ప్రణబ్‌ తదుపరి చిరునామా అదే | Delhi's 10 Rajaji Marg Being Readied As President Pranab Mukherjee's Retirement Home | Sakshi
Sakshi News home page

ప్రణబ్‌ తదుపరి చిరునామా అదే

Apr 27 2017 9:40 AM | Updated on Sep 5 2017 9:50 AM

ప్రణబ్‌ తదుపరి చిరునామా అదే

ప్రణబ్‌ తదుపరి చిరునామా అదే

పదవీ విరమణ తరువాత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఢిల్లీలోని 10, రాజాజీమార్గ్‌లో ఉన్న కొత్త అధికార నివాసానికి మారనున్నారు.

న్యూఢిల్లీ: జూలైలో పదవీ విరమణ తరువాత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఢిల్లీలోని 10, రాజాజీమార్గ్‌లో ఉన్న కొత్త అధికార నివాసానికి మారనున్నారు. ఇప్పటి వరకు ఈ బంగ్లాలో ఉన్న కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మ ఇటీవలే ఖాళీ చేశారు. ఈ భవనాన్ని ప్రణబ్‌కు అందుబాటులోకి తేవడానికి పనులు జరుగుతున్నాయి. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం చనిపోయే వరకు ఈ నివాసంలోనే ఉన్నారు. ఆ తరువాతే మహేశ్‌ శర్మకు కేటాయించారు.

11,776 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న 10, రాజాజీ మార్గ్‌ ఇంటి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గ్రంథాలయం ఉంది. ఈ నివాసం ఖాళీ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని మహేశ్‌ శర్మ తెలిపారు. తన కంటే రాష్ట్రపతికే ఈ నివాసం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన దేశంలో ఎక్కకైనా ఉచిత నివాసం కల్పిస్తారు. నీళ్లు, కరెంట్‌ ఉచితంగా సరఫరా చేస్తారు. 1962 పెన్షన్‌ నిబంధనలు వర్తింపజేస్తారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement