'పాక్ కు అవసరమైన సహాయం చేస్తాం' | India stands firmly with Pakistan in fight against terror, says modi | Sakshi
Sakshi News home page

'పాక్ కు అవసరమైన సహాయం చేస్తాం'

Dec 16 2014 11:12 PM | Updated on Aug 15 2018 2:20 PM

పెషావర్ లోని ఆర్మీ పాఠశాలపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో ఫోన్ మాట్లాడారు.

న్యూఢిల్లీ: పెషావర్ లోని ఆర్మీ పాఠశాలపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో ఫోన్ లో మాట్లాడారు. దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు.

తీవ్రవాదంపై పోరుకు పాకిస్థాన్ కు అండగా ఉంటామని హామీయిచ్చారు. ఉగ్రవాదుల దాడితో బాధలో ఉన్న పాకిస్థాన్ కు అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నవాజ్ షరీఫ్ తో మోదీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement