మారుతి లాభాలు జూమ్ | Maruti Suzuki Q3 net zooms 47.46% at Rs 1,744.5 cr | Sakshi
Sakshi News home page

మారుతి లాభాలు జూమ్

Jan 25 2017 1:56 PM | Updated on Sep 5 2017 2:06 AM

మారుతి లాభాలు జూమ్

మారుతి లాభాలు జూమ్

దేశీయ నంబర్ వన్ కార్ మేకర్ మారుతి సుజుకి క్యూ3(అక్టోబర్-డిసెంబర్‌)లో నికర లాభం 48 శాతం (47.46) జూమ్ అయ్యాయి.

న్యూఢిల్లీ: దేశీయ నంబర్ వన్ కార్ మేకర్  మారుతి సుజుకి ఇండియా ఆసక్తికరమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది.  క్యూ3(అక్టోబర్-డిసెంబర్‌)లో నికర లాభం 48 శాతం (47.46) జూమ్ అయ్యాయి.  బుధవారం విడుదల చేసిన మూడో త్రైమాసిక ఫలితాల్లో రూ. 1744 కోట్లను నికర లాభాలను ఆర్జింయింది.   మొత్తం ఆదాయం 13 శాతం పెరిగి రూ. 19,173 కోట్లకు చేరినట్టు మారుతి ప్రకటించింది.  గత ఏడాది ఇదే కాలంలో రూ 16,957.6 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం(ఇబిటా) 16 శాతం ఎగసి రూ. 2489 కోట్లుకాగా, ఇబిటా మార్జిన్లు  14.4 శాతం నుంచి 14.8 శాతానికి బలపడ్డాయి. ఈ కాలంలో ఇతర ఆదాయం రూ. 243 కోట్ల నుంచి రూ. 592 కోట్లకు ఎగసింది.  డిశెంబర్31 నాటికి 8 శాతం వృద్ధితో మొత్తం1,154,164 వాహనాలను విక్రయించింది. ఇందులో 92,291యూనిట్లను ఎగుమతిచేసినట్టు రిపోర్ట్ చేసింది.
ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ హెయ్యర్ సెగ్మెంట్  మోడల్స్ పై పెరిగిన పెట్టుబడులు,  తక్కువ అమ్మకాలు ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ వ్యయం, వ్యయ తగ్గింపు ప్రయత్నాలు తదితర చర్యలు తమ లాభాలు పెంచడానికి దోహదపడింది.  అలాగే   వస్తువు ధరలు ,  ప్రతికూల విదేశీ మారక పెరుగుదల  ఈ త్రైమాసికంలో పాక్షికంగా ప్రభావం చూపినట్టు  పేర్కొంది.

.కాగా ఈ ఫలితాల నేపథ్యంలో మారుతి సుజుకి 0.62 శాతం స్వల్ప లాభంతో  బీఎస్ఈలో రూ 5,775 వద్ద కొనసాగుతోంది.  ఇటీవల బాలెనో,  బ్రెజ్జా లాంటి  మోడల్స్ తో కారు లవర్స్ ను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement