గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ నో | Supreme Court refuses to grant bail to ex-minister Gali Janardhana Reddy | Sakshi
Sakshi News home page

గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ నో

Sep 3 2013 6:12 AM | Updated on Sep 2 2018 5:20 PM

అక్రమ మైనింగ్ కేసుల్లో నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డికి మరో ఎదురుదెబ్బ. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

 సాక్షి, న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసుల్లో నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డికి మరో ఎదురుదెబ్బ. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఏఎంసీ) కేసులో పెండింగ్‌లో ఉన్న బెయిల్ దరఖాస్తు పరిష్కారమైన తర్వాతే ఓఎంసీ కేసులో అర్జీ పెట్టుకోవాలంది. గాలి బెయిల్ పిటిషన్ సోమవారం జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని బెంచ్ వద్దకు విచారణకు వచ్చింది. కనీసం సీబీఐకి నోటీసులు జారీచేయాలని, దర్యాప్తు స్థాయీ నివేదికను కోరాలని న్యాయవాది అభ్యర్థించారు. సీబీఐకి నోటీసులు జారీచేయబోమని, ఏఎంసీ కేసులో పిటిషన్ వ్యవహారం తేలిన తర్వాతే రావాలని తేల్చిచెబుతూ న్యాయమూర్తి పిటిషన్‌ను తిరస్కరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement