూర్తి ఉంది. పార్టీలో ఎవరైనా సూచనలు చేయవచ్చు.. ఎవరైనా లేఖలు రాయవచ్చు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. పార్టీలో అందరం కార్యకర్తలమే.. అందరూ సమానమే. ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే దేవుడు, దెయ్యం ఎందుకు? అని ప్రశ్నించారు. -
ఇస్రో రాకెట్ 7 నిమిషాల్లోనే విఫలం.. పరిశీలనకు కమిటీ
న్యూఢిల్లీ: ఇస్రో అత్యంత కీలకంగా భావించిన భూమి పరిశీలన ఉపగ్రహాన్ని ఆదివారం విజయవంతంగా ప్రయోగించలేకపోయింది. దానిని మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సీ61(PSLV-C61) గాలిలోకి ఎగిరిన ఏడు నిమిషాలకే విఫలమయ్యింది. దీనికి కారణాన్ని కనుగొనేందుకు ఇస్రో జాతీయ వైఫల్య విశ్లేషణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాకెట్‌కు సంబంధించిన ఆడిట్ జరుగుతోంది. దానిలోని వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లాంటి ప్రముఖ సంస్థలకు చెందిన సభ్యులు ఉన్న కమిటీ నెలరోజులలో దీనిపై నివేదికను సమర్పించే అవకాశం ఉంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(Polar Satellite Launch Vehicle) (పీఎస్ఎల్వీ)లోని ప్రతి విభాగాన్ని పరిశీలించేందుకు ఇస్రో పలు అంతర్గత కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం ఇది అత్యంత విశ్వసనీయమైన రాకెట్. 94 శాతానికి మించిన విశ్వసనీయత కలిగివుంది. అలాగే 63 ప్రయోగాలలో కేవలం నాలుగుసార్లు మాత్రమే వైఫల్యాలను చవిచూసింది.మూడవ దశలో ఘన ఇంధన మోటారును ఉపయోగిస్తున్నందున పీఎస్ఎల్వీ మాత్రమే కాకుండా మరే ఇతర రాకెట్ కూడా విఫలం కాలేదని అంతరిక్ష సంస్థ వర్గాలు తెలిపాయి. జాతీయ వైఫల్య విశ్లేషణ కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాతనే భవిష్యత్ ప్రయోగాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: యూపీలో నాలుగు కోవిడ్-19 కేసులు నమోదు -
పటిష్ట భద్రత నడుమ పెళ్లికి హాజరైన స్టార్ హీరో
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఆయన తన స్నేహితుడైన అయాజ్ ఖాన్ వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ పెళ్లికి అతని సోదరుడు సోహైల్ ఖాన్, మేనల్లుడు నిర్వాన్ కూడా పాల్గొన్నారు.అయితే ఈ పెళ్లికి హాజరైన సల్మాన్ ఖాన్ తన అత్యంత భద్రతా నడుమ కనిపించారు. పెళ్లి జంటను ఆశీర్వదించేందుకు వై ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో వచ్చారు. అయితే మే 20న తన నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సల్మాన్ పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు. ఇషా చాబ్రియా అనే 36 ఏళ్ల మహిళ నటుడి ఇంట్లోకి ప్రవేశించడండో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. బాంద్రా కోర్టులో హాజరుపరిచగా.. ఆమెను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.ఇక సినిమాల విషయానికొస్తే సల్మాన్ చివరిసారిగా రష్మిక మందన్నతో కలిసి సికందర్ మూవీలో కనిపించారు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించి సాజిద్ నదియాద్వాలా నిర్మించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్, అంజిని ధావన్,జతిన్ సర్నా కూడా నటించారు. ఈ ఏడాదిలో మార్చి 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నేటి నుంచే ఓటీటీలో స్ట్రీమిగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ నలుగురితో కలపకండి: అల్లు అరవింద్
సినిమా థియేటర్ల వివాదంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల మూసివేత అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఏపీలో 1500 థియేటర్లు ఉంటే తనవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో తనకు కేవలం ఒక్క థియేటర్ మాత్రమే ఉందన్నారు. స్టాండ్ అలోన్ థియేటర్లకు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అల్లు అరవింద్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు కూర్చుని మాట్లాడుకోవాలని.. ఏకపక్షంగా వెళ్లడం సరికాదన్నారు.అల్లు అరవింద్ మాట్లాడుతూ..'రెండు రోజుల నుంచి ఆ నలుగురు అనే వార్తలు వస్తున్నాయి. ఆ నలుగురిలో నేను లేను. ఆ నలుగురు అనేది 10 సంవత్సరాలక్రితం ఇప్పుడు 10 మంది పైనే ఉన్నారు. తెలంగాణలో నాకు ఉన్న ఒక్క థియేటర్ ట్రిపుల్ ఏ సినిమాస్ మాత్రమే. ఏపీలో కూడా 15 థియేటర్ల లోపు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. థియేటర్లకు సంబంధించి జరిగిన మూడు సమావేశాలకు నేను వెళ్లలేదు. దయచేసి ఆ నలుగురిలో నన్ను కలపకండి.' అని అన్నారు. -
ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్ నెం.1 లగ్జరీ కారు
కలలను సాకారం చేసుకోవాలంటే..కలలు కంటూ కూర్చుంటే సరిపోదు.. నాకేదీ కలసి రావడం లేదంటూ నిట్టూరిస్తే కుదరదు. కష్టాలను, కన్నీటి సుడిగుండాలను దాటాలి. అడ్డంకులెన్నెదురైనా ఛేదించాలి, అవరోధాలను అధిగమించాలి, ఆలోచనలకు పదునుపెట్టాలి. అదే విజయానికి బాటలు వేస్తోంది. ఆటో డ్రైవర్ నుండి రూ.800 కోట్ల వ్యాపారవేత్త వరకూ ఎదిగిన సత్యశంకర్ స్ఫూర్తిదాయక కథ గురించి తెలిస్తే.. ఎలాంటి వారికైనా ఉత్సాహ రాకమానదు.దృఢ సంకల్పం, అంకితభావం ఉంటే అత్యంత అసాధ్యమైన కలలను కూడా నిజం చేసుకోవచ్చు అనడానికి ఒక చక్కని ఉదాహరణ.కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్లారేలో ఒక పేద గ్రామ పూజారి నలుగురు కుమారులలో మూడవవాడు సత్య శంకర్. పేదరికం కారణంగా 12వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకం కింద రుణం తీసుకుని ఆటోరిక్షా కొన్నాడు. ఆటో-రిక్షా డ్రైవర్‌గా టెక్ సిటీ ఉత్సాహం సత్యాన్ని కూడా ఆవిరించిందో ఏమో గానీ వ్యాపారవేత్తగా మారాలన్న ఆలోచనకు మరింత పదును పెరిగింది. 1980లలో ఆటో-రిక్షా డ్రైవర్‌గా బెంగళూరులోని ట్రాఫిక్ సాగరంలో మునిగి తేలుతూ వీధుల్లో పయనించేవాడు. కష్టపడి ఆటో అప్పు తీర్చేశాడు. దానిని అమ్మి అంబాసిడర్ కారు కొన్నాడు. ఈ ఉత్సాహంతో జీవితాన్ని మెరుగు పరచు కోవాలనే కల సాకారం వైపు అడుగులు వేశాడు. తరువాత కొన్ని రోజులు ఆటోమోటివ్ గ్యారేజ్ వ్యాపారంలోకి ప్రవేశించి టైర్లు అమ్మడం ప్రారంభించాడు. ఆటోమొబైల్ దుకాణాన్ని నడుపు తున్నప్పుడు అతను ఫైనాన్స్ నిర్వహణలోసూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కస్టమర్లు విడిభాగాలను అప్పుకింద కొనుగోలు చేసి, తరువాత వాయిదాలలో చెల్లించేవారు. అతను ఆ అనుభవాన్ని ఉపయోగించి ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. 1994లో, అతను ప్రవీణ్ క్యాపిటల్‌ను ప్రారంభించి, తక్కువ వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాడు. ప్రవీణ్ క్యాపిటల్‌ను ప్రత్యేకంగా నిలిపిన విషయం ఏమిటంటే, అది కొత్త వాహనాలను మాత్రమే కాకుండా, సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయడానికి రుణాలు అందించింది.ఆ తరువాత మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2000లో పుత్తూరు సమీపంలోని నరిమోగేరులో ‘బిందు’ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీని ప్రారంభించాడు. గ్రామీణులకు ఉద్యాగాల కల్పన, శుభ్రమైన నీరు అందించడమే లక్ష్యం. రెండేళ్లకు శంకర్ ఒక ప్రత్యేకమైన రుచితో కార్బోనేటేడ్ డ్రింక్‌తో వ్యాపారంలోకి దిగాడు. స్నేహితులతో ఉత్తర భారతదేశ పర్యటనలో అతను చూసిన సోడా అమ్మే దుకాణమే దీనికి నాంది. జీరా, ఉప్పు మిశ్రమంతో సోడా కలిపితే మంచి ప్రొడక్ట్ అవుతుంది, లాభాలొస్తాయని ఊహించాడు. అంతే 2002లో తన సొంత కంపెనీ ఎస్జీ కార్పొరేట్స్ను స్థాపించాడు. తొలుత “బిందు జీర మసాలా సోడా”ను మార్కెట్లోకి వదిలాడు. కాలం గడిచే కొద్దీ, బిందు జీర మసాలా సోడా ప్రజాదరణ పొందింది. ఇలా ఎస్జీ కంపెనీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , స్నాక్స్ 55 ఉత్పత్తులను విక్రయిస్తుంది. బెంగళూరు దాటి కర్ణాటక అంతటా, అంతకు మించి వినియోగదారులను ఆకర్షించింది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. ఇక వెనుదిరిగి చూసింది లేదు. దాదాపు 20 ఏళ్ల కష్టం సత్యానికి గొప్ప సక్సెస్‌ను అందించింది.ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు ఈ విజయం అంత తేలిగ్గా రాలేదు. సత్యశంకర్ కె స్థాపించిన ఎస్జీ గ్రూప్ బహుళ రంగాల వ్యాపారంగా ఎదిగింది. ఆహారం, పానీయాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఆటో ఫైనాన్స్, సేంద్రీయ వ్యవసాయం,పండ్ల ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో విలువైన సేవలు అందించింది. ఫలితంగా ఎస్జీ గ్రూపు వార్షిక టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లు. ఇదీ చదవండి : కాన్స్‌లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్తోఅంతేనా ఆటో రిక్షాతో ప్రారంభమైన సత్య జీవితం ఇప్పుడు రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIIIదాకా చేరింది. దీని ధర రూ. 11 కోట్లకు పై మాటే. మరో విశేషం ఏమిటంటే సత్యశంకర్ కోసంప్రత్యేకంగా తయారు చేయబడిందన్న ఘనతను కూడా దక్కించుకున్నాడు. బెంగళూరు వీధుల్లో ఆటో నడపడం నుండి రోల్స్ రాయిస్ వరకు, అతని కథ నిజంగా ఆశ, ధైర్యం ,విజయంతో కూడుకున్నది. ఆలోచనలకు, ఆవిష్కరణ హద్దులు లేవన్న స్ఫూర్తికి నిదర్శనం. -
ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్
న్యూయార్క్: ‘నేను ప్రభుత్వం కోసం పనిచేయను. ప్రతిపక్ష పార్టీ కోసం పని చేస్తాను. భారతదేశంలోని ప్రముఖ పత్రికలలో పహల్గామ్ ఘటన అనంతరం వ్యాసాలు రాశాను. ఉగ్రవాదాన్ని తెలివిగా తిప్పితిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని, భారత్ సరిగ్గా అదే చేసిందని వాటిలో పేర్కొన్నాను’ అని ఎంపీ శశిధరూర్(MP Shashi Dharur) వ్యాఖ్యానించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచానికి తెలియజెప్పేందుకు, దీనిపై పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం వివిధ దేశాలలో పర్యటిస్తోంది. ప్రస్తుతం ఈ బృందం న్యూయార్క్‌లో ఉంది. దీనిలో సభ్యునిగా ఉన్న ఎంపీ శశిధరూర్ భారత కాన్సులేట్‌లో ప్రసంగించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుందో, తొమ్మిది ఉగ్రస్థావరాలను ఏ విధంగా నేలమట్టం చేసిందో ఎంపీ శశిథరూర్ వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ప్రపంచమంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూయార్క్‌లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించడం అఖిలపక్ష బృంద సభ్యులకు మొదటి మజిలీ అన్నారు. ఉగ్రవాదం అనేది ఉమ్మడి సమస్య అని, బాధితులకు సంఘీభావం ప్రకటించేందుకు తాము వచ్చామని అన్నారు.అఖిలపక్ష ప్రతినిధి బృందం సందర్శన లక్ష్యం గురించి థరూర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాదం, ఇటీవల జరిగిన ఉగ్రవాద ఘటనలపై విభిన్న వర్గాలతో చర్చించడమే తమ ఆలోచన అని అన్నారు. ప్రతి దేశంలోని కార్యనిర్వాహక సభ్యులను, విదేశాంగ విధాన నిపుణులను కలవడం, మీడియాతో సంభాషించడం దిశగా తమ ప్రయాణం సాగుతుందని అన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి(Pahalgam terror attack) గురించి ప్రస్తావించిన ఆయన మతాల ఆధారంగా ప్రజలను గుర్తించి, వారిని అంతమొందించడానికి కొందరు తిరుగుతున్నారని అన్నారు. బాధితుల్లో ఎక్కువగా హిందువులు ఉన్నారని, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నదని థరూర్ పేర్కొన్నారు.పహల్గామ్లో దారుణం జరిగిన ఒక గంట సేపటికే రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ దీనికి బాధ్యతను ప్రకటించుకున్నదని, ఈ సంస్థ కొన్నేళ్లుగా నిషేధిత లష్కరే తోయిబాకు సహకరిస్తున్నదన్నారు. శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో శాంభవి చౌదరి (లోక్ జనశక్తి పార్టీ), సర్ఫరాజ్ అహ్మద్ (జార్ఖండ్ ముక్తి మోర్చా), జి.ఎం. హరీష్ బాలయోగి (తెలుగు దేశం పార్టీ), శశాంక్ మణి త్రిపాఠి, తేజస్వి సూర్య, భువనేశ్వర్ కె. లత (బీజేపీ), మల్లికార్జున్ దేవ్డా (శివసేన), అమెరికాలోని మాజీ భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి: COVID-19: తేలికపాటివిగా అత్యధిక కేసులు.. గృహ సంరక్షణలో చికిత్స -
రెడ్‌బుక్ అమలులో ఆ సీఐ నంబర్ వన్!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఆ సీఐ ఎప్పుడూ వివాదాల్లోనే మునిగి తేలుతుంటాడు. నా రూటే సప‘రేటు’ అంటూ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో నంబర్ వన్ ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నాడు. టీడీపీ ముఖ్య నేతల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించటం ఆయన ఉద్యోగం. పైకి ఖాకీ యూనిఫాం వేసుకున్నా, లోపల మాత్రం పసుపు చొక్కా ధరించిన పచ్చ కార్యకర్తలా రెచ్చిపోతుంటాడు. ఇదీ పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్‌స్టేషన్ సీఐ పొన్నూరు భాస్కరరావు వ్యవహారం. ఈయన తీరుపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఐదు నెలల క్రితం వరకు భాస్కరరావు గురజాల సీఐగా పని చేశారు. అప్పుడు ఆయనపై ఎన్నో ఆరోపణలొచ్చాయి. ఎమ్మెల్యే యరపతినేని ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తి సీఐ భాస్కర్. యరపతినేని ఏం చెబితే అది చేయడమే ఈయన డ్యూటీ. వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉండే నాయకులను టార్గెట్ చేయడం, వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చావ బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎవరైనా వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు మా వాళ్లను స్టేషన్‌కు తీసుకొచ్చారని అడగడానికి వెళితే ‘పోలీస్‌స్టేషన్‌కు మీరు రాకూడదు.. ఎందుకు వచ్చారు’ అంటూ ఆగ్రహిస్తారు. ఇలా వేధిస్తుండటంపై మీడియాలో కథనాలు రావడంతో సీఐ భాస్కర్‌ను గురజాల నుంచి బదిలీ చేశారు. అయితే యరపతినేని ఆశీస్సులతో పక్క స్టేషన్ అయిన దాచేపల్లి సీఐగా పోస్టింగ్ దక్కించుకున్నాడు. టీడీపీ నేత ప్రోద్బలంతో అక్రమ కేసు టీడీపీ అధికారంలోకి రావడంతో దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఉప్పుతల యల్లయ్య, కుమారుడు హరికృష్ణలపై అక్రమ కేసులతో వేధిస్తుండటంతో తెలంగాణ వెళ్లి డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో పండుగ అని వచ్చిన బీసీ యువకుడు హరికృష్ణపై టీడీపీ నేత షేక్ జానీబాష తన అనుయాయుడితో చెప్పించిన కట్టుకథతో పోలీసులు గురువారం ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు.కేసు పెట్టిన వ్యక్తికి ఎటువంటి రక్త గాయాలు లేవు, ఆసుపత్రిలో చికిత్స పొందలేదు. అయినా హరికృష్ణను పోలీసులు నిర్బంధించారు. పోలీసు వాహనంలో కాకుండా టీడీపీ నేత కారులో తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. కనీసం నడవలేని దుస్థితికి వచ్చేలా కొట్టడంతో గురువారం గురజాల కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. దీంతో గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. రూ.40 లక్షల కోసమే..!సాధారణ ఎన్నికల రోజున జరిగిన గొడవలో హరికృష్ణపై కేసు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఆ గొడవకు సంబంధించి టీడీపీ వాళ్లకు రూ.40 లక్షలు చెల్లించాలని సీఐ భాస్కర్ నేరుగా పంచాయితీ చేశాడు. టీడీపీ నేత జానీబాషా రూ.40 లక్షలు ఇస్తేనే కేసులో రాజీకి వస్తామని ఒత్తిడి చేశారు. దీంతో ప్రతి రోజు స్టేషన్‌కు పిలిపించి ఇబ్బంది పెట్టారు. సీఐ తీరుతో వైఎస్సార్సీపీ నేతలు విసుగు చెంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం సీఐ భాస్కర్ తీరును తప్పుపట్టింది. దీంతో పగబట్టిన భాస్కర్.. అక్రమ కేసులు బనాయించి ఎలాగైనా టీడీపీ నేతలకు రూ.40 లక్షలు ఇప్పించేందుకే ఇవన్నీ చేస్తున్నాడని హరికృష్ణ తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగా, సీఐ భాస్కర్ తీరుపై గురజాల, దాచేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టులో మూడు కేసులు వేశారు. కూటమి నేతలు చేస్తున్న అక్రమ వ్యాపారాలు.. రంగురాళ్ల తవ్వకాలు, గ్రానైట్, ఇసుక తరలించే ముఠాతో సీఐ చేతులు కలిపారని పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. సొంత స్టేషన్‌కు బేడీలు వేసిన ఘనుడు» దాచేపల్లికి వచ్చాక కూడా ఆయనలో ఆవగింజంత మార్పు రాలేదు. కనీసం మీడియాను కూడా స్టేషన్లోకి రానివ్వడు. ఈయన అవినీతిపై మీడియాలో వరుస కథనాలు వస్తున్నా చర్యలు మాత్రం శూన్యం. ఉన్నతాధికారులు తననేమీ చేయలేరని సిబ్బందితో గొప్పలు చెబుతుంటాడు. » సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి గత నెల 17వ తేదీన దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఆమెను కలవడానికి వచ్చిన బంధువులు, న్యాయవాదులను పోలీస్ స్టేషన్లోకి రానివ్వలేదు. పైగా పోలీస్ స్టేషన్ గేట్లు వేసి తాళం బదులుగా బేడీలు వేశారు. ఇంత జరిగినా పోలీస్ ఉన్నతాధికారులు ఇదేంటని ఒక్క మాట మాట్లాడలేదు. »అరెస్ట్ చేసిన కృష్ణవేణిని గురజాల కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆమె సీఐపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా తీవ్రంగా హింసించారని చెప్పారు. తాము చెప్పినట్లు వినకపోతే నీపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతాయని, ఆ కేసుల్లో నిన్ను రాష్ట్రం మొత్తం తిప్పుతామని బెదిరించారని వాపోయారు. తన భర్త రాజ్ కుమార్‌పై గంజాయి కేసు పెడతామని కూడా బెదిరించినట్లు న్యాయమూర్తి ఎదుట కృష్ణవేణి కన్నీరు మున్నీరైనట్టు సమాచారం