విశాఖపట్నం : మత్స్యకారుల పంట పండింది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన జాలర్ల కష్టం ఫలించింది. కాసులు కురిపించే చేపలు, రొయ్యలు వలలకు చిక్కడంతో మత్స్యకారులు సంబరపడ్డారు.
బోట్లు ఒడ్డుకు చేరగా విశాఖ ఫిషింగ్ హార్బర్ లో తాజా రొయ్యలు, చేపలు దర్శనమిచ్చాయి
సుమారు రెండు నెలల విరామం తరువాత ఈ నెల 15వ తేదీన అర్ధరాత్రి వేటకు వెళ్లిన మత్స్యకారులు తొలుత రొయ్యల వేటపైనే అధికంగా దృష్టి సారించారు
దీంతో పింక్ బ్రౌన్ రొయ్యలు అత్యధికంగా లభిం చాయి. చేపలు కూడా విరివిగా దొరకడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు
వేట విరామం తరువాత మత్స్య సంపద ఆశాజనకంగా లభించడంతో కొంత వరకు ఊరట చెందినట్లు మత్స్యకారులు పేర్కొన్నారు
ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


