పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంతో సీమాంధ్ర ఎంపీలు బీభత్సం సృష్టించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంతో సీమాంధ్ర ఎంపీలు బీభత్సం సృష్టించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మిరియాల పొడిని స్ప్రే చేశారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సెక్రటరీ జనరల్ వద్ద మైకులు విరగ్గొట్టారు. స్పీకర్ టేబుల్పై అద్దాన్ని పగులగొట్టి దాంతో పొడుచుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఆయన చాకుతో లోక్సభకు వచ్చినట్టు గుర్తించారు.
తెల్లంగాణ బిల్లును నిరసిస్తూ సీమాంధ్ర ఎంపీలు బల్లలపైకి ఎక్కి, కాగితాలు చించేసి విసిరేశారు. వీరిని తెలంగాణ ఎంపీలు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఇరు ప్రాంతాల నేతలు బాహాబాహికి దిగారు. సీమాంధ్ర ఎంపీల బీభత్సంతో పార్లమెంట్ ఉభయ సభలు కురుక్షేత్రాన్ని తలపించింది. లగడపాటి, మోదుగులను బహిష్కరించే యోచనలో స్పీకర్ కార్యాలయం ఉన్నట్టు సమాచారం. వీరిద్దరినీ అరెస్ట్ చేసే అవకాశముందంటున్నారు.