టాటా, అదానీ పవర్లకు సుప్రీం షాక్‌ | Tata, Adani Can't Raise Power Tariff In 5 States, Says Supreme Court | Sakshi
Sakshi News home page

టాటా, అదానీ పవర్లకు సుప్రీం షాక్‌

Apr 11 2017 3:41 PM | Updated on Sep 2 2018 5:28 PM

టాటా, అదానీ పవర్లకు సుప్రీం షాక్‌ - Sakshi

టాటా, అదానీ పవర్లకు సుప్రీం షాక్‌

నష్టపరిహార టారిఫ్‌ కేసులో టాటా పవర్‌, అదానీ పవర్‌లకు సుప్రీం షాక్‌ ఇచ్చింది.

న్యూఢిల్లీ: నష్టపరిహార టారిఫ్‌ కేసులో టాటా పవర్‌, అదానీ పవర్‌లకు  సుప్రీం షాక్‌ ఇచ్చింది.  అదు రాష్ట్రాల్లో  నష్టపరిహారం చెల్లించాలంటూ గత ఏడాది అప్పిలేట్‌  ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సుప్రీం మంగళవారం పక్కన పెట్టింది.  విద్యుత్‌ చార్జీలను పెంచేందుకు అనుమతించమని  సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. టాటా పవర్, అదానీ పవర్ కంపెనీలు  ఐదు రాష్ట్రాల్లో వినియోగదారులపై భారం మోపడానికి వీల్లేదని  ఆదేశించింది.  తద్వారా  గుజరాత్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లో విద్యుత్ బిల్లులు పెరగకుండా అడ్డుకుంది.  దీంతో టాటా, అదానీ పవర్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అదానీ పవర్‌  15 శాతం టాటా పవర్‌ 5.2 శాతం  నష్టపోయాయి. 
 
అయితే సుప్రీం తీర్పుపై  అదానీ పవర్‌ స్పందించింది. దేశీయ బొగ్గు సరఫరా కొరత కారణంగా  తమకు ఖర్చులు పెరగడంతో గతంలో తమకు ఈ ఊరట లభించినట్టు పేర్కొంది.
 
కాగా 2010లో  ఇండోనేషియా చట్టాల ప్రకారం కోల్‌ ధరలు  పెరిగినకారణంగా చార్జీలు పెంచాలని రెండు కంపెనీలు కోరాయి.  సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ దీనికి సమ్మతించింది. అలాగే గత ఏడాది  ఏప్రిల్‌ లో  ఈకేసులో టాటా,అదానీలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని  అప్పిలేట్‌  ట్రైబ్యునల్‌  తీర్పు చెప్పింది.  దీని ప్రకారం  సంస్థలు డిసెంబర్ లో ఎక్కువ చార్జీ వసూలు చేయటానికి అనుమతించింది. అయితే   ఈనిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ  రాష్ట్ర విద్యుత్ సంస్థలకు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.  ఇండోనేషియానుంచి  ముడిబొగ్గును దిగుమతి చేసుకునే రెండు కంపెనీలు ఐదు రాష్ట్రాల్లో  8620 మెగావాట్ల ఉత్పత్తిని చేస్తున్నాయి. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement