
ఏఐసీసీ సమావేశాలలో పీవీ చిత్రపటం
దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు చిత్రపటానికి తొలిసారి ఏఐసీసీ సమావేశాల్లో చోటు దక్కింది.
న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు చిత్రపటానికి తొలిసారి ఏఐసీసీ సమావేశాల్లో చోటు దక్కింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయటం గమనార్హం. దేశ ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్న తెలుగువాడు అయిన పీవీ నర్సింహారావుకు ఆయన మరణాంతరం కాంగ్రెస్ తీరని అవమానం, అన్యాయం చేసింది.
పీవీ మరణించిన అనంతరం కనీసం ఢిల్లీలో కూడా ఘాట్ ఏర్పాటు చేయని మొదటి ప్రధానిగా పీవీ నిలిచారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పీవీకి సరైన గౌరవం దక్కడం లేదు. ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను కూడా అంతగా పట్టించుకోలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం పీవీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయటం గమనార్హం.