సోదరుడి అస్థికలను గోదావరిలో కలిపిన జయప్రద (ఫోటోలు) | Actress Jayaprada mixed her brothers RajaBabu ashes in Godavari Photos | Sakshi
Sakshi News home page

సోదరుడి అస్థికలను గోదావరిలో కలిపిన జయప్రద (ఫోటోలు)

Published Wed, Mar 5 2025 5:34 PM | Last Updated on

Actress Jayaprada mixed her brothers RajaBabu ashes in Godavari Photos1
1/5

ఇటీవల అలనాటి సినీ నటి జయప్రద ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆమె సోదరుడు రాజా బాబు మరణించారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన గురువారం (ఫిబ్రవరి 27) తుదిశ్వాస విడిచారు.

Actress Jayaprada mixed her brothers RajaBabu ashes in Godavari Photos2
2/5

ఈ విషయాన్ని జయప్రద సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాజాగా జయప్రద తన సోదరుడు రాజా బాబు అస్థికలను రాజమండ్రిలోని గోదావరి నది పుష్కర ఘాట్‌లో కలిపారు. ఈ సందర్భంగా తన సోదరుడి గురించి ఆమె మాట్లాడారు.

Actress Jayaprada mixed her brothers RajaBabu ashes in Godavari Photos3
3/5

ఆయన మా జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోయినందుకు మాకు చాలా బాధగా ఉందన్నారు. ఆయన కుమారుడు సామ్రాట్‌తో కలిసి రాజాబాబు జన్మస్థానంలో అక్కడే అస్థికలు కలిపేందుకు వచ్చామని జయప్రద తెలిపారు.

Actress Jayaprada mixed her brothers RajaBabu ashes in Godavari Photos4
4/5

నా సోదరుడు రాజా బాబు ఇక్కడే పుట్టి పెరిగాడు. ఇక్కడే చదువుకున్నాడు. అతనితో ఉన్న ఎన్నో మరవలేని క్షణాలు గుర్తుగా ఉండిపోయాయి. నేను రాజమండ్రి ఎప్పుడొచ్చినా నా సోదరుడితోనే కలిసి వచ్చేదాన్ని. మొదటిసారి ఆయన లేకుండా ఇక్కడికి వచ్చా.

Actress Jayaprada mixed her brothers RajaBabu ashes in Godavari Photos5
5/5

మా జీవితాల్లో రాజాబాబు లేకపోవడం బాధగా ఉంది. అతని కుమారుడైన సామ్రాట్‌తో కలిసి ఈ రోజు ‍అస్థికలు ప్రదానం చేయడానికి వచ్చాం. నా సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement