'పార్లమెంట్‌ సర్వాధికారి కాదు' | 'Indian Parliament is not sovereign', Ram Jethmalani counters Arun Jaitley | Sakshi
Sakshi News home page

'పార్లమెంట్‌ సర్వాధికారి కాదు'

Nov 30 2015 10:12 AM | Updated on Sep 3 2017 1:16 PM

'పార్లమెంట్‌ సర్వాధికారి కాదు'

'పార్లమెంట్‌ సర్వాధికారి కాదు'

పార్లమెంటు తీసుకున్నవే తుది నిర్ణయాలు కాదని, కోర్టుల్లో సవాలు చేయొచ్చని ఎన్‌జేఏసీ చట్టాన్ని ఉద్దేశిస్తూ ప్రముఖ న్యాయవాది, బీజేపీ మాజీ నేత రాంజెఠ్మలానీ కొచ్చిలో అన్నారు.

కొచ్చి: పార్లమెంటు తీసుకున్నవే తుది నిర్ణయాలు కాదని, కోర్టుల్లో సవాలు చేయొచ్చని ఎన్‌జేఏసీ చట్టాన్ని ఉద్దేశిస్తూ ప్రముఖ న్యాయవాది, బీజేపీ మాజీ నేత రాంజెఠ్మలానీ అన్నారు. 'జాతీయ న్యాయ నియామకాల కమిషన్' చట్టాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించడాన్ని తప్పు పట్టారు. గత అవీనితి ప్రభుత్వం, ప్రస్తుత అవినీతి సర్కారు ఏకాభిప్రాయ ఉత్పత్తిగా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ను జెఠ్మలానీ వర్ణించారు.

కొచ్చిలో ఆదివారం జరిగిన 1860 ఇండియన్ పీనల్ కోడ్ 155 వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటే సర్వాధికారి కాదని ఆయన స్పష్టం చేశారు. 'పార్లమెంటే సర్వాధికారా అని ఏ రాజకీయ నాయకుడినైనా అడగండి. ముఖ్యంగా ప్రధానమంత్రిని ప్రశ్నించండి. పార్లమెంటే సర్వధికారి కాదని ఎల్ ఎల్ బీ చదువుకున్న వారందరికీ తెలుసు' అని జెఠ్మలానీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement