మీతా రఘునాథ్.. ఈమె తమిళ హీరోయిన్.
కానీ ఆమె నటించిన గుడ్‌నైట్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం, ఓటీటీలో వేరే లెవల్‌లో ట్రెండ్ అవడంతో తెలుగువారికీ పరిచయమైంది.
పరిచయమేనా.. ఏకంగా కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది.
అయితే అందరి హీరోయిన్లలా సోషల్ మీడియాలో ఎక్కువ హడావుడి చేయదు.
తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోవడానికే ఎక్కువ ఇష్టపడేట్లు కనిపిస్తోంది.
అలా గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకుంది.
ఇప్పుడేమో పెద్దగా హంగూ ఆర్భాటాలు లేకుండా సీక్రెట్‌గా పెళ్లి పీటలెక్కింది.
ఊటీలో పెళ్లి జరగ్గా ఓ నాలుగు ఫోటోలను మాత్రం వదిలింది. ఇది చూసిన ఫ్యాన్స్ అప్పుడే పెళ్లి చేసుకున్నావా?
అని ఓ పక్క బాధపడుతూనే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


