ఐటీ దాడుల్లో వెల్లడైన డిపాజిట్ల వివరాలివే!

ఐటీ దాడుల్లో వెల్లడైన డిపాజిట్ల వివరాలివే!

నోట్ల రద్దు అనంతరం డార్మెంట్ బ్యాంకు అకౌంట్ల( దీర్ఘకాలికంగా వాడుకలో లేని బ్యాంకు అకౌంట్లు)లో దాదాపు రూ.25,000 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అంతేకాక లెక్కలో చూపని ఆదాయంగా రూ.3-4 లక్షల కోట్లను గుర్తించినట్టు ఐటీ శాఖ తెలిపింది. పెద్దనోట్ల రద్దు అనంతరం వివిధ బ్యాంకు అకౌంట్లపై ఐటీ శాఖ జరిపిన దాడుల్లో గుర్తించిన డిపాజిట్ వివరాలను ఐటీ శాఖ మంగళవారం వెల్లడించింది.

 

ఈ వివరాల్లో పెద్దనోట్ల రద్దు అనంతరం సుమారు రూ.80వేల కోట్ల రుణాలు తిరిగి చెల్లింపులు జరిగినట్టు చెప్పింది. సహకార బ్యాంకుల్లో వివిధ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసిన రూ.16వేల కోట్లకు పైగా డిపాజిట్లను ఐటీ డిపార్ట్మెంట్, ఈడీ విచారిస్తోందని వెల్లడించింది. 'నవంబర్ 9 నుంచి ఈశాన్య రాష్ట్రాలోని వివిధ బ్యాంకు అకౌంట్లలో రూ.10,700 కోట్లకు పైగా నగదు డిపాజిట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 60 లక్షలకు పైగా బ్యాంకు అకౌంట్లలో రూ.2 లక్షల కంటే ఎక్కువగా డిపాజిట్ అయ్యాయి' అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. 
Back to Top