ఆవును దేశమాతగా ప్రకటించాలంటూ గుజరాత్‌లోని రాజ్‌కోట్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఎనిమిది మంది విషం తాగారు. వీరిలో ఒకరు మరణించగా
దేశమాతగా ప్రకటించాలని డిమాండ్
రాజ్‌కోట్: ఆవును దేశమాతగా ప్రకటించాలంటూ గుజరాత్‌లోని రాజ్‌కోట్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఎనిమిది మంది విషం తాగారు. వీరిలో ఒకరు మరణించగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గోవును దేశమాతగా ప్రకటించడంతో పాటు బీఫ్‌ను దేశమంతా పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ జంతు హక్కు సంఘానికి చెందిన 8 మంది విషం తాగేందుకు ప్రయత్నించారు. విషయం తెలియగానే సంఘటనా ప్రాంతానికి వెళ్లామని, భారీగా పోలీసు బలగాల్ని నియమించామని ఏసీపీ కల్పేష్ చావ్డా తెలిపారు. పోలీస్ రక్షణ చేధించుకుని వారు విషం తాగడంతో దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.
చికిత్స పొందుతూ హిండాభాయ్ వాంబాడియా(35) మరణించాడని, పోలీసు వలయం చేధించుకుని విషం ఎలా తాగారన్నదానిపై విచారణ జరుపుతున్నామని ఏసీపీ చెప్పారు. రాజ్‌కోట్ మాజీ ఎంపీ కున్వర్జీ బవాలియా, ‘గో సేవా ఆయోగ్’ చైర్మన్ వల్లబ్‌భాయ్ కథిరియాలు ఆస్పత్రికి వెళ్లగా వారిని గో సంరక్షణ కార్యకర్తలు అడ్డుకున్నారు.