బర్త్‌డే అంటే కాస్ట్‌లీ డ్రెస్, కేక్ కటింగ్, వీలైతే పబ్బు, పార్టీలు ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయాయి.
కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ హీరోయిన్ వీటన్నింటినీ పక్కనపెట్టి చాలా హుందాగా బర్త్‌డే జరుపుకుంది.
వృద్ధాశ్రమంలోని అవ్వ, తాతలతో కాలక్షేపం చేసింది. వారికి కడుపు నిండా భోజనం పెట్టింది.
ఆటలు, పాటలు, మాటలతో వారిని కాసేపు నవ్వించింది. అనంతరం ఆ వృద్ధుల ఆశీర్వాదం తీసుకుంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఇంత మంచి మనసు ఉన్న నువ్వు కలకాలం సంతోషంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఈ బ్యూటీ సాఫ్ట్‌వేర్ గండ అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
తిరుట్టు వీసీడీ, అధ్యన్, కాకాకా పో, విశ్వాసం, కుట్టి స్టోరీ, సిండ్రెల్లా, అరణ్మయి 3, భగీర వంటి చిత్రాలతో తమిళంలో పేరు తెచ్చుకుంది.


