'సాక్షి' చేతికి ఫోరెన్సిక్ నివేదిక

'సాక్షి' చేతికి ఫోరెన్సిక్ నివేదిక


హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలు బయటపడుతున్నాయి.  ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక 'సాక్షి' సంపాదించింది. ఓటుకు కోట్లు కేసులో నడిచిన వ్యవహారమంతా వాస్తవాలేనని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కూడా నిర్ధారించింది. ఏసీబీ దాడులు చేసిన సమయంలో రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్న వీడియో, ఆడియో టేపులపై ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ విశ్లేషించింది. దాదాపు 12 రోజులపాటు నిశితంగా విశ్లేషించి... అవన్నీ వాస్తవాలేనని నిర్ధారించింది.



వీడియో, ఆడియో టేపులను ఎవరూ ఎడిట్‌ చేయలేదని, కల్పితాలు కాదని కూడా ల్యాబ్‌ విస్పష్టంగా ప్రకటించింది. ఈ ఫోరెన్సిక్ నివేదిక  ఓటుకు కోటు కేసులో కీలకంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ...నగదు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే.  



ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను మరింత నిర్ధారణ కోసం ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన విషయం తెలిసిందే. రెండు సెల్ఫోన్లు, కెమెరాలు, రేవంత్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సీపీయూలను ల్యాబ్కు పంపారు. అలాగే మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను కూడా ల్యాబ్కు పంపారు. ఆడియోలో ఉన్నది తన గొంతు కాదంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న వాదనల నేపథ్యంలో ఆధారాలను ల్యాబ్కు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 14 ఆడియోలో, వీడియో టేపుల్లో ఉన్న వాస్తవ అంశాలను ల్యాబ్ శాస్త్రీయ రీతిలో నిర్ధారణ చేశారు.



*మొత్తం మూడు ఫైల్స్లో వీడియో దృశ్యాలు

* మొదటి వీడియో ఫైల్ నిడివి 86 నిమిషాల 21 సెకండ్లు

*రెండో వీడియో ఫైల్ నిడివి 10 నిమిషాల 38 సెకండ్లు

*మూడో వీడియో ఫైల్ నిడివి 43 నిమిషాల 9 సెకన్లు



* తొలి ఆడియో ఫైల్ నిడివి 45 నిమిషాల 12 సెకన్లు

* రెండో ఆడియో ఫైల్ నిడివి 44 నిమిషాల 52 సెకన్లు

*మూడో ఆడియో ఫైల్ నిడివి 47 నిమిషాల 18 సెకన్లు



ఎవరు ఎవరితో ఏం మాట్లాడారో మొత్తం విపులంగా రిపోర్టులో పేర్కొన్న ఎఫ్ఎస్ఎల్

ఏసీబీ నుంచి జులై 14న టేపులు అందుకున్న ఎఫ్ఎస్ఎల్, జులై 24న నివేదిక ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top