సీనియర్ జర్నలిస్టు వినోద్ మెహతా మృతి

సీనియర్ జర్నలిస్టు వినోద్ మెహతా మృతి - Sakshi


న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు వినోద్ మెహతా కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఏయిమ్స్లో చేరారు. ఏయిమ్స్లో చికిత్స పొందుతూ వినోద్ మెహత ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.


సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పైనీర్, ఔట్‌లుక్ మ్యాగజైన్‌లకు వినోద్ మహతా సంపాదకుడిగా పనిచేశారు. ఐదు దశాబ్ధాల పాటు జర్నలిజంలో విశేష కృషి చేశారు. 1942 మే 31న వినోద్ మెహతా జన్మించారు. నిష్పక్షపాతంగా వార్తలు ప్రచురిస్తారని దేశవ్యాప్తంగా మెహతాకు పేరుంది. వినోద్ మెహతా మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top