పెళ్లి వేడుకల్లో సోనాక్షి డ్రెస్సింగ్‌ స్టైల్‌ వేరేలెవెల్‌!..పూజకు అందరిలా..! | Sonakshi Sinha Flaunts Sindoor In Red Banarasi Saree At Wedding Reception | Sakshi
Sakshi News home page

పెళ్లి వేడుకల్లో సోనాక్షి డ్రెస్సింగ్‌ స్టైల్‌ వేరేలెవెల్‌!..పూజకు అందరిలా..!

Published Mon, Jun 24 2024 10:25 AM | Last Updated on Mon, Jun 24 2024 11:05 AM

Sonakshi Sinha Flaunts Sindoor In Red Banarasi Saree At Wedding Reception

బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకుంది. పైగా ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్‌ అవార్డును కూడా గెలుచుకుంది. ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న నటుడు జహీర్ ఇక్బాల్‌ని వివాహం చేసుకుంది. అందిరిలా హంగు ఆర్భాటంగా కాకుండా చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంది. పెళ్లి కూతురు ముస్తాబులో సోనాక్షి ఎలా ఉంటుందా అని అభిమానులంతా ఎదురు చూడగా తన స్టైల్‌ వేరేలెవెల్‌ అన్నట్లుగా ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

 

పెళ్లి తంతుకి ముందు జరిగే పూజా కార్యక్రమం, సింధూర ధారణ, రిసెప్టన్‌ వరకు ప్రతి ఘట్టంలో అంచనాలకు అందని విధంగా ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ ఉంది. ఈ గ్రాండ్‌ వివాహ వేడుకలో సోనాక్షి ఎలాంటి చీరలు, డ్రెస్‌లు ధరించిందంటే..

గత కొన్ని రోజులుగా వాళ్ల పెళ్లికి సంబంధించిన పుకార్లకు చెక్‌పెట్టి మరీ ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లికి ముందు సోనాక్షి సిన్హా కుటుంబం తమ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ వేడుక అనంతరం నీలిరంగు డ్రెస్సులో కనిపించింది. ఆమె ధరించిన నీలి రంగు డ్రెస్సు చాలా అందంగా ఉంది. పెళ్లి అనగానే కేవలం లెహెంగాలు, చీరలు మాత్రమే కాదు, ఇలా డ్రెస్సులో కూడా అందంగా ఉండొచ్చని సోనాక్షి నిరుపించింది. 

అలాగే పెళ్లి సమయంలో ఐవరీ చీరలో అద్భుతంగా కనిపించింది. వివాహ వేడుకకు లేటెస్ట్‌ డిజైన్‌తో చీరను ఎంచుకోవడానికి బదులుగా తన తల్లి పూనమ్ సిన్హా పెళ్లి చీరను ఎంచుకుంది. అలాగే శిల్పాశెట్టి రెస్టారెంట్‌లో జరిగిన రిసెప్టన్‌లో సంప్రదాయ ఆభరణాలతో అద్భుతమైన బనారసీ చీరలో గ్లామరస్‌గా కనిపించింది. ఇక ఆమె భర్త ఇక్బాల్‌ బార్యకు అనుబంధంగా తెల్లటి కుర్తా ట్వీట్‌ జాకెట్‌, ప్యాంటుని ధరించారు.  

"సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున మనం కలుసుకున్నాం. ఎన్నో సవాళ్లు, విజయాల తర్వాత తల్లిదండ్రలు, దేవుడి ఆశీర్వాదంతో భార్యభర్తలయ్యాం  అంటూ భావోద్వేగంగా ఇన్‌స్టాగ్రాంలో పోస్టు పెట్టింది సోనాక్షి సిన్హా.

 

(చదవండి: మన దేశంలో ఈ నగరాల్లో ఎట్టిపరిస్థితుల్లో మాంసాహారం దొరకదట..!)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement