సూపర్ స్టార్ కారుకు అడ్డంపడిన నిర్భాగ్యురాలు! | Shah Rukh Khan’s new BMW i8 stopped by a homeless woman in Mumbai | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ కారుకు అడ్డంపడిన నిర్భాగ్యురాలు!

Jun 23 2016 7:23 PM | Updated on Apr 3 2019 4:59 PM

సూపర్ స్టార్ కారుకు అడ్డంపడిన నిర్భాగ్యురాలు! - Sakshi

సూపర్ స్టార్ కారుకు అడ్డంపడిన నిర్భాగ్యురాలు!

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చుట్టూ నిత్యం అభిమానుల వరద పారుతూనే ఉంటుంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చుట్టూ నిత్యం అభిమానుల వరద పారుతూనే ఉంటుంది. తాజాగా ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య రెండుకోట్ల (20 మిలియన్ల)ను దాటింది. ఈ సందర్భంగా అభిమానులు తనపై చూపుతున్న ప్రేమాదరణలకు షారుఖ్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. కానీ షారుఖ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అత్యంత విలాసవంతమైన బీఎండబ్ల్యూ ఐ8లో ఆయన వెళుతుండగా ఓ నిర్భాగ్యురాలు ఆయన వాహనానికి అడ్డంపడింది.

దీంతో ఆమెను షారుఖ్ బాడీగార్డులు పక్కకు ఈడ్చుకెళ్లారు. బాంద్రాలోని షారుఖ్ నివాసం ఎదుట ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో షారుఖ్ కారు నడుపుతున్నారా? లేక కారులో ఉన్నారా? అన్నది కచ్చితంగా తెలియదు. కానీ నిరాశ్రయురాలైన ఆ మహిళ పట్ల షారుక్ బాడీగార్డులు దురుసుగా ప్రవర్తించడం మాత్రం నెటిజన్లకు ఆగ్రహం కలిగిస్తున్నది. హర్యానా నంబర్ ప్లేట్ తో ఉన్న బీఎండబ్ల్యూ ఐ8ను గత వారమే గుర్గావ్ లో షారుఖ్ కొన్నట్టు తెలుస్తున్నది. ‘బీస్ట్’గా పిలిచే ఈ వాహనం ఆన్ రోడ్డు ప్రైస్ ముంబైలో  రూ. 2.78 కోట్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement