ఐబీఎంలో 2వేల ఉద్యోగాలు | IBM announces plans to hire 2,000 US veterans | Sakshi
Sakshi News home page

ఐబీఎంలో 2వేల ఉద్యోగాలు

Mar 18 2017 11:40 AM | Updated on Aug 24 2018 8:39 PM

ఐబీఎంలో 2వేల ఉద్యోగాలు - Sakshi

ఐబీఎంలో 2వేల ఉద్యోగాలు

న్యూయార్క్ ఐటీ దిగ్గజం ఐబీఎం కొత్త ఉద్యోగాల జాతర ప్రకటించబోతుంది.

న్యూఢిల్లీ : న్యూయార్క్ ఐటీ దిగ్గజం ఐబీఎం కొత్త ఉద్యోగాల జాతర ప్రకటించబోతుంది. దాదాపు 2000వేల మంది అమెరికన్ నిపుణులను కొత్తగా కంపెనీలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. వచ్చే నాలుగేళ్లలో 25వేల మందిని నియమించుకోనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నియామకంలో భాగంగా 2వేల మందిని ప్రస్తుతం నియమించుకోబోతున్నట్టు తెలిపింది. ఐబీఎం జాబ్స్ అందుబాటులోని వెబ్ సైట్ లో ఇప్పటికే 35 ప్రాంతాల్లో 13 కేటగిరీల్లో 3400 ఉద్యోగాలను అందుబాటులో ఉంచింది. దీనిలో 700 పైగా స్థానాలు నార్త్ కరోలినాలో ఆఫర్ చేస్తోంది.
 
కొత్తగా సృష్టించబోయే ఉద్యోగాల్లో చాలా పొజిషన్లకు నాలుగేళ్ల కాలేజీ డిగ్రీ అవసరం లేదని కంపెనీ తెలిపింది.  వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన భేటీ అనంతరం కంపెనీ ఈ ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ తో జరిగిన భేటీలో జర్మన్ ఛాన్సలర్ మెర్కిల్, ఇతర బిజినెస్ లీడర్లతో పాటు కంపెనీ సీఈవో గిన్నీ రోమెట్టి కూడా పాల్గొన్నారు. సాఫ్ట్ వేర్ వాడే రక్షణ, న్యాయ సంబంధమైన పరిశ్రమల్లో తాము ఉద్యోగులకు ఉచిత ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్టు కంపెనీ పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement