ఇరాక్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన 46 మంది భారతీయ నర్సులు ఊహించని జాబ్ ఆఫర్ లభించింది.
దుబాయ్: ఇరాక్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన 46 మంది భారతీయ నర్సులు ఊహించని జాబ్ ఆఫర్ లభించింది. వీరికి ఉద్యోగాలిచ్చేందుకు దుబాయ్ కు చెందిన ఎన్నారై వ్యాపారవేత్త, ఎన్ఎంసీ హెల్త్కేర్ గ్రూపు సీఈవో డాక్టర్ బీఆర్ శెట్టి ముందుకు వచ్చారు. అలాగే దుబాయ్ వారు ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఈ మేరకు ఎన్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
ఇరాక్ హింస కారణంగా భారతీయ నర్సులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి శనివారం స్వదేశానికి తిరిగొచ్చారు. వీరికి ఉద్యోగాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేరళ ముఖ్యమంత్రి ఒమన్ చాందికి బీఆర్ శెట్టి తెలిపారు. దుబాయ్, ఈజిప్టు, భారత్ లో ఆయన ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. భారత్ కు తిరిగొచ్చిన నర్సులలో 45 మంది కేరళకు, ఒకరు తమిళనాడుకు చెందినవారున్నారు.