టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార బర్త్‌డే నిన్న (జూలై 20).
12వ వయసులోకి అడుగుపెడుతున్న సితారను పెద్ద కేక్‌తో సర్‌ప్రైజ్ చేసింది తల్లి నమ్రత. నా అందాల కూతురికి హ్యాపీ బర్త్‌డే.
నీ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నాను.
నీ మనసు బంగారం. ఎప్పటికీ నువ్విలాగే ఉండాలి అంటూ కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.
అటు మహేశ్.. హ్యాపీ 12 మై సన్‌షైన్ అంటూ సితార ఫోటో షేర్ చేశాడు.
తాజాగా సితార.. తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేసింది.
అందులో తన ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా ఎంజాయ్ చేసింది.
ఒక ఫోటోలో హీరోయిన్ శ్రీలీల కూడా ఉంది. మరోవైపు సితార బర్త్‌డే సందర్భంగా గుంటూరులోని బుర్రిపాలెంలో హెల్త్‌క్యాంప్ ఏర్పాటు చేశారు.
దీన్ని 157 మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు.


