వివాహేతర సంబంధంతో ఇద్దరి హత్య | Two murdered by illegal relation in anathapuram district | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధంతో ఇద్దరి హత్య

Aug 18 2015 4:23 PM | Updated on Sep 3 2017 7:40 AM

అనంతపురం జిల్లా హిందూపురం మండల పరిధిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం మండల పరిధిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక బీసీ సంఘం అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణ స్వామితో పాటు ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ కల్పనను దుండగులు దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా, మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ రాజగోపాలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం... హిందూపురం సమీపంలోని బెవనహళ్లి వద్ద నారాయణ స్వామి ఓ హౌసింగ్ వెంచర్ వేశారు. తన ఇన్నోవా వాహనంలో కల్పనతో కలసి నారాయణ స్వామి ఆదివారం వెంచర్ వద్దకు వెళ్లారు.

దుండగులు అక్కడే వారిద్దరిని బండరాళ్లతో కొట్టి కత్తులతో నరికి చంపారు. అనంతరం నారాయణస్వామి వాహనంలో పరారయ్యారు. మంగళవారం వెంచర్ వద్ద మృతదేహాలను ఓ గొర్రెల కాపరి చూసి పోలీసులకు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలు బాగా దెబ్బతిన్న స్థితిలో ఉన్నాయి. వాటిని పోస్ట్‌మార్టం కోసం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే వీరిద్దరి హత్య జరిగి ఉంటుందని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement