యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్‌లకు నో! | UP govt now bans jeans, t-shirts for college teachers | Sakshi
Sakshi News home page

యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్‌లకు నో!

Apr 6 2017 4:26 AM | Updated on Aug 25 2018 4:34 PM

యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్‌లకు నో! - Sakshi

యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్‌లకు నో!

ప్రభుత్వ విభాగాలను ప్రక్షాళన చేస్తూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు,

లక్నో: ప్రభుత్వ విభాగాలను ప్రక్షాళన చేస్తూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు తదితర చోట్ల పాన్‌ మసాలా, గుట్కాలను నమలడం, పొగతాగడాన్ని యోగి నిషేధించడం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ, ప్రభుత్వ సాయంతో నడిచే కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు, ఇతర సిబ్బంది..

 జీన్స్, టీ–షర్ట్‌లు వేసుకుని విధులకు హాజరవ్వరాదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వస్త్రధారణ పద్ధతిగా, విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులకు ఎలాగూ యూనిఫాం ఉంటుందనీ, ఉపాధ్యాయుల వస్త్రధారణ కూడా పద్ధతిగా ఉంటే, విద్యార్థులు వారిని అనుసరిస్తారని ఉన్నత విద్యా శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement