ఈ ఏటీఏంలో వద్దంటే క్యాష్..
ప్రభుత‍్వరంగ బ్యాంకుకు చెందిన స్థానిక ఏటీఎం ఒకటి డబ్బులు దానంతట అదే వెదజల్లడం కలకలం రేపింది.
	భువనేశ్వర్: నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న ఒడిశా వాసులు ఆకస్మాత్తుగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.  ప్రభుత‍్వరంగ  బ్యాంకుకు చెందిన స్థానిక ఏటీఎం   ఒకటి డబ్బులు  దానంతట అదే వెదజల్లడం కలకలం రేపింది. ఒడిషాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీంఎంలో ఎలాంటి కార్డు  స్వైపింగ్ లేకుండానే డబ్బును అందిస్తోంది. ఈ వ్యవహారంపై  బ్యాంకు అధికారులు తక్షణమే స్పందించారు.  సాఫ్ట్‌వేర్ మాలావేర్‌అయి వుంటుందని భావిస్తున్నారు. దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించారు.  చుట్టుపక్కల  వివిధ బ్యాంకులకు చెందిన దాదాపు 10  ఏటీఎంలదీ ఇదే పరిస్థితి.
	
	మరోవైపు కాలం చెల్లిన సాఫ్ట్ వేర్లతోనడుస్తున్న  ఏటీఎంలపై  స్థానిక  హ్యాకర్ల  పని అయివుంటుందని  నిపుణులు అనుమానిస్తున్నారు.  ల్యాప్ టాప్  లేదా ఫోన్   మాలావేర్ ఎటాక్ తరహాలో  ఏటీఎంపై  వైరస్ ఎటాక్ జరిగినట్టు నిపుణులు భావిస్తున్నారు.  యూఎస్‌బీ పోర్ట్ ద్వారా ఫైల్స్ లేదా  వైరస్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడం మూలంగా ఏటీఎం మెషీన్లు అసాధారణంగా పనిచేస్తాయని చెప్పారు.  
ఫోరెన్సిక్ ఆడిట్ ప్రస్తుతం కొనసాగుతోందని, దీనికి గల కారణాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఎస్‌బీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 10 ఏటీఎం సెంటర్లు ప్రభావితమయ్యాయని ఎన్‌సీఆర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నవ్రోజ్ దస్తూర్ తెలిపారు.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
