మిషెల్ ఒబామాకు మోదీ ఆశ్చర్య కానుక! | Obama in India: Modi may gift 100 silk sarees to Michelle | Sakshi
Sakshi News home page

మిషెల్ ఒబామాకు మోదీ ఆశ్చర్య కానుక!

Jan 21 2015 5:57 PM | Updated on Sep 2 2017 8:02 PM

మిషెల్ ఒబామాకు మోదీ ఆశ్చర్య కానుక!

మిషెల్ ఒబామాకు మోదీ ఆశ్చర్య కానుక!

తమ దేశ పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఊహించని కానుక ఇవ్వనున్నారు.

న్యూఢిల్లీ: తమ దేశ పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఊహించని కానుక ఇవ్వనున్నారు. అమోరికా ప్రథమ మహిళకు 100 బనారస్ చీరలు, బనారస్ సిల్క్ మెటీరియల్ కు ఆమెకు బహుమతిగా అందించనున్నారు.

ఈ చీరల ఎంపిక, అందంగా ప్యాక్ చేసి అందించే బాధ్యతను వారణాసి వస్త్ర ఉద్యోగ సంఘంకు అప్పగించారు. ఈమేరకు జౌళీ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. మోదీ తన సొంత నియోజకవర్గం నుంచి చీరలు తెప్పించి మిషెల్ కు కానుకగా ఇవ్వనున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు వెల్లడించారు.

భారత పట్టు అంటే మిషెల్ ఎంతో ఇష్టమన్న సంగతి బహిరంగ రహస్యం. పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఆమె జాక్వర్డ్ పట్టు దుస్తుల్లో మెరిసిన సంగతి విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement