యువ స్టార్‌ గాయనికి ఫత్వా షాక్‌! | fatwa against reality singing star | Sakshi
Sakshi News home page

యువ స్టార్‌ గాయనికి ఫత్వా షాక్‌!

Mar 15 2017 12:42 PM | Updated on Sep 5 2017 6:10 AM

యువ స్టార్‌ గాయని నహిద్‌ అఫ్రిన్‌కు వ్యతిరేకంగా 42 మంది ఇస్లామిక్‌ మతగురువులు ఫత్వా జారీ చేశారు.

గువాహటి: యువ స్టార్‌ గాయని నహిద్‌ అఫ్రిన్‌కు వ్యతిరేకంగా 42 మంది ఇస్లామిక్‌ మతగురువులు ఫత్వా జారీ చేశారు. ఆమె బహిరంగంగా పాటలు పాడవద్దంటూ హుకుం జారీచేశారు. ప్రముఖ టీవీ మ్యూజిక్‌ రియాలిటీ షో 'ఇండియన్‌ ఐడల్‌'లో ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచిన నహిద్‌ అఫ్రిన్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన 'అకిరా' సినిమాలో ఓ పాటను పాడటం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

స్టార్‌ సింగర్‌గా పేరొందిన ఆమె ఈ నెల 25న గువాహటిలో ఓ బహిరంగ కచేరిలో పాడబోతున్నది. అయితే, బహిరంగ కచేరి వేదిక మసీదుకు, శ్మశానానికి దగ్గరగా ఉందని, కాబట్టి ఆమె సంగీత కచేరిని బహిష్కరించాలంటూ మతగురువులు ఫత్వా జారీచేశారు. ఆమె బహిరంగంగా పాటలు పాడకూడదంటూ ఫత్వాలో పేర్కొన్నారు. అయితే ఈ ఫత్వాతో బెదిరేది లేదని, సంగీతాన్ని వీడబోనని నహిద్‌ స్పష్టం చేసింది. 'ఈ ఫత్వా నన్ను షాక్‌ గురించింది. ఛిన్నాభిన్నం చేసింది. ముస్లిం గాయకుల స్ఫూర్తితో నేను పాడుతున్నారు. వారి స్ఫూర్తిని కొనసాగిస్తాను. సంగీతాన్ని ఎప్పుడూ వీడను' అని ఆమె స్పష్టం చేసింది. సంగీతం నాకు దేవుడు ఇచ్చిన కానుక. దానిని విస్మరించడమండే దేవుడిని విస్మరించడమేనని ఆమె పేర్కొంది. ఫత్వా ఎదుర్కొంటున్న ఆమెకు పూర్తిస్థాయిలో భద్రత కలిస్తామని, అండగా ఉంటామని అసోం సీఎం శరబానంద్‌ సోనోవాల్‌ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement