ప్రియురాలికి చిత్రహింసలు.. పోలీసులకు తిట్లు | Indian-origin man jailed for assaulting woman in Singapore | Sakshi
Sakshi News home page

ప్రియురాలికి చిత్రహింసలు.. పోలీసులకు తిట్లు

Sep 9 2015 9:00 AM | Updated on Jul 6 2019 12:42 PM

ప్రియురాలికి చిత్రహింసలు.. పోలీసులకు తిట్లు - Sakshi

ప్రియురాలికి చిత్రహింసలు.. పోలీసులకు తిట్లు

ప్రియురాలిని చిత్రహింసలు పెట్టడమే కాకుండా పోలీసులను నోటికొచ్చినట్టు తిట్టినందుకు సింగపూర్ లో భారతీయుడొకరు జైలు పాలయ్యాడు.

సింగపూర్: ప్రియురాలిని చిత్రహింసలు పెట్టడమే కాకుండా పోలీసులను నోటికొచ్చినట్టు తిట్టినందుకు సింగపూర్ లో భారతీయుడొకరు జైలు పాలయ్యాడు. నిందితుడు మురుగన్ సుబ్రమణియన్(44)కు కోర్టు 8 నెలల జైలు శిక్ష, సుమారు రూ. 2 లక్షల జరిమానా విధించిందని స్థానిక మీడియా వెల్లడించింది.

తన మాజీ భర్త ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టినందుకు ప్రియురాలు రాధిక రాజావర్మ(31)తో మురుగన్ ఘర్షణ పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమె ముఖంపై సిగరెట్ తో వాతలు పెట్టాడు. మార్చి 31న అతడీ దారుణానికి పాల్పడ్డాడు. దీనికి 15 రోజుల ముందు స్నేహితుల ముందు తనను అవమానించిందని రాధికతో గొడవపడ్డాడు. ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవడంతో పూలకుండీలు ధ్వంసం చేసి రభస సృష్టించాడు. సమాచారం అందుకుని తన ఇంటికి వచ్చిన పోలీసులపై నోరు పారేసుకున్నాడు.

తన సోదరి మేడమ్ విలాహ్, ఆమె 16 ఏళ్ల కుమార్తెను కత్తితో బెదిరించాడు. ప్రియురాలిని హింసించిన కేసులో అతడికి విధించిన జైలు శిక్ష ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని కోర్టు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement