కాశ్మీర్లోని అతి పెద్ద ప్రసూతి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం | Fire in OPD of Kashmir's biggest maternity hospital | Sakshi
Sakshi News home page

కాశ్మీర్లోని అతి పెద్ద ప్రసూతి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Nov 5 2013 10:17 PM | Updated on Sep 5 2018 9:45 PM

జమ్ము కాశ్మీర్లోనే అతి పెద్దదైన ప్రసూతి ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో అగ్నిప్రమాదం చెలరేగింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఒకేసారి 18 అగ్నిమాపక శకటాలను అక్కడకు తరలించారు.

జమ్ము కాశ్మీర్లోనే అతి పెద్దదైన ప్రసూతి ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో అగ్నిప్రమాదం చెలరేగింది. వజీర్బాగ్ ప్రాంతంలోని ఈ ఆస్పత్రిలో మంటలు చెలరేగినా, ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. 500 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలోని ఓపీడీ విభాగంలో ఈరోజు సాయంత్రం పొగలు రావడాన్ని అక్కడి సిబ్బంది గమనించినట్లు అగ్నిమాపక దళాధికారి తెలిపారు.

మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఒకేసారి 18 అగ్నిమాపక శకటాలను హుటాహుటిన అక్కడకు తరలించారు. ఆస్పత్రిలో ఉన్న రోగులు, వారి సహాయకులను వెంటనే అక్కడకు సమీపంలో ఉన్న ఇన్ పేషెంట్ విభాగానికి తరలించారు. అయితే ఈ సంఘటనపై అధికారులు సత్వరం స్పందించడంతో ఎవరూ గాయపడలేదని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement