లోక్సభ రేసులో ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులు | Former Infosys CFO V Balakrishnan to be AAP candidate from Bangalore Central | Sakshi
Sakshi News home page

లోక్సభ రేసులో ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులు

Mar 10 2014 2:38 PM | Updated on Aug 29 2018 8:56 PM

లోక్సభ రేసులో ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులు - Sakshi

లోక్సభ రేసులో ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులు

లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 60 మంది అభ్యర్థుల పేర్లతో నాలుగో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) విడుదల చేసింది.

న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 60 మంది అభ్యర్థుల పేర్లతో నాలుగో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) విడుదల చేసింది. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ వి. బాలకృష్ణన్, పాత్రికేయుడు ఆశిష్ కేతన్ పేర్లు ఇందులో ఉన్నాయి. బాలకృష్ణన్ సెంట్రల్ బెంగళూరు నుంచి పోటీ చేయనున్నారు. ఇన్ఫీ డెరైక్టర్ పదవిని వదులుకుని ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆశిష్ కేతన్ న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగనున్నారు.

ఇన్ఫోసిస్ మాజీ సీఈవో నందన్ నిలేకని కూడా లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. దక్షిణ బెంగళూరు లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నందన్ పోటీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement