యాపిల్‌తో ఫైట్‌కు గూగుల్ రెడీ! | You should log out of Facebook before watching porn | Sakshi
Sakshi News home page

యాపిల్‌తో ఫైట్‌కు గూగుల్ రెడీ!

Jun 27 2016 6:52 PM | Updated on Aug 20 2018 2:55 PM

యాపిల్‌తో ఫైట్‌కు గూగుల్ రెడీ! - Sakshi

యాపిల్‌తో ఫైట్‌కు గూగుల్ రెడీ!

అత్యాధునిక టెక్నాలజీతో హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ అందించే మార్కెట్‌లో ఇప్పటికే యాపిల్‌దే తిరుగులేని ఆధిపత్యం.

లండన్‌: అత్యాధునిక టెక్నాలజీతో కూడిన హైఎండ్ స్మార్ట్‌ఫోన్లను అందించే మార్కెట్‌లో ఇప్పటికే యాపిల్‌దే తిరుగులేని ఆధిపత్యం. ఎప్పటికప్పుడు నిత్యనూతనమైన ఫీచర్స్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులను అలరించేలా ఐఫోన్లను అందిస్తున్న యాపిల్‌కు ఇప్పుడు గూగుల్ రూపంలో పెద్ద సవాలు ఎదురుకానుందా? అంటే తాజా వార్తలు అవుననే అంటున్నాయి. యాపిల్ దీటుగా హై ఎండ్ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్లను విడుదలచేయాలని గూగుల్‌ భావిస్తున్నదట. ఈ ఏడాది చివరినాటికి ఈ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయని బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.

గూగుల్ బ్రాండ్‌ పేరిట రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రస్తుతం మొబైల్ ఆపరేటర్లతో గూగుల్ చర్చలు జరుపుతున్నదని ఆ పత్రిక వెల్లడించింది. ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్‌ రంగంలో తిరుగులేని దిగ్గజంగా విరాజిల్లుతున్న గూగుల్‌ ఇటీవల హార్డ్‌వేర్ రంగంలోకి అడుగుపెట్టి సొంతంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, గాడ్జెట్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా గూగుల్ రూపొందించిన ఆండ్రాయిడ్ సిస్టం ప్రపంచంలోని 80శాతం స్మార్ట్‌ఫోన్లలో వినియోగింపబడుతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టి సొంతంగా మొబైళ్లు అందించే దిశగా గూగుల్ అడుగులు వేస్తున్నదని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement