స్విమ్మింగ్ పూల్ లో పడి ఎన్నారై మహిళ మృతి | Indian-origin woman found dead in swimming pool | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్ పూల్ లో పడి ఎన్నారై మహిళ మృతి

Jul 14 2014 10:08 AM | Updated on Sep 2 2017 10:17 AM

ప్రవాస భారతీయ మహిళ ఒకరు అమెరికాలో ఈతకొలనులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

న్యూయార్క్: ప్రవాస భారతీయ మహిళ ఒకరు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతురాలు రాజకుమారి మోత్వానీ(55)గా గుర్తించారు. ఈతకొలను(స్విమ్మింగ్ పూల్)లో పడి ఆమె మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లాంగ్ ఐలాండ్ లోని ఓ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ను ఆదివారం ఉదయం శుభ్రం చేస్తుండగా రాజకుమారి మృతదేహం బయటపడింది. అంతకుముందు రాత్రి ఆ ఇంట్లో పుట్టినరోజు పార్టీ జరిగినట్టు సల్ఫోక్క్ పోలీసులు తెలిపారు. బర్త్ డే పార్టీకి ఆమె గెస్ట్గా వచ్చినట్టు గుర్తించారు.

రాజకుమారి మృతదేహాన్ని సల్ఫోక్క్ కౌంటీ మెడికల్ అధికారి కార్యాలయానికి తరలించారు. అయితే రాజకుమారి మృతి వెనుక కుట్ర కోణం ఏదీ కనబడలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె మృతికి సంబంధిన వివరాలు తెలిస్తే చెప్పాలని స్థానికులను పోలీసులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement