శ్రీ సత్య పూర్తి పేరు మంగళంపల్లి శ్రీ సత్య
1997 జూన్ 29న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లో జన్మించింది
చిన్నప్పటి నుండి ఈమెకు నటనపై ఆసక్తి ఎక్కువ
‘మిస్ విజయవాడ’ ‘మిస్ ఆంధ్రప్రదేశ్’ టైటిల్ ను గెలుచుకుంది
రామ్ హీరోగా తన సొంత బ్యానర్ ‘శ్రీ స్రవంతి మూవీస్’ లో రూపొందిన ‘నేను శైలజ’ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది శ్రీ సత్య
‘లవ్ స్కెచ్’ , ‘గోదారి నవ్వింది’ వంటి చిత్రాల్లో కూడా నటించింది
సినిమాల్లో నటించినా ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు
స్టార్ మాలో వచ్చే ‘ముద్ద మందారం’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది శ్రీ సత్య
నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, త్రినయని సీరియల్స్ లో నటిస్తూ ఈమె పాపులర్ అయ్యింది
ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది శ్రీ సత్య
శ్రీ సత్య తండ్రి పేరు దుర్గా శ్రీనివాస్ ప్రసాద్. తల్లి పేరు లలిత.అలాగే ఈమె సోదరి పేరు సాయి ప్రవల్లిక
శ్రీ సత్యకి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట
సోషల్ మీడియాలో కూడా శ్రీ సత్య చాలా యాక్టివ్ గా ఉంటుంది
ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 4లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు


