కేబినెట్ ఆమోదించిన విభజన బిల్లును అడ్డుకోవడానికి పార్లమెంటులో సోమవారం నుంచి పోరాటాన్ని కొనసాగిస్తామని టీడీపీ ఎంపీలు చెప్పారు.
సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్ ఆమోదించిన విభజన బిల్లును అడ్డుకోవడానికి పార్లమెంటులో సోమవారం నుంచి పోరాటాన్ని కొనసాగిస్తామని టీడీపీ ఎంపీలు చెప్పారు. టీడీపీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కె.నారాయణరావు, సుజనా చౌదరి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్, సీఎం రమేష్ శుక్రవారం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. సెంటిమెంటులేని ఇటలీ సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని దుయ్యబట్టారు.