'టీఆర్‌ఎస్ నేతలు ముదురు బేబీస్' | r. krishnaiah fires on trs government | Sakshi
Sakshi News home page

'టీఆర్‌ఎస్ నేతలు ముదురు బేబీస్'

Jul 9 2015 8:04 PM | Updated on Aug 15 2018 9:27 PM

'టీఆర్‌ఎస్ నేతలు ముదురు బేబీస్' - Sakshi

'టీఆర్‌ఎస్ నేతలు ముదురు బేబీస్'

తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటయిందని, తాము అధికారంలోకి వచ్చి ఏడాదే అవుతోందని చెబుతున్న అధికార టీఆర్‌ఎస్ నేతలు "వన్ ఇయర్ బేబీస్ కాదని.. ముదురు బేబీస్" అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఎద్దేవా చేశారు.

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటయిందని, తాము అధికారంలోకి వచ్చి ఏడాదే అవుతోందని చెబుతున్న అధికార టీఆర్‌ఎస్ నేతలు "వన్ ఇయర్ బేబీస్ కాదని.. ముదురు బేబీస్" అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఎద్దేవా చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వివిధ పార్టీల్లో పనిచేసి పలు పదవులు అనుభవించిన ప్రస్తుత టీఆర్‌ఎస్ నేతలు పసిగుడ్డులా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా బీసీ యువజన సంఘం ఆధ్వరంలో నిర్వహించిన నిరుద్యోగ గర్జన సభలో ఆయన మాట్లాడారు.

రాజకీయ నిరుద్యోగులకు, తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిచ్చిన సీఎం కేసీఆర్.. తెలంగాణ కోసం కొట్లాడిన యువకులకు ఉద్యోగాలివ్వరా అని ప్రశ్నించారు. మాట తప్పడంలో, మోసం చేయడంలో కేసీఆర్ మించిన మొనగాడు లేడని, సీఎం అయిన తర్వాత కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్న ఆయన గురించి మాట్లాడేందుకు తమకు సంస్కారం అడ్డువస్తోందని అన్నారు. 'ఖబడ్డార్.. రాష్ట్రం నీ జాగీరా.. వెంటనే డీఎస్సీ ప్రకటించి తెలంగాణలో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పే చర్యలు చేపట్టకపోతే మిమ్మల్ని తిరగనీయం.. ' అని ఆర్,కృష్ణయ్య హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement