టాప్ 100లో ఒక్కటీ లేదు | no single indian university in top-100 list | Sakshi
Sakshi News home page

టాప్ 100లో ఒక్కటీ లేదు

Sep 16 2015 10:17 AM | Updated on Sep 3 2017 9:31 AM

టాప్ 100లో ఒక్కటీ లేదు

టాప్ 100లో ఒక్కటీ లేదు

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మొదటి 100 యూనివర్సిటీల్లో భారతదేశానికి చెందిన వర్సిటీలకు స్థానం దక్కలేదు.

లండన్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మొదటి 100 యూనివర్సిటీల్లో భారతదేశానికి చెందిన  వర్సిటీలకు స్థానం దక్కలేదు. గ్లోబల్ యూనివర్సిటీల ర్యాంకులను మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. ఇండి యన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు 147, ఐఐటీ ఢిల్లీ 179 స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది లాగే మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(అమెరికా) మొదటి స్థానంలో నిలిచింది. నిరుడు నాలుగో స్థానంలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ రెండో స్థానం సంపాదించింది. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యనందించడంలో గ్రేట్ బ్రిటన్ ముందు వరుసలో ఉంది. నగరాల్లో లండన్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ నాలుగు యూనివర్సిటీలు టాప్ 50లో స్థానం సంపాదించాయి. తర్వాత బోస్టన్, న్యూయార్క్ నగరాలు ఉన్నాయి.
 

Advertisement

పోల్

Advertisement